
















































































































పెద్ద కర్మ కు సంభందించిన కార్యక్రమం .. లైవ్ లో ఏమి చూస్తాములే .. అనుకొంటున్నారా ?
https://www.youtube.com/live/xwuizqjtpew?si=hSZZ2P-nvVAWV1X4
*మాతృస్ మృతి సంఘం!*
*యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం - రేపు, ఆదివారం, 30 ఆగస్టు 2026, ఉదయం 11:52 గంటల నుండి*
1. *జమునమ్మ & శ్రీరాములు (వాసిరెడ్డి అమర్‌నాథ్ తల్లిదండ్రులు) జీవితంపై లఘు చిత్రం* - జీవిత నైపుణ్యాలు, విలువైన పాఠాలు, మరియు శ్రీ అమర్‌నాథ్ గారి బాల్యపు సంగ్రహావలోకనంతో నిండిన చిత్రం.
*సమయం: ఉదయం 11:52 నుండి రాత్రి 12:22 వరకు*
2. *మాతృత్వానికి నివాళి* - వందేమాతరం శ్రీనివాస్ మరియు బృందం వారి సాంస్కృతిక కార్యక్రమం.
*సమయం: మధ్యాహ్నం 12:23 నుండి 1:44 వరకు*
ఈ కార్యక్రమం సంఘానికి సంబంధించిన అర్థవంతమైన సందేశాలతో నిండి ఉంటుంది!
*మీకు తీరిక ఉంటే తప్పకుండా వీక్షించండి.*
A Gathering in Memory of Mother on the Thirteenth Day!




వీర మణికంఠుడు !
మంచు కరిగే వేళలో ...
ఫెయిల్యూర్ కొడుకు ; అనాయాస మరణం !
పెరుగుట ... కూలుట కొరకే !
అయ్యోరు - అయ్యోరమ్మ - వోల్ల కొడుకు - కూతురు !


























* అయ్యోరమ్మ కథ !










ఈ రోజు వార్తలు - విశ్లేషణ
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి కదా !


https://youtu.be/VGw1VZDE6Ow?si=O97b-2whx3dmBUrs
మిత్రులారా! నమస్సులు!

హరివిల్లునా.. | పూర్తి తెలుగు వీడియో పాట | వంజవాక సాహిత్యం







































ప్రియమైన తల్లిదండ్రులారా!

ఇందాకే ఒక టీవీ ఛానల్ లో ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి పాడుతోంది !
జంధ్యాల సినిమాలో సుత్తి వేలు .. ఎండలో ఆరేస్తే బట్టలు త్వరగా ఎండుతాయి .. మేడపై నుంచి దూకితే ఒంటికి దెబ్బతగులుతుంది .. లాంటి కొన్ని అద్భుత విషయాలను కనిపెడుతాడు . ఈ వార్త చదివితే మహానుభావుడు జంధ్యాల గుర్తుకొచ్చాడు
https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II...
25 మే నాటి నా పోస్ట్ .. బాగా చదవండి .




భారతదేశపు నల్ల ధన ప్రవాహం ఇప్పుడు ఎక్కువగా ఎటు వైపు ?




































అమెరికా టెక్సాస్ టీచర్ ఏడుస్తూ ఏదో చెబుతున్నాడు . ఆంగ్లం అర్థం కాకపోయినా విషయం అవగతమవుతుంది . చూడండి . అదే కారణంతో వైజాగ్ మానసిక చికిస్థ కేంద్రం పిల్లలతో నిండిపోతోంది .. ఈ వివరణ తెలుగులో ఉంది . సమస్య సరే . దీనికి పరిష్కారం ? చివరి దాక చూస్తే అది కూడా ఉంది . ఎంత మంది అర్థం చేసుకొని పాటిస్తారు అనేదే సమస్య !
సతీష్ గారు కుండ బద్దలు కొట్టేశారు !
ఎవరికీ తెలియని కొన్ని విషయాలు!
"ఇంజనీరింగ్/ మెడిసిన్.. చేసి జాబ్ మార్కెట్ లోకి వచ్చిన వారికి ఉద్యోగం దొరకడం కష్టమైపోతోంది .
సుమారుగా మూడేళ్ళ క్రితం 60 వేలు ధరగా ఉన్నప్పుడు .. “ కొనండి .. భారీగా పెరుగుతుంది “
దోపిడీ!
సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా మారుతున్న నేపథ్యంలో
1. ఎన్ని డిగ్రీ లున్నాయి అనేది కాదు . ఎంత నైపుణ్యం ఉంది అనేది ముఖ్యం !
2. ఎంత అనుభవం ఉంది అనేది కాదు ! ఎంత త్వరగా నేర్చుకోగలం అనేది ముఖ్యం !
నిరంతర అధ్యయనం !
అభిజ్ఞావశ్యత !

వాసిరెడ్డి శ్రీరాములు, జమునమ్మ !
నాటి ఫొటోకు AI మెరుగులు !

వాడే వీడు !

ఫండమెంటల్స్ మరిస్తే అంతే సంగతులు !
2243 బడుల్లో ఒక్కే ఒక్కటి !
ఆ బడి పేరేంటో చెప్పుకోండి !

మీరో అందమైన ఇల్లు కట్టారు.
అందులో నివసించడం మీ హక్కు, మీ బాధ్యత. కానీ ఆ ఇంటిని ఖాళీగా వదిలేశారు. దాన్ని అవకాశంగా తీసుకొని ఒక మాఫియా వ్యక్తి అందులోకి దూరి, "ఈ ఇల్లు నాదే" అని ప్రకటించాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? "అయ్యో... కాలం మారింది... ఏమీ చేయలేం... ఇల్లు కట్టకపోతే బాగుండేది" అని బాధపడితే సమస్య పరిష్కారం అవుతుందా?
అలాగే మన జన్యువులను (DNA) మన పిల్లలకు అందిస్తాము. వ్యక్తిత్వ లక్షణాల్లో దాదాపు నలభై శాతం జన్యుపరంగా వస్తాయని శాస్త్రం చెబుతోంది. తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మల నుంచి వచ్చిన లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి. మరి మిగిలిన అరవై శాతం? వారు చిన్ననాటి నుంచి చూసేది, వినేది, నేర్చుకునేది, అనుభవించేది వారి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. అంటే పిల్లల వ్యక్తిత్వానికి అసలు పునాది మన పెంపకమే.
పుట్టుకతో వారికి DNA ఇచ్చేశాం. కానీ మిగిలిన అరవై శాతం ఎలా తీర్చిదిద్దాలి? దానికి సమాధానం – సాంస్కృతిక DNA. కథలు చెప్పడం, కబుర్లు చెప్పడం, కుటుంబ విలువలు నేర్పడం, సంస్కృతి పరిచయం చేయడం – ఇవే పిల్లల సాంస్కృతిక DNA.
తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు, అంధులైన తల్లిదండ్రులను భుజాలపై మోసిన శ్రవణ కుమారుడు వంటి కథలను చిన్నప్పటి నుంచే పిల్లల హృదయాల్లో నాటితే, వారు అమెరికాలోనో, చంద్రుడిపైనో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా... పెద్ద ఉద్యోగాలు చేసినా... వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టే అవకాశం చాలా తక్కువ.
కానీ నేడు చాలామంది తల్లిదండ్రుల ఆలోచన వేరుగా ఉంది. "ఆరో తరగతికి వచ్చేశాడు. ఇక ఆటలు, కథలు ఎందుకు? బాగా చదివి IIT సీట్ కొట్టాలి. తర్వాత అమెరికా వెళ్లాలి. ఈ స్కూల్ ఏమిటి? నాలుగు గంటలకే పిల్లలను పంపేస్తోంది. చైనా కోచింగ్ ఫ్యాక్టరీల్లో అయితే రాత్రి ఎనిమిది వరకు క్లాసులు ఉంటాయి" అని భావిస్తున్నారు.
చాలామంది పిల్లలను బంధువులతో కలవనివ్వరు. పండుగలు, కుటుంబ వేడుకలు, పెద్దలతో గడిపే సమయం కూడా తగ్గిపోయింది. మంచి-చెడు చెప్పే అవకాశాన్ని తల్లిదండ్రులే కోల్పోతున్నారు.
నా పరిశీలనలో, పిల్లలు ఆరో తరగతికి చేరిన తర్వాత నూటికి అరవై శాతం తెలుగు తల్లిదండ్రులకు ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఇక పిల్లలు రోజుకు పదహారు గంటలు చదవాలని భావిస్తారు. పదో తరగతి, ఇంటర్, IIT-JEE, NEET పరీక్షలు దగ్గరపడితే ముఖ్యంగా తల్లులలో తీవ్ర ఒత్తిడి కనిపిస్తుంది. నిద్ర ఉండదు, తిండి తినలేరు, ఎప్పుడూ పరీక్షల గురించే ఆలోచిస్తారు.
నాలుగేళ్ల క్రితం స్లేట్ తిరుపతిలో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నేను కౌన్సెలింగ్ ఇస్తున్నాను. "ఆప్టిట్యూడ్ ఎలా గుర్తించాలి? దానికి తగ్గ కెరీర్ ఎలా ఎంచుకోవాలి? పీర్ ప్రెజర్, చెడు స్నేహాలు, స్పీడ్ బైక్స్, జీవిత నిర్ణయాలు" వంటి అంశాలపై మాట్లాడుతున్నాను. పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు.
అప్పుడొక తల్లి లేచి, "సార్! పబ్లిక్ పరీక్షలకు నాలుగు వారాలే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలో చెప్పండి" అని అడిగింది. నేను, "ఈ విషయాలు ఇప్పటికే వారికి నేర్పాం. ఇది జీవితానికి ఉపయోగపడే చివరి కౌన్సెలింగ్ క్లాస్" అని చెప్పాను.
కొద్దిసేపటికే మరో ఇద్దరు తల్లిదండ్రులు కూడా అదే ప్రశ్న అడిగారు. వారికి పరీక్ష మార్కులే ముఖ్యమని అనిపించింది. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థుల కోసం 'సంపూర్ణత' పుస్తకాన్ని సిద్ధం చేశాం. అందులో కృత్రిమ మేధస్సు యుగంలో కెరీర్లు, ఇంజినీరింగ్ భవిష్యత్తు వంటి వందకు పైగా పేజీల విలువైన సమాచారం ఉంది.
ఆ పుస్తకం తయారు చేయడానికి దాదాపు నెలరోజులు పట్టింది. కానీ అన్ని బ్రాంచ్‌లలో కలిపి కేవలం ఇరవై శాతం తల్లిదండ్రులే కొనుగోలు చేశారు. "పదో తరగతి వచ్చేసింది. ఇప్పుడు పరీక్షలే ముఖ్యం. సంపూర్ణత ఎందుకు?" అనే ఆలోచన వారికి ఉండి ఉండవచ్చు.
మరి పిల్లల వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాలి? వారికి కథలు చెప్పాలి. వారి వయస్సుకు తగ్గ సమకాలీన అంశాలపై చర్చించాలి. నేను నిన్న రాసిన గుప్తగారి కథను పన్నెండేళ్లు దాటిన ప్రతి పిల్లవాడితో తల్లిదండ్రులు చర్చించాలి.
పిల్లలు IITలో సీట్ కొట్టి, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తే చాలు, బంధాలు అవసరం లేదు, డబ్బు, హోదా మాత్రమే ముఖ్యం అని పెంచితే... అదే ఆలోచన వారు కూడా అలవాటు చేసుకుంటారు. రేపు మీ అవసర సమయంలో మీ వద్ద ఉండకపోవచ్చు.
డబ్బు ముఖ్యం. కానీ విలువలు మరింత ముఖ్యం. గంజాయి విత్తనాలు నాటి, మద్యం పోసి పెంచితే తులసి మొక్క మొలవదు. అలాగే మంచి పెంపకం లేకపోతే మంచి వ్యక్తిత్వం కూడా ఏర్పడదు. దానికి తోడు చెడు సావాసం ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరం.
పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే ప్రపంచంలోని చెడు విషయాలన్నీ వారి మనసులోకి చేరే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులు మాదకద్రవ్యాలను పాఠశాలలోకి తీసుకువచ్చి ఉపయోగించిన సంఘటన జరిగింది. బ్యాగ్ చెకింగ్ సమయంలో అవి దొరకకుండా ఉండేందుకు ప్రైమరీ పిల్లల బ్యాగుల్లో దాచేవారని తెలిసింది.
ఏ స్కూల్ అని తెలుసుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. మీ పిల్లలను అడగండి – "మీ స్కూల్‌లో పిల్లలు అసభ్య పదాలు మాట్లాడుతారా? అనుచిత వీడియోల గురించి చర్చిస్తారా? వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతారా?" అని.
పిల్లలు నిజం చెప్పకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు వారి డిజిటల్ అలవాట్లు, బ్రౌజింగ్ హిస్టరీపై శ్రద్ధ పెట్టాలి.
ఇది పెద్ద పిల్లల సమస్య మాత్రమే కాదు. కొన్ని రోజుల క్రితం మా పాఠశాలలో UKG విద్యార్థి మరో చిన్నారితో అనుచితంగా ప్రవర్తించాడు. విచారణలో తెలిసింది ఏమిటంటే, అతను గతంలో చదివిన పాఠశాలలో మొబైల్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాటు మాన్పించాలనే ఉద్దేశంతో అతని తల్లి మా పాఠశాలలో టీచర్‌గా చేరి, అతన్ని ఇక్కడ చేర్పించింది. ఇప్పుడు మొబైల్ చూడకపోయినా, చిన్న వయస్సులో చూసిన దుష్ప్రభావం అతని ప్రవర్తనలో కనిపించింది.
మరి మీ బిడ్డ పరిస్థితి ఏమిటి? మీ పిల్లలు చదివే పాఠశాలలో కూడా మొబైల్ వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని మీరు అడగలేరా? మీరు మంచి-చెడు నేర్పకపోతే, ఖాళీగా ఉన్న వారి మనసును చెడు సావాసం, ఇంటర్నెట్ ప్రపంచం ఆక్రమించడం ఖాయం.
ఇది శాపం కాదు. జ్యోతిష్యం కాదు. కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మీ పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలని, మీ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చెబుతున్న మాటలు ఇవి. నా మాటలు కొంచెం ఘాటుగా అనిపిస్తే దయచేసి క్షమించండి.
శివ చరణ్ రామ్ రతన్ గుప్త ముంబై కు చెందిన వస్త్ర వ్యాపారి .


ఒక్కసారి కాదు ! పదేపదే చూడమని నా అభ్యర్థన !
శనివారం - గీతాంజలి పాఠశాల - వినుకొండ





బాలమిత్ర -77 గీతాంజలి, వినుకొండ
2000 మంది పిల్లలు, 150 మందికి పైగా ఉపాధ్యాయులు
ఒకటి మూడు గంటలు!








దిగువ ఉన్నది నిన్నటి క్లాస్ కు సంభందించిన పోస్టర్ !
ఈ రోజు బాలమిత్ర -77.
వినుకొండ గీతాంజలి స్కూల్ లో !
2000 మంది విద్యార్థులు - మూడు గంటల క్లాస్ !
