RBI లెక్కల ప్రకారం వాస్తవం:

In the last twenty years..
దేశంలో కుటుంబాల అప్పు (Household Debt) GDP లో 37% నుండి 2025 నాటికి 47.8% కి పెరిగింది.ఇది సాధారణం కాదు.
1. కత్తిని రాంగ్ వైపు వాడిన ఫలితం:
మొత్తం అప్పుల్లో 58.4% ఇల్లు, వ్యాపారం కోసం కాదు. కేవలం తినడానికి, తిరగడానికి, ఫోన్ల కోసం తీసుకున్నవే. అంటే ఆస్తి కోసం కాదు, అలవాటు కోసం.
1. క్రెడిట్ కార్డ్ బకాయిలు:
2015 లో రూ. 340 కోట్లు ఉన్న క్రెడిట్ కార్డ్ అప్పు, 2025 కి రూ. 2.9 లక్షల కోట్లకు పెరిగింది. 10 ఏళ్లలో 8.3 రెట్లు పెరుగుదల. కార్డులు ఉన్న వాళ్లు 3.6 రెట్లు మాత్రమే పెరిగారు, కానీ అప్పు 8.3 రెట్లు పెరిగింది. అంటే ఒక్కొక్కరు పెట్టే ఖర్చు డబుల్ అయింది.
1. కట్టలేకపోవడం:
91-360 రోజులుగా కట్టని క్రెడిట్ కార్డ్ బిల్లులు ఒక్క ఏడాదిలోనే 44% పెరిగి రూ. 33,886 కోట్లకు చేరాయి. RBI ప్రకారం క్రెడిట్ కార్డ్ NPA లు రూ. 6,742 కోట్లు దాటాయి.
వెనకటి తరంలో దుబారా, జల్సా చేసి నాశనం అయిన వాళ్ళు 1% ఉంటే, ఈ తరంలో EMI ట్రాప్ లో ఉన్నవాళ్ళు 40% దాటారు. అదే నా బాధ.
నేను ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకొని రాస్తాను !

రోజులు మారాయి !

ఏరువాక సాగినా కష్టం తీరునా ?
ఒకప్పుడు మధ్యతరగతి ఉద్యోగి తన నెల జీతంలో 10-20 శాతం పొదుపు చేసేవాడు . బ్యాంకుల్లో , పోస్ట్ ఆఫీస్ లో .. బంగారం రూపంలో .. ఇంకా .. ఇంకా ..
తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల స్వర్ణయుగం వచ్చింది.
దానితో పాటు ఒక కొత్త మతం వచ్చింది - క్రెడిట్ కార్డ్ కల్చర్.!
అప్పే జీవన విధానం !
"కొనండి ఇప్పుడు, కట్టండి తర్వాత."
మాల్ కల్చర్!
EMI కల్చర్,!
బ్లాక్ ఫ్రైడే సేల్!
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, MNC ఉద్యోగులు ఒక వ్యవస్థీకృత బ్రెయిన్ వాష్ కి గురయ్యారు.
"నువ్వు లక్ష సంపాదిస్తున్నావు, 2 లక్షల లైఫ్‌స్టైల్ లో బతకాలి"
"1BHK ఎందుకు? విల్లా తీసుకో"
"బస్సులో ఎందుకు? EMI పై కారు తీసుకో"
"ఫోన్ 4 ఏళ్లు ఎందుకు వాడటం? ప్రతి ఏడాది EMI పై అప్‌గ్రేడ్ చేసుకో"
బ్యాంకులు వారిని "ప్రీమియం కస్టమర్లు" అని పిలిచాయి. పూచీకత్తు లేకుండా ముందస్తు రుణాలు ఇచ్చాయి. 5 నిమిషాల్లో 10 లక్షల పర్సనల్ లోన్. ఉచ్చు చాలా అందంగా ఉంది.
మనుషులన్నాక మినహాయింపులు సహజం !
కానీ ఈ ఇరవై ఏళ్ళల్లో సగటు మనిషి ముఖ్యంగా సాఫ్ట్వేర్ , MNC ఉద్యోగులు నేటి ఖర్చు కోసం రేపటి సంపాదన ను వినియోగించడం అలవాటు చేసుకొన్నారు . "రేపు సంపాదిస్తాములే..." అనే ధీమా !
రేపొచ్చింది ! చీకటి తెచ్చింది
ఇప్పుడు AI సునామీ !
ప్రతి వారం లేఆఫ్‌లు. 30 రోజుల్లో బెంచ్ నుండి నిరుద్యోగిగా. 15 ఏళ్ల అనుభవం ఉన్నా ఉద్యోగం లేదు.
ఆ బంగారాన్ని, ఆ సంపదను దాచుకుని ఉంటే, ఏడాది పాటు బతికేవారు.
కానీ ఇప్పుడు వారి దగ్గర ఏముంది?
EMI లు.
ఇంటి లోన్ అయితే, కనీసం ఇల్లు అమ్ముకోవచ్చు.
కార్ లోన్ అయితే, కనీసం కారు అమ్ముకోవచ్చు.
మరి iPhone కోసం, 75-అంగుళాల TV కోసం, విదేశీ ట్రిప్ కోసం, బ్రాండెడ్ బట్టల కోసం, Swiggy, Zomato, Amazon క్రెడిట్ కార్డ్ కోసం తీసుకున్న EMI ల సంగతేంటి?
వాటిని అమ్మలేము. వాటిని తినేశాము... వాడేశాము. కానీ EMI మాత్రం మిగిలే ఉంది.
ఇదే అత్యంత ప్రమాదకరమైన అప్పు - సృష్టి కోసం కాదు, వినియోగం కోసం చేసిన అప్పు.
అతి పెద్ద విషాదం తల్లిదండ్రులది కాదు... పిల్లలది.
ఈ పిల్లలు హై-ఫై వాతావరణంలో పెరిగారు.
ట్రిపుల్ బెడ్రూమ్ విల్లాలు.
ఇంటర్నేషనల్ స్కూళ్లు - సంవత్సరానికి 5-7 లక్షల ఫీజు.
వారు కరువును ఎప్పుడూ చూడలేదు. ఈ జీవనశైలి శాశ్వతం అనుకున్నారు.
ఇప్పుడు జీతం ఆగిపోతే, 10 ఏళ్ల పిల్లాడికి విల్లా నుండి 1BHK కి మారాలని ఎలా చెబుతావు? స్కూల్ మారాలని ఎలా చెబుతావు? రోజూ ఫుడ్ ఆర్డర్ చేయలేమని ఎలా చెబుతావు?
పోనీ బతుకు విలువ నేర్పే చదువులయినా అబ్బాయా ? అంటే సమాధానం అందరికీ తెలుసు !
"మా డాడీ కి ఈ కారుంది మా మమ్మీ హ్యాండ్ బాగ్ ఖరీదు ఇంత" అని స్నేహితులతో చెప్పుకొని తిరిగే ఆ పిల్లల మానసిక స్థితి ఊహించు !
పూర్ డాడీ - రిచ్ డాడీ !
వ్యవసాయం లేదా చిన్న ఉద్యోగం చేసిన మీ డాడీ .. నీకు కష్టాన్ని నేర్పాడు . దాన్ని ఎదిరించడం నేర్పాడు !
గ్రామంలో పుట్టిన నీవు ఫైన్షియల్ జిల్లాలో / బెంగళూరు లో / సిలికాన్ వాలీ లో వున్నావు అంటే అది నీకు కష్టం ఇచ్చిన వరం !
" నా బిడ్డ నేను పడిన కష్టాలు పడకూడదు అంటూ నువ్వు ఏమి చేసావు ? ఒక్క సారి ఆలోచించు !
నెల పై నడిచే వాడు గాల్లోకి ఎగరగలడు . విమానాలు హెలికాప్టర్ లు
గాల్లో ఎగరడం మాత్రమే తెలిసిన బిడ్డ భూమి పై కే పడిపోతే గతేంటి ?
ఇది ఒక తరం విషాదం కాదా ?
ప్రతి ఉద్యోగికి ఇది ఒక హెచ్చరిక:
1. పొదుపు పాతకాలం నాటిది కాదు, అది ఆక్సిజన్. కనీసం 6 నెలల ఖర్చు బంగారం / లిక్విడ్ ఫండ్ లో తప్పనిసరిగా ఉండాలి.
2. ఆస్తికి అప్పుకి తేడా తెలుసుకోండి.* ఇల్లు ఆస్తి, EMI పై iPhone అప్పు.
3. పిల్లల్ని బబుల్ లో పెంచకండి. వారికి డబ్బు విలువ తెలియనివ్వండి. సింపుల్ గా బతకనివ్వండి.
మనం ధనవంతులుగా కనిపించాలని అనుకోవడం వల్ల క్రెడిట్ కార్డ్ కంపెనీలు ధనవంతులయ్యాయి.
చీమల్లా బతికేటోళ్లు ఆనాడు - కరువులు కష్టాలు కనీళ్ళు అంటురోగాలు నేర్పిన పాఠం అది !
మిడతల్లా చేసేసారు .. నమ్మించి .. బ్రెయిన్ వాష్ చేసేసి !
మన మూలాలకు తిరిగి వెళ్ళే సమయం వచ్చింది.
ముందు పొదుపు... తర్వాత ఖర్చు.
ముందు బంగారం... తర్వాత గాడ్జెట్లు.
లేకపోతే, AI ఉద్యోగాన్ని తీసుకుంటే... EMI ఇంటిని తీసుకుంటుంది.
Congratulations Goutam

ఇంత negative మనుషులా ? ఛా ����


అన్నోయ్ !

నువ్వు చెప్పిన డైమండ్ ఉదాహరణకి గోల్డ్ ఉదాహరణకి అసలు పోలికే లేదు. రెండూ వేరు వేరు ఫిజిక్స్.

డైమండ్ అంటే కార్బనే. నేచురల్ డైమండ్ లో కూడా కార్బన్, ల్యాబ్ డైమండ్ లో కూడా కార్బన్. ఎలిమెంట్ ఒక్కటే, అరేంజ్మెంట్ మాత్రమే మార్చడం. అంటే ఒక ఇంట్లో ఫర్నిచర్ ని రీఅరేంజ్ చేసినట్టు. అది కెమికల్ ప్రాసెస్, అందుకే తక్కువ ఖర్చు.

గోల్డ్ అలా కాదు. మెర్క్యురీ (80 ప్రోటాన్స్) ని గోల్డ్ (79 ప్రోటాన్స్) గా మార్చాలంటే న్యూక్లియస్ లోనే ఒక ప్రోటాన్ ని కొట్టేసి తీయాలి. ఇది న్యూక్లియర్ ట్రాన్స్ముటేషన్. ఇది చేయడానికి CERN లాంటి పార్టికల్ యాక్సిలరేటర్ లో కరెంటు ప్లాంట్ అంత ఎనర్జీ కావాలి.

> ల్యాబ్ డైమండ్ లో స్కేల్ అయితే కాస్ట్ తగ్గుద్ది, కానీ గోల్డ్ లో స్కేల్ అయినా ఫిజిక్స్ మారదు. ఫస్ట్ గ్రాముకి 200 కోట్లు, లాస్ట్ గ్రాముకి కూడా 200 కోట్లే, ఎందుకంటే ప్రతి అటామ్ ని విడివిడిగా కొట్టాల్సిందే.

డైమండ్ అంటే కార్బన్ ని కార్బన్ గా మార్చడం, ఒక కుర్చీని టేబుల్ గా మార్చినట్టు. చీప్.

గోల్డ్ అంటే మెర్క్యురీ (80) ని గోల్డ్ (79) గా మార్చడం, దాని గుండెనే కొట్టేసి ప్రోటాన్ ని బయటకు తీయాలి. ఇది న్యూక్లియర్ ఫిజిక్స్.కెమిస్ట్రీకి న్యూక్లియర్ ఫిజిక్స్ కి తేడా తెలియకుండా ట్రేడ్ గురించి మాట్లాడకు. గ్రాముకి 200 కోట్లు అయితే ఎవడు స్టార్టప్ స్టార్ట్ చేయడని నువ్వే చెప్తున్నావ్ గా, అందుకే ఎవరూ చేయట్లేదు.

నా ఫాలోయర్స్ గొర్రెలు అన్నావ్ ! విషయం వారికే వదిలేస్తా !

The diamond example you mentioned is not comparable to the gold example. Both are different physics.

ప్రియమైన తల్లిదండ్రులారా,

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వ్యాస రచనా పోటీలలో ఒకటైన *క్వీన్స్ కామన్వెల్త్ వ్యాస పోటీ*లో మా విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారని తెలియజేయడానికి మేము గర్విస్తున్నాము. ఈ పోటీలో 56 దేశాల నుండి *54,840 ఎంట్రీలు* పాల్గొన్నాయి.

6 నుండి 10వ తరగతి వరకు ఉన్న *మొత్తం 25 మంది విద్యార్థులు* పాల్గొని, అద్భుతంగా *14 అవార్డులను* గెలుచుకున్నారు!

�� మా విజేతలు:

�� బంగారు పురస్కారాలు – 4
1) దుండి నాగ ఐశ్వర్య – 7వ తరగతి బీకన్స్
2) హిత – 7వ తరగతి డైనమోస్
3) రిషిత డి. – 8వ తరగతి అచీవర్స్
4) సిరి చందన – 10వ తరగతి అచీవర్స్
�� వెండి పురస్కారాలు – 4
1) సాయి సహర్ష్ – 8వ తరగతి అచీవర్స్
2) ధన్విన్ – 8వ తరగతి ఎక్స్‌ప్లోరర్స్
3) లక్ష్మీ ప్రశాంతి – 10వ తరగతి బీకన్స్
4( చ. మహా లక్ష్మి – 10వ తరగతి ఛాంపియన్స్ (పూర్వ విద్యార్థిని)
�� కాంస్య పురస్కారాలు – 6
1) దేవి శ్రీవల్లి – 8వ తరగతి ఎక్స్‌ప్లోరర్స్
2) యశోవర్ధన్ – 8వ తరగతి బీకన్స్
3) సంజన – 7వ తరగతి బీకన్స్
4) సాయి అమిత్ – 10వ తరగతి అచీవర్స్
5) అపూర్వ గ్రేస్ – 10వ తరగతి బీకన్స్
6) నిక్షిప్త – 8వ తరగతి విజేతలు

మా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు ఆరు నెలల పాటు అంకితభావంతో అందించిన శిక్షణ ద్వారా పెంపొందించబడిన మా విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనా విధానం మరియు రచనా నైపుణ్యాలకు ఈ విజయం నిదర్శనం.

మా యువ విజేతలకు మరియు వారి మార్గదర్శకులకు అభినందనలు! మేము వారిని చూసి ఎంతో గర్విస్తున్నాము! �� శుభాకాంక్షలతో

స్లేట్ - ది స్కూల్
విజనరీ విస్టా క్యాంపస్
విజయవాడ.

ఒక అభిమాని తయారుచేసి పంపింది !

60, 000 మంది ఉద్యోగుల్ని స్వచ్చంద పదవీ విరమణ పద్ధతిలో తొలగించనున్న మైక్రోసాఫ్ట్ !

కృత్రిమ మేధ ఒక ప్రళయం !

కృత్తిమ మేధ ఒక అవకాశం !

Confidence Builds Stronger Tomorrows
Confidence Builds Stronger Tomorrows
Confidence Builds Stronger Tomorrows
Slate The School, Karmanghat
"కృత్రిమ పద్ధతుల్లో బంగారాన్ని తయారు చేసే విధానం వచ్చేసింది . బంగారం ధర లక్షకు కాదు 60-70 వేలకు పడిపోతుంది " నా పోస్ట్ పై ఒక కామెంట్ .
బంగారాన్ని గని నుంచి శుద్ధి చేసి తీస్తే గ్రాము కయ్యే ఖర్చు 4000-5000 .
అదే పాదరసం నుంచి తీస్తే అయ్యే ఖర్చు 200 కోట్లు .
అవును గ్రాము బంగారానికి ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా చేస్తే అయ్యేది 200 కోట్లు .
తెలిసిన వారికీ చెప్పాల్సిన అవసరం లేదు .
తెలియని వారికి చెప్పడం సులభం .
తమకే అన్నీ తెలుసు అనుకొనే వారికి చెప్పడం దుర్లభం .
ఈ రెండు రోజుల్లో నా టైం లైన్ పై కామెంట్స్ రూపం లో జాలువారిన ఆణిముత్యం మరోటి ..
"ఎల్ నినో వల్ల నీటి కరువు వస్తుంది అంటున్నారు . రాదు.. ఎందుకంటే ఎండల వల్ల సముద్రాలూ జలాశయాలలో ఉన్న నీరు ఆవిరి అయ్యి పైకి పోతుంది . అది వర్షాల రూపంలో పడుతుంది ".
భూమి పై అశోకుడు కాలం ... ఆ మాటకొస్తే పాతరాతి యుగంలో ఉన్న నీరు అలాగే ఉంది . పెరగదు . తగ్గదు . మరి కరువులు వరదలు ఎందుకు వస్తాయి ?
ఇప్పుడు చూడండి . హైదరాబాద్ లో నీటి కొరత . కాకినాడ లో ఈ రోజు జలప్రళయ ప్రమాదం . కోయంబత్తూరు లో వీధుల్లో మోకాటి లోతు నీరు .
ఒక చోట భారీగా కురిస్తే సమస్య .
మరో చోట కురవక పొతే సమస్య .
అతి వృష్టి . అనావృష్టి .
1971 లో బెంగుళూరు జనాభా 16 లక్షలు .
అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వలసలు 1970 తరువాత బాగా పెరిగింది . ఇప్పుడు ఆ నగర జనాభా కోటి యాభై లక్షలు . అంటే సుమారుగా పది రెట్లు పెరిగింది .
అంటే నీటి అవసరం పది రెట్లు .. కాదు కాదు .. ఇంకా ఎక్కువ అయ్యింది . కారణం నగర జీవి ఎక్కువ నీటిని వినియోగిస్తాడు .
చెట్లు పుట్టలు గుట్టలు ఉంటే భూమిపై పడిన వర్షపు బొట్టు భూమి లోకి ఇంకుతుంది .
నగరం అంటే ఏంటి ?
భవనాలు సిమెంట్ రోడ్లు కదా .
అంటే పడిన నీరు భూమి లోకి ఇంకదు .
భూమి నుంచి బోర్ వెల్ రూపం లో తోడేసేది అనేక రెట్లు పెరిగింది .
భూగర్భ జలాలు అడుగంటి పోయాయి .
ఇది కాస్త అటుఇటుగా హైదరాబాద్ కు కూడా వర్తిస్తుంది .
తుఫాను అంటే బీభత్సమే .... కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు నీటి కొరతను అరికట్టుతుంది .
నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలు , తుఫానుల వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు వర్షం బాగా కురుస్తుంది . ఇప్పుడొస్తున్న తుఫాను వల్ల శ్రీకాకుళం నుంచి ప్రకాశం దాక భారీ వర్షాలు . ఈ రెండు నెలల్లో తమిళనాడు తీరం నుంచి ఒకటో రెండో తుఫానులు రావడం ఖాయం . వాటి వల్ల చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలకు వానలు రావడం ఖాయం .
ఇక్కడ మనకు హైదరాబాద్ లో తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో ఆ అవకాశం తక్కువ .
ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఇక్కడ తక్కువ .
డిసెంబర్ 14 తరువాత హైదరాబాద్ వాతావరణం పొడిగా ఉంటుంది . అందుకే లలిత కళా తోరణం లాంటి ఓపెన్ టు స్కై లాంటి చోట్ల మా బడి వార్షికోత్సవాలు పెట్టుకొంటాము .
అదే విజయవాడ లో అంతకు మించి తిరుపతి లో ఆ ధైర్యం చేయలేము . కారణం వానలు రావొచ్చు .
నీటి ఎద్దడి కారణంగా హైదరాబాద్ లో బడులు విద్య సంస్థలు మార్చ్ తరువాత నడపడం కష్టమై పోతుందా ? ప్రభుత్వం వేసవి సెలవుల్ని ముందస్తూ ప్రకటిస్తుందా ?
తెలియదు .
ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు .
కానీ అవకాశం ఉంది .
మరి సిలబస్ పూర్తి చెయ్యడం ఎలా ?
ఆదివారం నాడు హైదరాబాద్ లోని మా బ్రాంచ్ ల తల్లితండ్రులకు నేను ఒక వాయిస్ మెసేజ్ పంపాను .
"నీరు... విద్యుత్ కొరత కారణంగా బహుశా మార్చి మొదటి వారానికి ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు పెట్టుకోండి అని చెప్పొచ్చు .
ఆన్ లైన్ క్లాసులంటే తిరిగీ పిల్లల చేతికి మొబైల్ .
వారు పాఠాలు వినేది ఏమీ ఉండదు .
మొబైల్ కు అడిక్ట్ అయిపోతారు .
దాని వల్ల భరించలేని సమస్యలు ..కరోనా తరువాత పిల్లల్ని చూస్తే జాలి పడాలో ఇంకేమి చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి .
వద్దు .. ఆ భాదలు వద్దే వద్దు . మీరు ఒప్పుకొంటే బడి గంటలు మరో నలభై అయిదు నిముషాలు పెంచి మార్చి కల్లా సిలబస్ పూర్తి చేస్తాము . మీకు టీచర్స్ ఫోన్ చేస్తారు . మీ అభిప్రాయం చెప్పండి "
సుమారుగా 95 శాతం పేరెంట్స్ సరే ఆన్నారు . మిగతా వారు కూడా చిన్న చిన్న సమస్యలు { బడి తరువాత మా బిడ్ద కు ఇదిగో ఈ క్లాస్ ఉంది { డాన్స్ లాంటివి } అని చెప్పారు "
అందరికీ ఆమోద యోగ్యం అయ్యేలా పొద్దున్న పది నిముషాల ముందు .. అస్సెంబ్లీ టైం అయిదు నిముషాలు... లంచ్ టైం అయిదు నిముషాలు కట్ .. సాయంకాలం ఇరవై నిముషాలు పెంపు .. ఇలా నిర్ణయం తీసుకొన్నాము .
మా బడి వాట్సాప్ గ్రూప్ లో కాగ్నిబోట్ పటాన్చెరు , స్లేట్ బౌరంపేట్ అమీర్పేట్ అబిడ్స్ హిమాయత్ నగర్ కర్మాంఘాట్ వారు ఈ పనుల్లో ఆదివారం సోమవారం బిజీ బిజీ .
స్లేట్ విజయవాడ గన్నవరం తిరుపతి వారు ఫ్రీ .ఎందుకంటే అక్కడ ఈ పరిస్థితి కి అవకాశం తక్కువ .
ప్రతి విషయంలో కొన్ని అవకాశాలు .. కొన్ని సవాళ్ళు ఉంటాయి .
నాలుగేళ్ళ క్రితం తిరుపతి క్యాంపస్ కు సమీపాన ఉన్న రాయల్ చెరువు కట్ట తెగిపోతుందని హాస్టల్ లోని పిల్లల్ని రాత్రికి రాత్రి ఖాళీ చేసి తిరుపతి నగరంలో ఒక హోటల్ లో రెండు రోజులు ఉంచాము .
మొన్న జరిగిన ఇంటర్వూస్ లో వేరే బడిలో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న వ్యక్తి మా బడిలో టీచర్ పోస్ట్ కోసం అప్లై చేసాడు . "అదేంటి?" అంటే..
" సార్ అక్కడ జీతం ఎప్పుడిస్తారో తెలియదు . మూడు నాలుగు నెలలకు ఒక సారి ఇస్తే అదే మాకు పండుగ . పైగా యాజమాన్యం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ ఖర్చులకు మా జీతం కట్ చేస్తారు "అన్నాడు .
షాక్ నుంచి తేరుకోవడానికి నాకు సమయం పట్టింది .
"ఈ ప్రపంచం లో అందరికీ నడిచి పోతుంది . పట్టించుకొనే వారికే సమస్యలు ఎక్కువ "అని నాకు అనిపించింది. వెంటనే "ఈ ఆలోచన తప్పు" అని నాకు నేను సర్ది చెప్పుకొన్నాను .
శుభోదయం !

విద్యా సంస్థలా ? దురలవాట్లను నేర్పే కేంద్రాలా ?

Soooooo Cuteeeeeee both of U
బంగారం రేటు పడిపోతుందా? అసలు నిజం ఏంటి?
చాలా మంది అడుగుతున్న ప్రశ్న... " బంగారం రేటు విపరీతంగా పెరిగింది కదా, ఒక్కసారిగా క్రాష్ అవుతుందా ?"
అసలు వాస్తవం ఏంటో చూద్దాం.
పోస్ట్ పూర్తిగా చదవండి .
పై పై గా చూసి ... సగం అర్థం చేసుకొని ప్రశ్నలు అడగకండి . ఉదాహరణ బ్యాంకు అఫ్ అమెరికా పాయింట్ చూసి అయ్యావు సార్ బంగారం లక్షకు పడిపోతుందా? అని అడగకండి .
ఈరోజు హైదరాబాద్ లో రేటు:
24 క్యారెట్లు - 10 గ్రాములకు రూ.1,44,480
22 క్యారెట్లు - రూ.1,32,324
ఈ వారంలో స్వల్పంగా 1.5% తగ్గింది.
ఎందుకు ఇంత పెరిగింది?
1. చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నాయి.
2. డాలర్ మీద నమ్మకం తగ్గడం, అమెరికా అప్పులు పెరగడం.
3. ప్రపంచంలో యుద్ధ వాతావరణం.
పెద్దగా పడిపోతుంది అని ఏమైనా విశ్లేషణ ఉందా?
భారీ క్రాష్ ఉంటుంది అని ఏ బ్యాంకు చెప్పలేదు. కానీ 5% నుండి 15% కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Bank of America: బంగారం ధర $4,160 నుండి $3,750 కి పడొచ్చు అని హెచ్చరించింది. అంటే మన లెక్కలో 10 గ్రాములకు రూ.1.08 లక్షల నుండి రూ.1.15 లక్షల వరకు రావచ్చు.
HSBC: 2026 సగటు ధర అంచనాను తగ్గించింది.
World Gold Council: ఒకవేళ అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా మారి, డాలర్ బలపడితే 5% నుండి 20% వరకు కరెక్షన్ రావచ్చు అని చెప్పింది.
పడిపోకుండా ఆపే అంశాలు ఏంటి?
- చాలా బ్యాంకులు డిసెంబర్ 2026 నాటికి బంగారం ధర $4,350 నుండి $4,650 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అంటే భారీ పతనం ఉండదు.
- ICICI Bank అంచనా ప్రకారం $4,200 - $4,600 మధ్యనే ఉంటుంది.
- దీపావళి, ధనత్రయోదశి (నవంబర్ 6-8) పండగల డిమాండ్ సపోర్ట్ గా ఉంటుంది.
నా సూటి సలహా:
- రూ.1 లక్షకు బంగారం వస్తుంది అని ఎదురుచూడటం అత్యాశ.
సెంట్రల్ బ్యాంకులు అమ్మడం మొదలుపెడితే తప్ప అది జరగదు.
- 3% నుండి 8% చిన్న చిన్న కరెక్షన్లు సహజం. ఇప్పుడు జరిగింది అదే.
- నగల కోసం, లాంగ్ టర్మ్ కోసం కొనేవారు క్రాష్ కోసం ఎదురుచూడకండి.
ఇన్వెస్ట్ మెంట్ కోసం అయితే Gold ETF లో SIP పద్దతిని కూడా అనుసరించవచ్చు .
ఒక్కే సారి పెద్దగా పెట్టుబడి పెట్టలేని వారికి ఇది అనుకూలం .
Gold ETF SIP అంటే ఏంటో చాలా సింపుల్ గా చెప్తాను.
ETF = Exchange Traded Fund
మనం బంగారం కొనాలంటే జ్యువెలరీ షాప్ కి వెళ్లి భౌతికంగా కొనాలి. అందులో తయారీ చార్జీలు, దొంగతనం భయం, నాణ్యత అనుమానం ఉంటాయి.
Gold ETF లో మీరు బంగారాన్ని షేర్ మార్కెట్ లో షేరు లాగా కొంటారు. 1 యూనిట్ Gold ETF = 1 గ్రాము బంగారానికి సమానం. అది మీ Demat Account లో ఉంటుంది. 99.9% స్వచ్ఛమైన బంగారం.
SIP అంటే ఏంటి?
SIP = Systematic Investment Plan
ఒక్కసారిగా లక్ష రూపాయలు పెట్టి బంగారం కొనకుండా, ప్రతి నెలా రూ.500, రూ.1000, రూ.5000 అలా కొద్ది కొద్దిగా కొనడం. బంగారం రేటు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ప్రతి నెలా కొంటూ ఉంటారు. దీని వల్ల సగటు ధర తక్కువగా వస్తుంది.
Gold ETF + SIP కలిపితే?
ప్రతి నెలా మీరు రూ.1000 తో Gold ETF కొనడం. ఉదాహరణకు:
- జనవరిలో బంగారం రేటు ఎక్కువ ఉంటే - మీ రూ.1000 కి 0.6 గ్రాము వస్తుంది
- ఫిబ్రవరిలో రేటు తక్కువైతే - అదే రూ.1000 కి 0.8 గ్రాము వస్తుంది
ఇలా 2-3 ఏళ్లు చేస్తే మీకు సగటున మంచి ధర వస్తుంది. రేటు పడిపోతుందేమో అనే భయం ఉండదు.
దీని వల్ల 4 లాభాలు:
1. తయారీ చార్జీలు లేవు: జ్యువెలరీకి 10-20% వేస్టేజ్ ఉంటుంది, ఇందులో ఉండదు.
2. భద్రత:* దొంగతనం భయం లేదు, Demat లోనే ఉంటుంది.
3. అమ్మడం సులభం: షాప్ కి వెళ్లక్కర్లేదు, ఫోన్ లో ఒక క్లిక్ తో అమ్మేసి డబ్బు అకౌంట్ లోకి వస్తుంది. 24 క్యారెట్ల రేటే వస్తుంది.
4. పన్ను లాభం: 1 ఏడాది తర్వాత అమ్మితే పన్ను తక్కువ.
ఎలా మొదలు పెట్టాలి?
1. Zerodha, Groww, Angel One, Upstox వంటి యాప్ లో Demat Account ఉండాలి.
2. అందులో Nippon Gold ETF, HDFC Gold ETF, SBI Gold ETF అని సెర్చ్ చేయండి.
3. అందులో SIP ఆప్షన్ పెట్టుకుని నెలకు రూ.500 నుండి మొదలు పెట్టవచ్చు.
Sir, Gold ETF SIP లో రిస్క్ లు కూడా ఉన్నాయి .
1. రేటు పడిపోయే రిస్క్ . ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మరో రెండు మూడు ఏళ్లకు ఈ అవకాశం తక్కువ !
2. Demat & Brokerage ఖర్చు:
జ్యువెలరీలా కనిపించదు కానీ ఖర్చులు ఉన్నాయి.
- Demat Account కి ఏటా రూ.300-500 AMC
- కొనేటప్పుడు, అమ్మేటప్పుడు 0.5% బ్రోకరేజ్
- ETF కంపెనీ ఏటా 0.4% నుండి 0.5% Expense Ratio తీసుకుంటుంది
3. నగలుగా మార్చుకోలేరు
ETF లో ఉన్న బంగారాన్ని నగలుగా ఇంటికి తెచ్చుకోలేరు. అమ్మితే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో మళ్ళీ షాప్ లో కొనాలి. అప్పుడు మళ్ళీ తయారీ చార్జీలు పడతాయి.
4. షేర్ మార్కెట్ పై ఆధారపడటం.
మీరు బంగారం కొన్నా, అది షేర్ మార్కెట్ లోనే ఉంటుంది. మార్కెట్ మూసి ఉంటే (శని, ఆది, పండగ రోజు) అమ్మలేరు. అత్యవసరంగా రాత్రి 11 గంటలకు డబ్బు కావాలంటే అమ్మలేరు. ఫిజికల్ బంగారం అయితే ఎప్పుడైనా తాకట్టు పెట్టొచ్చు.
5. Tracking Error.
బంగారం రేటు రూ.100 పెరిగితే, ETF కూడా సరిగ్గా రూ.100 పెరగాలి. కానీ కొన్నిసార్లు రూ.98, రూ.99 మాత్రమే పెరుగుతుంది. ఈ చిన్న తేడానే Tracking Error అంటారు.
6. పన్ను - Tax
- 1 ఏడాది లోపు అమ్మితే వచ్చిన లాభం మీద మీ Income Slab ప్రకారం పన్ను పడుతుంది.
- 1 ఏడాది తర్వాత అమ్మితే 12.5% LTCG పన్ను.
ఎవరికి ఇది మంచిది కాదు?
- నెలలోనే అమ్మేసి లాభం తీద్దాం అనుకునేవారికి కాదు
- నగలు వేసుకోవడం కోసం కొనేవారికి కాదు
- Demat Account లేని, షేర్ మార్కెట్ అస్సలు తెలియని వారికి కొంచెం కష్టం
*మరి ఏం చేయాలి?*
రిస్క్ తగ్గాలంటే 3 పనులు చేయండి:
1. ఒక్కసారిగా పెద్ద మొత్తం వేయకుండా SIP లో నెల నెలా కొద్దిగా కొనండి
2. కనీసం 3-5 ఏళ్లు ఉంచండి, తొందరగా అమ్మకండి
3. మీ మొత్తం డబ్బుని బంగారంలోనే పెట్టకండి - 25-30 % మాత్రమే బంగారంలో ఉంచడం మంచిది
తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ విజ్ఞప్తి !
తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో కోతులు, వీధి కుక్కల బెడద ముఖ్యమయినది ! .
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో... ఉదాహరణకు ములుగు భూపాలపల్లి లాంటి చోట్ల రైతులు కూరగాయలు పండించాలన్నా భయపడుతున్నారు. వేసిన పంటను కోతులు రాత్రికి రాత్రే నాశనం చేస్తున్నాయి. దీంతో కూరగాయల కోసం 50-100 కి.మీ దూరంలో ఉన్న వరంగల్ మీద ఆధారపడాల్సి వస్తోంది.
చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇది కేవలం ఆ రెండు జిల్లాల సమస్య కాదు.
దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి.
ప్రభుత్వం తలచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, ఒక మంచి అవకాశం.
రేవంత్ రెడ్డి గారు !
ఏ పార్టీ అయినా ప్రజల అభిమానాన్ని ఆదరణను పొందాలి అనుకొంటుంది . మీరు మీ ప్రభుత్వం కూడా ఇదే కోవలోకి వస్తారు అని నేను అనుకొంటున్నాను . ఈ కింది చర్యలు చేపడితే ప్రజలకు పెద్ద ఉపశమనం . వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయే అవకాశం ! ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువే !
1. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక స్టెరిలైజేషన్ కేంద్రం:
హిమాచల్ ప్రదేశ్ తరహాలో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కుక్కలకు ABC సెంటర్లను పునరుద్ధరిస్తే, శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో చేయగలిగే గొప్ప మానవతా కార్యక్రమం.
2. పంట నష్టపరిహారంలో కోతులను చేర్చడం:
అడవి జంతువుల వల్ల పంట నష్టానికి పరిహారం ఇస్తున్నట్లే, కోతుల వల్ల నష్టపోయిన రైతులకు కూడా పరిహారం ఇస్తే, రైతు ప్రభుత్వాన్ని తన కుటుంబంగా భావిస్తాడు.
3. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం:
కోతులు తినని పసుపు, కరివేపాకు, ఔషధ మొక్కలు వేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీ ఇస్తే, అటు రైతుకు ఆదాయం, ఇటు సమస్యకు పరిష్కారం.
4. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్:
కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ, పశుసంవర్ధక, పంచాయతీ శాఖలతో ఒక చిన్న టీం వేసి, నెలకోసారి సమీక్షిస్తే చాలు.
5. చెత్త నిర్వహణను పటిష్టం చేయడం:
దీని వల్ల కుక్కలు, కోతుల సంతతి సహజంగానే తగ్గుతుంది.
ఇది రాజకీయాలకు అతీతమైన అంశం.
ఏ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందో, ఆ ప్రభుత్వానికి గ్రామీణ తెలంగాణ ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.
తెలంగాణా ఉప ముఖ్య ముఖ్య మంత్రి భట్టి విక్రమమార్క మల్లు గారికి !
"భట్టి మామ " ! దయ చేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ అజెండా గా మార్చండి . ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది - మీ గోల్డెన్ త్రెషోల్డ్ { యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ } మిత్రుడు - వాసిరెడ్డి అమర్నాథ్ .

నిన్న నేను పెట్టిన పోస్ట్లు .. ఈ రోజు .. అన్ని పత్రికల్లో పతాక వార్తలుగా ..
ఎలా?
యాదృచ్చికం !
రాబోయే విపత్తుపై నేను ముందే హెచ్చరించాను .
యాదృచ్చికంగా అదే ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఇలా స్పందించింది .
కాకపోతే ఒక్క మాట .. నా పోస్ట్ లను ఎంతోమంది ఫాలో అవుతారు . అది గత కోనేళ్ళుగా జరుగుతోంది .
గతంలోనే అనేక సార్లు నా మాటలు ఉన్నత నాయకుల ప్రసంగాల్లో చోటు చేసుకున్నాయి .
గతంలోనే ముఖ్య మంత్రి కీలక స్థానాల్లో పని చేసిన ఉన్నత అధికారులు స్వయంగా ఈ మాట చెప్పారు . మీరు పెట్టిన పోస్ట్‌లలోని కొన్ని పాయింట్ల డ్రాఫ్ట్ స్పీచ్‌లో చేర్చాము .
ఇదేదో పెద్ద విశేషం కాదు .
నాకు కొమ్ములు రాలేదు .. కిరీటాలు రాలేదు .
జస్ట్ చేబుతున్నా అంతే .
సమస్య వెనుక ఉన్న రాజకీయ కోణం గురించి మీరు మీ టైం లైన్ పై చర్చించుకోవచ్చు . నా టైం లైన్ పై కాదు .
The posts I put yesterday .. Today .. As flag news in all newspapers... How?
Truly Intelligent?
Truly Intelligent?
Truly Intelligent?
Truly Intelligent?
You are inspiring me a lot sir to go for gym, I started doing gym because of you sir, thank you very much sir.

ప్రియమైన తల్లిదండ్రులారా,

హైదరాబాద్‌కు సంబంధించిన ఒక ఆసన్నమైన పరిస్థితిని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము.

*2026 డిసెంబర్ / 2027 జనవరి నుండి హైదరాబాద్ తీవ్ర నీటి సంక్షోభాన్ని మరియు తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కోబోతోంది, మరియు మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.*

_ఇది కేవలం ఊహాజనితం కాదు - ఈ సంక్షోభం ఆసన్నమైంది._

*వాస్తవాలు మరియు గణాంకాలు:*

- *చాలా తక్కువ వర్షపాతం:* హైదరాబాద్‌లో 627 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 458 మి.మీ. మాత్రమే కురిసింది. ఇది 27% నుండి 35% తక్కువ.

- *భూగర్భ జలాలు చాలా లోతుకు వెళ్ళిపోయాయి:* గత సంవత్సరం సుమారు 12 అడుగుల లోతులో నీరు అందుబాటులో ఉండేది. ఈ సంవత్సరం అది 33 అడుగులకు చేరింది. మొత్తం 16 మండలాలలో 11 మండలాలు, భూగర్భంలో వాస్తవంగా ఉన్న నీటి కంటే ఎక్కువ నీటిని వాడుకుంటున్నాయి.

- *జలాశయాలు దాదాపు ఖాళీ అయ్యాయి:* పశ్చిమ హైదరాబాద్‌కు నీటిని అందించే సింగూర్ జలాశయం 29.9 టీఎంసీల నీటిని నిల్వ చేయగలదు, కానీ ఇప్పుడు కేవలం 3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి ఇందులో 16 టీఎంసీల నీరు ఉండేది. డిసెంబర్ నాటికి ఇది అడుగంటిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల మట్టాలు గత సంవత్సరం కంటే 5 అడుగులు తక్కువగా ఉన్నాయి.

- *నగరానికి సరిపడా నీరు లేదు:* నగరానికి రోజూ 735 ఎంజీడీ నీరు అవసరం కాగా, కేవలం 585 ఎంజీడీ మాత్రమే సరఫరా అవుతోంది. రోజుకు 150 ఎంజీడీ నీటి కొరత ఉంది. అందుకే ట్యాంకర్ బుకింగ్‌లు రెట్టింపు అయ్యాయి - గత సంవత్సరం రోజుకు 3500 ఉండగా, ఇప్పుడు రోజుకు 7000కు పెరిగాయి. ఒక రోజు విడిచి ఒక రోజు కాకుండా, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరగవచ్చని హెచ్‌ఎం‌డబ్ల్యూ‌ఎస్‌ఎస్‌బి హెచ్చరించింది. *ప్రతి ఒక్కరూ 20% నీటిని పొదుపు చేయాలని ప్రభుత్వం కోరింది.* నీరు తక్కువగా ఉన్నప్పుడు, విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

*_1. విద్యా సంబంధ ప్రాధాన్యతలు:_*

అనేక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, బోధనా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, ప్రణాళికాబద్ధమైన సిలబస్‌ను అత్యంత శ్రద్ధ, నిబద్ధతతో పూర్తి చేస్తాము.

_దీని అర్థం పాఠాలను తొందరగా ముగించడం లేదా బోధన/అభ్యసన నాణ్యత విషయంలో రాజీ పడటం కాదు._

భావనల స్పష్టత, అవగాహన మరియు అనువర్తనాన్ని నిర్ధారిస్తూ, ప్రతి పాఠం క్షుణ్ణంగా బోధించబడుతుంది.

పఠన అభ్యాసం, క్రీడలు, యోగా, నృత్యం మరియు అన్ని ఇతర సహ పాఠ్య కార్యకలాపాలకు సమాన ప్రాధాన్యత కొనసాగుతుంది.

అందువల్ల, తల్లిదండ్రులందరూ తమ పిల్లలు *_క్రమం తప్పకుండా మరియు సమయానికి_* పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని మేము అభ్యర్థిస్తున్నాము.

ఒక్క రోజు గైర్హాజరు కూడా అభ్యసన కొనసాగింపుకు అంతరాయం కలిగిస్తుంది, దీనివల్ల పిల్లలు భావనలతో మమేకం కావడం కష్టమవుతుంది.

*_ఉదాహరణకు, 13 రోజుల దసరా సెలవుల తర్వాత ఈరోజు పాఠశాల తిరిగి తెరుచుకుంది, అయినప్పటికీ తరగతులలో హాజరు కేవలం 50–60% మాత్రమే ఉంది._*

*_2. నీటి సంరక్షణ: ప్రతి ఇంటికీ ఆచరణాత్మక చర్యలు_*

_ఎ. రోజువారీ వినియోగాన్ని తగ్గించండి_

- స్నానం చేయడానికి బదులుగా బకెట్ మరియు మగ్గును ఉపయోగించండి.

- వాషింగ్ మెషీన్లు మరియు డిష్‌వాషర్‌లను తగినంత నిండుగా ఉన్నప్పుడు మాత్రమే నడపండి.

- బ్రష్ చేసేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు లేదా పాత్రలు కడిగేటప్పుడు కుళాయిలను మూసివేయండి.

- లీక్ అవుతున్న కుళాయిలు, పైపులు మరియు ఫ్లష్ సిస్టమ్‌లను వెంటనే మరమ్మత్తు చేయండి.

- వాహనాలు, బాల్కనీలు మరియు డ్రైవ్‌వేలను అనవసరంగా కడగడం మానుకోండి.

_బి. ఆచరణ సాధ్యమైన చోట నీటిని పునర్వినియోగించండి_

- ఉద్దేశించిన ఉపయోగం కోసం సురక్షితంగా ఉన్నట్లయితే, నేలను శుభ్రపరచడానికి లేదా తోటపనికి తగిన గృహ నీటిని పునర్వినియోగించండి.

- అపార్ట్‌మెంట్లలో, సౌకర్యాలు అందుబాటులో ఉన్నచోట, శుద్ధి చేసిన మురుగునీటిని తోటపని, నిర్మాణం మరియు ఇతర తగిన త్రాగడానికి పనికిరాని ప్రయోజనాల కోసం ఉపయోగించండి.

_సి. భవిష్యత్ వర్షపాతానికి సిద్ధంగా ఉండండి_

- వర్షాకాలానికి ముందు వర్షపు నీటి సేకరణ గుంతలు మరియు రీఛార్జ్ నిర్మాణాలను శుభ్రపరచి, నిర్వహించండి.

- ఇప్పటికే ఉన్న వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని మరియు అడ్డంకులు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.

*_3. విద్యుత్ పొదుపు_*

_ఎ. వెంటిలేషన్‌ను నిర్వహించండి_

- _ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 వరకు:_ పగటిపూట వేడిగా ఉండే సమయంలో కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి.

- _ఉదయం పూట:_ గాలి ప్రసరణను ప్రోత్సహించడానికి కిటికీలు మరియు తలుపులు తెరవండి.

- సాయంత్రం 6:00 గంటల తర్వాత: కిటికీలకు దోమల వల లేకపోతే, దోమలు లోపలికి రాకుండా వాటిని మూసివేయండి. కిటికీలకు మెష్ (జాలీ) అమర్చినట్లయితే, వాటిని తెరిచి ఉంచవచ్చు.
_బి. ఎయిర్ కండిషనర్లను (AC) సమర్థవంతంగా ఉపయోగించండి_
- AC ఉష్ణోగ్రతను 16–17°Cకి తగ్గించి, ఆపై దుప్పటి కప్పుకుని పడుకునే బదులు, 23–25°C వంటి సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయండి.
- చల్లదనం అవసరం లేనప్పుడు ACని ఆపివేయండి.
- AC పనిచేస్తున్నప్పుడు తలుపులు మరియు కిటికీలను మూసి ఉంచండి.
- AC సమర్థవంతంగా పనిచేసేలా, దాని ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
- ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, AC మరియు ఫ్యాన్ రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం మానుకోండి.
_ప్రియమైన తల్లిదండ్రులారా, రాబోయే నెలల్లో మనం సమయం, నీరు మరియు విద్యుత్తును ఉపయోగించే విధానం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి రావచ్చు._
_నీరు మరియు విద్యుత్తును ఆదా చేయడంలో మనవంతు సహకారాన్ని అందిద్దామని కోరుతున్నాము._
మీ నిరంతర మద్దతుకు మరియు సహకారానికి ధన్యవాదాలు.
శుభాకాంక్షలతో

జ్ఞానదంతం పోయినా జ్ఞానోదయం కలుగదా ? ������
అక్టోబర్ మొదటివారం !
పంటి నొప్పి !
అక్టోబర్ 8 - RTC క్రాస్ రోడ్స్ లోని టూత్ అఫైర్స్ క్లినిక్ !
డాక్టర్ రవికాంత్ , డెంటిస్ట్ , భాగ్య నగర్ వైశ్యా అసోసియేషన్ నాయకుడు
ఇద్దరు పిల్లలు మా బడిలో చదివారు !
( పెద్దబ్బాయి ఇప్పుడు పీజీ డాక్టర్ )
పరీక్షించి " మీ కింది దవడ ఎడమవైపు జ్ఞాన దంతం సమస్యల్ని కలిగిస్తోంది ! దాన్ని తీసేయడం మంచిది ! మీరు రేపు బయలుదేరి బడి పిల్లలతో టూర్ వెళుతాను అంటున్నారు ! ఆ పన్ను తీసాక కనీసం ఒక రోజు రెస్ట్ కావాలి . టూర్ ముగించుకొని రండి అన్నారు !
టూర్ అయ్యింది !
పండగొచ్చింది !
చివరకు నిన్న ముహూర్తం కుదిరింది !
నిన్న సాయంకాలం 5 కు పన్ను తీశారు !
DR రవికాంత్ గారు నిన్న మళ్ళీ చెప్పారు ! “ సార్ రేపు రెస్ట్ తప్పని సరి ! ముఖం లో వాపు వస్తుంది " అని!
ఎవ్వరి మాట వినడు సీతయ్య !
����
ఆరేళ్ళ క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తరువాత “ కనీసం ఒక సంవత్సరం వాకింగ్ చెయ్యొద్దు” అని డాక్టర్ అంటే ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చి నేరుగా kBR పార్క్ కు అటుపై వారం జిమ్ చేరిన సీతయ్య !
ఇదిగో ఈ రోజు ముందుగా కాగ్నిబోట్ కు అటుపైన స్లేట్ బౌరంపేట్ కు .. ఈ ఫోటో లు స్లేట్ అమీర్పేట్ లో .. ఇప్పుడు స్లేట్ హిమాయత్ నగర్ దారిలో !
జ్ఞానదంతం పోయినా జ్ఞానోదయం కలుగదేంటమ్మా ఈ మనిషికి ������
తమాషా గా చెప్పా !
డాక్టర్స్ మాట వినకపోవడం కాదు !����
ఈ రోజు స్కూల్ కు వద్దు అని అనుకొన్నా !
ఒంట్లో నీరసం లేదు !
దవడ నొప్పి లేదు !
ఇంట్లో కూర్చుంటే తోచదు !
అందుకే పనిలో పడ్డా!
సాయంకాలం జిమ్ కు కూడా వెళుతా !
టేక్ కేర్ అనకండి దయచేసి !
నేను ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాను !
ఈ రోజు పనిలో పడినా జిమ్ కు పోయినా అందులో భాగమే !
Even if wisdom teeth are lost, will there not be enlightenment?
Even if wisdom teeth are lost, will there not be enlightenment?
Even if wisdom teeth are lost, will there not be enlightenment?
Cognibot the School
భాగ్య నగరంలో అక్టోబర్ చివరి వారంలో కూడా 32-34 డిగ్రీలు !
ఇదే ఎల్ నినో ప్రభావం ! .
ఏసీ ఉన్నవారికి ఇప్పటికి ఫరవాలేదు !
క రేపు విద్యుత్ కోతలు వస్తే AC పనిచేయదు.
మార్చ్ నుండి 45 డిగ్రీల దాకా వెళ్లే అవకాశం ఉందని IMD హెచ్చరిస్తోంది.
సామాన్యుల కోసం - తక్కువ ఖర్చు చిట్కాలు !
1. ఇంటిని చల్లబరచడం !
- మధ్యాహ్నం 11 నుండి 4 వరకు కిటికీలు, తలుపులు మూసేయండి. సాయంత్రం 5 తర్వాత అన్నీ తెరిచి క్రాస్ వెంటిలేషన్ అంటే గాలి స్వేచ్ఛగా ఇంటిలో ప్రవేశించేలా చేయండి .
మీ కిటికీ లకు దోమల మెష్ లేకపోతే ఆరింటికి మూసెయ్యండి . దోమల్ మెష్ ఉంటే రాత్రంతా అలాగే ఉంచేయ్యండి !
- కిటికీలకు తడి గోనె సంచులు / తడి బెడ్ షీట్ కట్టండి - ఇది డెసర్ట్ కూలర్ లా పనిచేస్తుంది.
నేలను రోజూ 2 సార్లు తడి గుడ్డతో తుడవండి.
2. తాగే నీరు - మట్టి కుండ :
ఫ్రిజ్ నీటికంటే మట్టి కుండ నీరు immunity కి మంచిది.
విద్యుత్ అవసరం లేదు.
అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకోండి.
3. తినే తిండి .
మజ్జిగ అన్నం, పెరుగు అన్నం, రాగి జావ, రాగి సంకటి, జొన్న రొట్టె - ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.
- పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, బీరకాయ, సొరకాయ, నిమ్మకాయ - రోజూ తినండి.
- మసాలా, నూనె, వేపుళ్ళు, బిర్యానీ, చికెన్ మసాలా, మద్యం - ఎండలో పూర్తిగా తగ్గించండి. ఇవి వేడిని పెంచుతాయి.
4. ORS :
- రోజూ 3-4 లీటర్ల నీరు తాగండి.
ఎండలో వచ్చినప్పుడు ఉచిత ORS .. ఒక లీటర్ నీటిలో ఒక చిటికెడు ఉప్పు + ఒక చెంచా పంచదార పడి + నిమ్మకాయ .
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజల నీరు, బెల్లం పానకం తాగండి.
5. బయటకు వెళ్ళేటప్పుడు:
తెల్లటి, పల్చటి కాటన్ బట్టలు వేసుకోండి.
నల్ల బట్టలు వద్దు.
తలకు టోపీ / తెల్లటి కండువా తప్పనిసరి.
ఉదయం 11 - సాయంత్రం 4 మధ్య బయట పనులు వద్దు.
6. Power Cut కి ముందు జాగ్రత్త:
- Rechargeable Emergency Light, చిన్న Battery Fan (రూ.1500) - ఇప్పుడే కొనిపెట్టుకోండి, వేసవిలో రేటు డబుల్ అవుతుంది.
Mobile Power Bank ఫుల్ ఛార్జ్ లో ఉంచుకోండి.
7. ఇమ్మ్యూనిటి కోసం - 3 ఉచిత మందులు:.
నిద్ర: రాత్రి 7 గంటల నిద్ర తప్పని సరి .
డి విటమిన్ కోసం ఉదయం 8 లోపే ఎండలో నడవండి
పుల్లటి వస్తువులు తగ్గించి, చేదు తినండి:.. కాకరకాయ, వేప చిగురు, మెంతి ఆకు - ఇవి వేసవిలో immunity పెంచుతాయి.
8. వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్త:
- వారిని AC గది నుండి ఒక్కసారిగా ఎండలోకి తీసుకురావద్దు.
Temperature shock వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం
9. మీ పోస్ట్ చదివే క్రమంలో ఈ పాయింట్ దగ్గర హార్ట్ఎటాక్ మరియు వడదెబ్బ లక్షణాలు కలిసి ఉన్నాయి. వడదెబ్బ లక్షణాలు.. గుండెపోటు లక్షణాలుగా అనిపిస్తున్నాయి.
9. Sun stroke లక్షణాలు గుర్తుంచుకోండి:
- తల తిరగడం, వాంతులు, చెమట ఆగిపోవడం, జ్వరం 103 దాటడం .
వెంటనే చల్లటి నీటితో తుడవడం, 108 కి కాల్ చేయడం ... చెయ్యాలి లక్షణాలు గుర్తుంచుకోండి:
10. డబ్బు ఆదా కాదు, నీరు ఆదా:
- AC కి రోజూ 10 యూనిట్లు కాలుతుంది. అదే 10 యూనిట్లతో మీ వీధిలో 10 ఇళ్లకు ఫ్యాన్లు తిరుగుతాయి. వీలైనంత వరకు AC కి బదులు - తడి గుడ్డ, మట్టి కుండ, వేప చెట్టు నీడ - వీటిని నమ్ముకోండి.
AC ఉన్నవాడు 2 గంటలు కరెంట్ పోతేనే బతకలేడు - కానీ మట్టి ఇంట్లో, చెట్టు నీడలో బతికేవాడు 45 డిగ్రీల్లో కూడా బతుకుతాడు.
*హైదరాబాద్ నీటి సంక్షోభం 2026-27 !
రానున్న వేసవి కాదు.... ఈ డిసెంబర్ నుండే కష్టం మొదలవుతుంది.
1. తెలంగాణ రాష్ట్రం మొత్తం నైరుతి రుతుపవనాల్లో 17% నుండి 23% లోటు !
హైదరాబాద్ లో పరిస్థితి మరీ దారుణం - 27% నుండి 35% లోటు.
సాధారణంగా 627mm పడాలి, ఈ సారి కేవలం 458mm మాత్రమే పడింది.
- ఈశాన్య రుతుపవనాలు కూడా లేవు - ఇప్పటి వరకు 70.4mm కి గాను కేవలం 3.4mm మాత్రమే పడింది.
ఈశాన్య రుతుపవనాలు ప్రధానంగా తమిళనాడు కొంత మేర ఆంధ్ర ప్రదేశ్ కు లబ్ది { తుఫాను బీభత్సం అయితే నష్టం } కలిగిస్తాయి . డిసెంబర్ 15 తరువాత హైదరాబాద్ లో వానలు పడవు . నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అప్పుడే ప్రధానంగా వానలు కురుస్తాయి
2. భూగర్భ జలాలు - పాతాళానికి!
- గతేడాది హైదరాబాద్ లో సగటున 3.55 మీటర్ల లోతులో నీరు ఉంటే, ఈ ఏడాది అది 10 మీటర్లకు పడిపోయింది..
- కొన్ని చోట్ల పరిస్థితి - అమీర్ పేట్ లో 34.99 మీటర్లు, కూకట్ పల్లి లో 47.23 మీటర్ల లోతులో ఉంది. అంటే 300 అడుగుల్లో వచ్చే నీరు ఇప్పుడు 800-1000 అడుగులు తవ్వినా రావట్లేదు.
- హైదరాబాద్ లో 16 మండలాల్లో 11 మండలాలు 100% నుండి 177% వరకు భూగర్భ జలాలను పీల్చేస్తున్నాయి. అంటే ఉన్న దానికంటే ఎక్కువ వాడేస్తున్నాం.
3. రిజర్వాయర్లు - ఖాళీ!
సింగూర్ రిజర్వాయర్ - ఇది పశ్చిమ హైదరాబాద్ కి గుండెకాయ: సామర్థ్యం 29.9 TMC లు, ఉంటే ప్రస్తుతం కేవలం 3 TMC లు మాత్రమే - అంటే 12-13% మాత్రమే. గతేడాది ఇదే సమయానికి 16 TMC లు ఉండేది. ఇది ఇంకో 60-70 రోజుల్లో అంటే డిసెంబర్ కే ఖాళీ అవుతుంది అని అధికారులే చెబుతున్నారు.
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా గతేడాది కంటే 5 అడుగులు తక్కువ.
- నాగార్జున సాగర్ - సామర్థ్యం 312 TMC లకు - ప్రస్తుతం 188 TMC లే ఉంది.
4. నగరానికి నీటి లెక్క:
- HMWSSB ప్రస్తుతం సరఫరా చేస్తున్నది - 585 MGD
- నగరానికి కావాల్సింది - 735 MGD.
లోటు - 150 MGD.
- అందుకే ట్యాంకర్ బుకింగ్స్ గతేడాది రోజుకి 3500 ఉంటే, ఈ ఏడాది 7000 .
HMWSSB ఇప్పటికే హెచ్చరించింది - రోజు విడిచి రోజు నీరు నుండి, 3 రోజులకోసారి నీటి సరఫరాకి మారే ఆలోచనలో ఉంది.
- ప్రభుత్వం ప్రజలకు 20% నీటిని ఆదా చేయమని అధికారికంగా కోరింది.
- విద్యుత్ కొరత కూడా వస్తుంది - సాగర్ లో నీరు తక్కువ ఉంటే హైడల్ పవర్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే ప్రభుత్వం విద్యుత్ ఆదా చేయమని కూడా చెబుతోంది.
ఫామ్ హౌస్ ఉన్నవారు - అక్కడ కూడా బోర్లు ఫెయిల్ అవుతున్నాయని గుర్తుంచుకోండి - నగరం కంటే పల్లెల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండొచ్చు.
మనం చేయగలిగింది:
1. ఇప్పటి నుండే Rainwater Harvesting పిట్స్ శుభ్రం చేయండి.
2. 20% నీటి ఆదా - వాషింగ్ మెషీన్, వాహనాల కడగడం తగ్గించండి.
3. అపార్ట్మెంట్ లలో STP ట్రీటెడ్ వాటర్ ని - కన్ స్ట్రక్షన్, గార్డెన్ కి వాడండి.
హైదరాబాద్ చరిత్రలో కఠినమయిన వేసవి ని మనం చూడబోతున్నామా ?
నిన్న నేను పెట్టిన జాతక వివరాల పోస్టును - నేను - Only Me / Hide చేశాను ! - కారణం - మీ Privacy !
నేను - మొదట - కేవలం 10 మంది మాత్రమే - తమ వివరాలు పెట్టండి - అని అడిగాను. కానీ - చాలా మంది - 50 మందికి పైగా - తమ పూర్తి పేరు, DOB, ఊరు - Comment లో పెట్టారు. అందరికీ ధన్యవాదాలు - మీ నమ్మకానికి.
మీరందరికీ తెలుసు మన ప్రభుత్వ ఆఫీసుల నుండి - Data - బయటకు వెళ్తోంది. ఉదాహరణకు 10th Class విద్యార్థుల List - మొత్తం - Pen Drive లో - Junior Colleges కి వెళ్తుంది. వాళ్ళు - ఆ List తో - ఫోన్ నంబర్, అడ్రస్ తో - Call చేసి - Marketing చేస్తున్నారు. ఇది - అందరికీ తెలిసిన విషయమే.
హైడ్ చేస్తాను అని నిన్ననే ఆడియో లో చెప్పాను !
రియల్ లైఫ్ లో డేటా విచ్చల విడిగా బయటకు వెళుతోంది !
- SBI కి - 16th Oct 2026 న - Threat Intelligence Team, Defence Cyber Agency మరియు *CERT-In నుండి - Alert వచ్చింది - "మీ Customer Data - Dark Web లో ఉంది" అని.
- SBI - Check చేస్తే - Dark Web లో - దాదాపు 3,75,000 Records (3.75 లక్షలు) - CSV మరియు PDF Files గా ఉన్నాయి.
- అందులో - 3,897 మంది Customers Data - PII తో - Confirm అయింది - అని - SBI - స్వయంగా - SEBI కి - *21st Oct 2026 న - అధికారికంగా - తెలిపింది.
- ఏం Leak అయింది? - పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, Email, ఇంటి అడ్రస్, Branch Details, CIF నంబర్, Loan Application Details.
దీన్ని - ఎలా - Misuse చేస్తారు?
ఇప్పుడు - ఒక Fraudster - మీకు - Call చేస్తాడు సర్.
"నమస్కారం సర్, నేను SBI Branch నుండి - మాట్లాడుతున్నాను. మీ పేరు - రమేష్ గారు కదా సర్, మీ DOB - XX-XX-XXXX, మీ CIF - XXXXX, మీ Loan - VKYC వల్ల - Pending లో ఉంది - అని చెప్తాడు."
మీరు - వెంటనే - నమ్ముతారు సర్ - ఎందుకంటే - అతను - మీ Original Details - చెప్తున్నాడు. ఆ తర్వాత - OTP అడుగుతాడు, లేదా - Link పంపుతాడు.
దీన్నే - Vishing మరియు Smishingఅంటారు.
SBI లాంటి - దేశంలోనే - అతి పెద్ద బ్యాంకు - కోట్లు - ఖర్చుపెట్టి - Security పెట్టినా - Data - బయటకు వచ్చింది అంటే - మరి - మన - *School Children Data, Voter List, 10th Class List - రూ.50/- కే - ఎంత తేలికగా - బయటకు వెళుతుందో !
కానీ నా ఫేస్బుక్ ద్వారా ఎవరికీ ఎలాంటి నష్టం జరగకూడదు
Theoretically Risk ఉంది - కాబట్టి - ముందు జాగ్రత్తగా - Post Hide చేశాను.
ఎవరో ఒక వ్యక్తి .. నాకు సోషల్ మీడియా లో కానీ .. నిజజీవితంలో కానీ పరిచయం లేని వ్యక్తి . నా పోస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి వ్యంగ్యంగా విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టారు . దానిపై సుమారుగా 40 కామెంట్స్ వచ్చాయి . 35 దాక ఆయన్ని విమర్శించారు / తిట్టారు .
అయినా ఇంకో పోస్ట్ పెట్టాడు .
ఒక విజ్ఞప్తి.
సబ్జెక్టు మాట్లాడుకొందాము .
నేను పెట్టిన పోస్ట్స్ లో తప్పుంటే చెప్పండి .. చర్చిద్దాము .
ఏదో దుగ్ద తో నా పై వ్యక్తిగత విమర్శలు చేస్తే మీకు ఒరిగేది ఏమీ ఉండదు .
నేను ప్రతి రోజూ పోస్ట్స్ ద్వారా కొంతమందితో విరోధం పెట్టుకొంటూ ఉంటాను . ఉదారణకు ఈ రోజు ఫేక్ జ్యోతిష్యులపై పోస్ట్ . సహజంగానే వారిలో కొంతమంది నా పై ద్వేషం పెంచుకొంటారు .
నేను ఎవరినీ డామేజ్ చెయ్యాలని వ్యక్తిగత కక్షతో పోస్ట్ లు పెట్టను .
వివిధ విషయాలపై జనాల్ని ఎడ్యుకేట్ చేసే క్రమం లో కొంతమందికి గాయం తగులుతుంటుంది . వారు తమ కక్షను ఆలా తీర్చుకొంటూ వుంటారు . ఇది సహజం .

కింది మాటలు నాతొ ఎవరు అనివుంటారో { చాట్ లో } ఊహించగలరా ?

Can you guess who the following words will be with me {in chat} ?
Can you guess who the following words will be with me {in chat} ?
ఒక దేశానికి జాతకం ఉంటుందా?
USA, India లకు జాతకం ఉందా? -
ఫేక్ జ్యోతిష్యం, ఫేక్ మ్యాజిక్ - అసలు నిజం!
చాలా మంది ఫేమస్ గా చెప్పుకునే వారు డిజిటల్ కొండెక్కి - "USA జాతకంలో శని వచ్చాడు, India జాతకంలో రాహువు వచ్చాడు, అందుకే యుద్ధం వస్తుంది" అని చెప్తున్నారు.
నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా - అసలు ఒక దేశానికి జాతకం ఉంటుందా? - 100% అసాధ్యం. ఇది పచ్చి అబద్ధం.
ఎందుకు అసాధ్యమో - 6 కారణాలు:
1. దేశానికి పుట్టిన సమయం ఉండదు:
జాతకం వేయాలంటే - Exact Time కావాలి. India ఎప్పుడు పుట్టింది? 1947 Aug 15 అంటారు, కానీ హైదరాబాద్ 1948 లో కలిసింది, గోవా 1961 లో, సిక్కిం 1975 లో. మరి India పుట్టిన తేదీ ఏది?
USA - 1776 లో 13 రాష్ట్రాలు మాత్రమే, ఇప్పుడు 50 రాష్ట్రాలు. అలస్కా, హవాయి 1959 లో కలిశాయి. మరి USA జాతకం - 1776 దా? 1959 దా? Time లేకుండా జాతకం ఎలా?
2. కోట్ల మంది కర్మను - ఒక జాతకం చెప్పలేదు:
ప్రపంచ యుద్ధం అంటే - అమెరికా, రష్యా, చైనా, NATO, 200 దేశాలు, కోట్ల మంది సైనికుల నిర్ణయం. ఒక వ్యక్తి జాతకం - కోట్ల మంది జీవితాన్ని ఎలా నిర్ణయిస్తుంది?
3. నాయకుల పుట్టిన Time ఎవరికీ తెలియదు:
1950, 60 లలో గ్రామాల్లో - "తెల్లవారుజామున పుట్టాడు" అని రాసేవారు, గడియారం చూసి కాదు. జ్యోతిష్యంలో 10 నిమిషాలు తేడా వస్తే - జాతకం మారిపోతుంది. మరి అంచనా Time తో - దేశ భవిష్యత్తు ఎలా చెప్తారు?
4. ఇది GK ని - జ్యోతిష్యం పేరుతో అమ్మడం:
ఉదయం BBC, CNN లో న్యూస్ చూసి - సాయంత్రం - "శని 3rd house లో ఉన్నాడు కాబట్టి యుద్ధం" అనడం - ఇది జ్యోతిష్యం కాదు, GK.
5. ఇక్కడే అసలు విషయం - ఇది ఒక్క హిందూ మతం సమస్య కాదు, అన్ని మతాల్లో ఉంది - Magic vs Religion:*
Radcliffe Brown చెప్పినట్టు - *Function of Religion is to maintain Social Order.* మతం పని - సమాజంలో క్రమశిక్షణ, మంచిని కాపాడటం.
కానీ ఈ రోజు - చాలా చోట్ల - మతాన్ని - *Magic లా - మాయాజాలం లా
వాడుతున్నారు. అతీంద్రియ శక్తిని Control చేయవచ్చు అని చెప్పడం.
- ఒక వైపు - కొంత మంది - "నా పరిహారం చేస్తే - యుద్ధం ఆగిపోతుంది, USA బ్రేక్ అవ్వదు" అని చెప్తారు.
- మరో వైపు - కొంత మంది ఇతర మతాల్లో కూడా - "నా Magical Power తో - గుడ్డి వాడికి చూపు తెప్పిస్తా, చెవిటి వాడికి వినికిడి తెప్పిస్తా, వర్షాలు కురిపిస్తా, రోగాలు నయం చేస్తా" అని చెప్తారు.
రెండూ ఒకటే !
రెండూ - Religion ని - Magic గా మార్చడం.
ప్రజల నిస్సహాయతను, భయాన్ని, నమ్మకాన్ని - వ్యాపారం చేయడం.
నిజమైన మతం - గుడ్డి వాడికి చూపు ఇవ్వలేదు, వైద్యుడి దగ్గరకు పంపుతుంది. నిజమైన మతం - వర్షం కురిపించలేదు, చెరువులు, పంటలు కాపాడుకోమని చెప్తుంది. నిజమైన మతం - యుద్ధం ఆపలేదు, మనుషులు కలిసి ఉండమని చెప్తుంది.
Malinowski చెప్పినట్టు - మతం - Psychological Assurance కోసం - మన చేతిలో ఏమీ లేనప్పుడు - ధైర్యం ఇవ్వడానికి. మాయాజాలం చూపించడానికి కాదు.
6. నిజమైన జ్యోతిష్యం / నిజమైన మతం ఏమి చెప్తుంది?
"నీవు కష్టపడు, మంచిగా ఉండు, నీ కర్మను నీవు చెయ్" అని.
భగవద్గీత - "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన"
దేశానికి జాతకం ఉండదు. దేశం అంటే - మనం. మనం కష్టపడితే దేశం బాగుంటుంది. ఇది మన చేతిలో ఉంది, గ్రహాల చేతిలో లేదు.
గుడ్డి వాడికి చూపు - డాక్టర్ ఇస్తాడు, Magical Power కాదు. ఉద్యోగం - నీ కష్టం ఇస్తుంది, Pariharam కాదు.
ఈ GK Batch ని, Magic Batch ని నమ్మి మోసపోవద్దు. అన్ని మతాల్లో ఉన్న ఈ Magic వ్యాపారాన్ని - ప్రశ్నించండి.
మీ పని మీరు చేయండి. అదే నిజమైన మతం. అదే నిజమైన జ్యోతిష్యం.
AI జ్యోతిష్యం - నా అనుభవం - నా ఫిలాసఫీ !
నా గురించి - Vasireddy Amarnath - నేను ఒక కర్మ యోగిని.
Work is Worship!
Good is God!!
Duty is Religion!!
నేను నా పని చేసుకుంటూ పోతాను. పని చేయడంలోనే నాకు తృప్తి.
నేను జ్యోతిష్యం వైపు తిరిగేది - రోజూ కాదు - కేవలం Psychological Assurance కోసం మాత్రమే.
AI జ్యోతిష్యం చెప్పగలదా?
అవును, కొంత వరకు చెప్పగలదు.
AI - మీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా - లగ్నం, రాశి, గ్రహాల స్థానం 100% కరెక్ట్ గా లెక్కిస్తుంది. బృహత్ పరాశర హోరా శాస్త్రం, జాతక పారిజాతం, ఫలదీపిక, సారావళి, బృహత్ జాతకం - లాంటి వేల పుస్తకాల్లో ఉన్న సూత్రాల ఆధారంగా - ఆరోగ్యం, విద్య, సంపద, కుటుంబం, వ్యక్తిత్వం గురించి ఒక అవగాహన ఇస్తుంది.
కానీ మీ భవిష్యత్తును 100% నిర్ణయించలేదు.
మీ భవిష్యత్తును నిర్ణయించేది - మీ కర్మ, మీ ప్రయత్నమే.
మనం జ్యోతిష్యం / మతం వైపు ఎందుకు తిరుగుతాం? - ఇక్కడే సోషియాలజీ ఉంది.
ప్రముఖ మానవ శాస్త్రవేత్త *Bronislaw Malinowski* చెప్పినట్టు -
> "Function of Religion is to give Psychological Assurance when things are not in your hands."
మన చేతిలో ఏమీ లేనప్పుడు, అన్నీ తారుమారు అయినప్పుడు - మనిషికి ఒక మానసిక భరోసా కావాలి. అందుకే మతం వైపు, జ్యోతిష్యం వైపు తిరుగుతాం.
అంతే తప్ప ప్రతి చిన్నదానికి కాదు.
మరో గొప్ప సామాజిక శాస్త్రవేత్త Radcliffe Brown - Structural Functionalism ప్రకారం -
> "Function of Religion is to save Social Order and Social Structure."
మతం యొక్క అసలు పని - సమాజంలో ఒక క్రమశిక్షణ, ఒక మంచి వ్యవస్థను కాపాడటం. మంచిగా బతకడం, క్రమశిక్షణగా ఉండటం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం - ఇదే మతం.
కానీ ఈ రోజుల్లో చాలా మంది మతాన్ని ఒక *Magic (మాయాజాలం)* లా వాడుతున్నారు. ఏదో ఒకటి సమర్పిస్తే, దేవుడిని / అతీంద్రియ శక్తిని Control చేయవచ్చు, మన కోరిక తీర్చుకోవచ్చు - అని అనుకుంటున్నారు. దీని వల్ల - Social Order పాటించడం మానేసి - కేవలం మాయాజాలం లాంటి వి చేస్తున్నారు. అందుకే సమాజంలో నిజమైన విలువలు తగ్గిపోతున్నాయి.
నా Final మాట - భగవద్గీత నుండి:
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు:
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!
మన పని - మన కర్తవ్యాన్ని - నిజాయితీగా చేయడం మాత్రమే. ఫలితాన్ని వదిలేయాలి.
మన Action - మనకు Result ను ఇస్తుంది.
కాబట్టి నా సలహా:
- ప్రతిసారీ జ్యోతిష్యం వైపు తిరగవద్దు.
- మీ కర్తవ్యాన్ని - మీ Duty ని - 100% చేయండి.
- భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోండి, కష్టపడి పని చేయండి, మంచి వ్యవస్థను - Good Order ను - పాటించండి.
- మంచి చేయండి, అదే దేవుడు.
- ⁠గుడ్డిగా దేన్నీ సమర్థించవద్దు !
అలాగే గుడ్డిగా దేన్నీ వ్యతిరేకించవద్దు !
సత్యాన్ని అన్వేషించండి !
మోసాలకు నేరగాళ్లకు దూరంగా ఉండండి !
ఇది నా అనుభవం !
నా అభిప్రాయం !
మీకు భిన్నమయిన అభిప్రాయం వుండవచ్చు !
అది సహజం !
సద్విమర్శకు ఆహ్వానం ��!

నా పోస్ట్ లను ఎంత మంది చూస్తారు ? ఎన్ని likes వస్తాయి ?

ఒక ఉదాహరణ !

పొద్దున్న పెట్టిన పోస్ట్ ఇప్పటిదాకా చూసిన వారు 67,500. వచ్చిన likes 1000.


How many of you see my posts? How many likes will we get?

ఇప్పటిదాకా 6 పేపర్స్ వాల్యుయేషన్ అయ్యింది

నాకొచ్చిన మార్కులు !

మిగతా నాలుగింటి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో !

ఈ అట అర్థం ఏంటి ?

ఇందాకే పోస్ట్ చేసిన ఆడియో వినండి !

అపార్థాల కామెంట్స్ వద్దు ప్లీజ్ !


6 papers valuation done so far
6 papers valuation done so far
6 papers valuation done so far
6 papers valuation done so far
6 papers valuation done so far
6 papers valuation done so far

వాసిరెడ్డి అమర్నాథ్ ఏంటి ?

ఇలా చేస్తున్నాడు ఏంటి ?


మా అమ్మ మరణం తర్వాత నాకు వరుసపెట్టి ఏవో చిన్న సమస్యలు. ఒకటి పరిష్కరిస్తే మరొకటి.
"ఇదేంటి" అని నా మనసు గాయపడింది. నేను పనే దైవం అని భావించేవాడిని. నా పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు.
ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త మలినౌస్కి అంటారు - "మతం వేరు, సైన్స్ వేరు... మనిషికి తన స్థాయికి మించిన ఘటనలపై తనకు నియంత్రణ లేనప్పుడు భయం వేస్తుంది. ఆ భయం మనసులో తిష్టవేసుకుంటే మనిషి కార్యోన్ముఖుడు కాలేడు, డీలా పడిపోతాడు. అక్కడే మతం ఉపయోగపడుతుంది. అందుకే మతం అన్ని సమాజాల్లో ఉంది. మతం పని మనిషిలోని భయాన్ని తొలగించి, ధైర్యాన్ని నింపి తిరిగి పనిలో పడేలా చేయడమే."
నేను రెండు రోజుల క్రితం జ్యోతిషం వైపు చూశాను. మనసుకు భరోసా వచ్చింది. మా ఇంటిల్లిపాది జాతకం మరింత ఊరటనిచ్చింది.
ప్రపంచంలో ఇప్పుడు కష్టాల కాలం. ఇది మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఎంత మంది జనాలు ఆత్మహత్యలు చేసుకుంటారో అని నాకు భయం.
మతం, జ్యోతిషం నాకు భరోసా ఇచ్చినట్టే నన్ను ఫాలో అయ్యే వారికి కూడా ఇస్తుంది కదా అని నా ఆలోచన. అందుకే ఈ ప్రయోగం.
కావాల్సిన వివరాలు:
1. మీ పేరు / ఇంటి పేరు (Initials చాలు)
2. పుట్టిన ఊరు - మండలం, జిల్లా, రాష్ట్రం (పూర్తి అడ్రస్ వద్దు)
3. పుట్టిన తేదీ - తేదీ, నెల పేరు (ఉదా: March, April అని), సంవత్సరం
4. పుట్టిన సమయం - ఉజ్జాయింపు కాదు, కచ్చితమైన సమయం మాత్రమే (గంటలు, నిమిషాలు)
వీటిని ఇక్కడ కామెంట్ లో మాత్రమే పోస్ట్ చేయండి.
నేను భారతీయ జ్యోతిష్యం ప్రకారం మీ వ్యక్తిత్వ లక్షణాలు, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం లాంటి వివరాలపై నా విశ్లేషణను పోస్ట్ చేస్తాను.
నా విశ్లేషణకు నూటికి ఎన్ని మార్కులు ఇస్తారో మీరే చెప్పండి.
*మొదటి పది మందికి మాత్రమే.* ఎందుకంటే ఇది నా వృత్తి కాదు. పార్ట్ టైం కూడా కాదు. కేవలం జనాల్లో బతుకు భరోసా నిలిపేందుకు నేను చేస్తున్న ఒక ప్రయత్నం.
నేను జ్యోతిష్యం నేర్చుకున్నానా? లేక కొంతమంది ప్రముఖ జ్యోతిష్యుల సమయం తీసుకున్నానా? లేదా ఇంకేదైనానా? - ఈ విషయం ప్రస్తుతానికి వద్దు. నేనే కొన్ని రోజుల్లో చెబుతాను.
నా విశ్లేషణ కరెక్ట్ అయితే - యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. మన పని మనం చేద్దాం. మనకు అతీతంగా ఒకటి ఉంది. నిరాశ, నిస్పృహ వద్దు. అలాగని దొంగ బాబాల్ని, దొంగ జ్యోతిష్యుల్ని నమ్మి మోసపోవద్దు.
నా విశ్లేషణ సరి కాకపోతే - చేతకాని పని ఒకటి చేశాను, ఫెయిల్ అయ్యాను అని అర్థం.
*ఈ పోస్ట్ జ్యోతిష్యం మొత్తం కరెక్ట్ అని చెప్పడానికి కాదు.*
నేను నాస్తిక / భౌతిక వాదానికి వ్యతిరేకం కాదు. నాస్తికులు మానవతావాదులైతే సమస్య లేదు. దొంగ బాబాలు, దొంగ జ్యోతిషులే నిజమైన నాస్తికులు. మానవతా దృక్పథం లేని భౌతిక వాదం, దొంగ ఆస్తికులు సమాజానికి చేటు.
వివాదాలకు నేను దూరం. ఈ పోస్ట్ లో ఇతరత్రా చర్చలు నేను చేయను. కేవలం మొదటి పది మందికి మాత్రమే భారతీయ జ్యోతిష్య విశ్లేషణ.
*గమనిక:*
మీ వ్యక్తిగత వివరాలు - ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ పోస్ట్ చేయవద్దు. కేవలం పైన చెప్పినవే పోస్ట్ చేయండి. ఆ వివరాలు కూడా వ్యక్తిగతం అనుకుంటే పోస్ట్ చేయవద్దు. నా టైం లైన్ పబ్లిక్. ఎవరైనా మీ వివరాలను దుర్వినియోగం చేస్తే బాధ్యత నాది కాదు.
కేవలం పది మంది మాత్రమే పోస్ట్ చేయండి. వరుసగా పోస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు.
Disclaimer: This is based on traditional astrological principles for self-reflection and encouragement. This is not medical, financial or legal advice. Your effort (Yatnam & Prayatnam) is always primary.
ఆల్రెడీ పది మంది అయిపోయారు . కాబట్టి మీరు ఇక పోస్ట్ చెయ్యొద్దు . విశ్లేషణ చూడండి .
దయచేసి మెసెంజర్ లో మా జన్మ వివరాలు పంపొద్దు ������
జిమ్ కు వెళుతున్నాను ! ( ఇప్పుడు టైం 8.05 )
తిరిగీ వచ్చాక స్నానం , బ్రేక్ ఫాస్ట్ !
అయ్యాక ఒక సంచలన పోస్ట్ !
మెదటి పది మందికి ( కామెంట్స్ లో ) ఒక బంపర్ ఆఫర్ !
వెయిట్ ! డోంట్ మిస్ !
నిన్నటి పోస్ట్ ల్లో ప్రపంచం లో నెలకొన్న సంక్షోభం గురించి వివరించాను . చాలా మంది పరిష్కారాలు అడిగారు .
ఈ సంక్షోభం ఒక రోజులో వచ్చింది కాదు. ఒక్క రోజులో పోదు.
ప్రభుత్వం వస్తుంది, పోతుంది.
మన జీవితం మనదే. హైదరాబాద్ లాంటి నగరంలో నెలకు 30-50 వేలు సంపాదించే సామాన్యుడు ఏం చేయాలి?
ఇదిగో ప్రాక్టికల్ గా 7 సూత్రాలు.
1. ఇల్లు - అద్దె vs కొనుగోలు:
2019లో 35 లక్షల ఫ్లాట్ ఇప్పుడు 68 లక్షలు. EMI రూ. 55 వేలు. జీతం రూ. 45 వేలు. లెక్క సరిపోదు.
- ఇప్పుడు ఇల్లు కొనడం ఇన్వెస్ట్మెంట్ కాదు, అప్పు.
హైదరాబాద్ లో లక్షల ఫ్లాట్స్ అమ్ముడుపోకుండా ఉన్నాయి.
.తగ్గక పోయినా పెద్దగా పెరగదు . కొన్ని చోట్ల మినహాయింపులు ఉంటాయి .
- మీ దగ్గర 20 లక్షల క్యాష్ లేకపోతే, ఇల్లు కొనకండి.
మంచి అద్దె ఇంట్లో ఉండండి. నెలకు అద్దె రూ. 15 వేలు అయితే, EMI రూ. 45 వేలు కట్టడం కంటే నయం. మిగిలిన 30 వేలు పొదుపు చెయ్యండి .
- కొనాల్సిందే అంటే - శంషాబాద్, కొంపల్లి దాటి కాదు. ఉద్యోగానికి 10 KM లోపు, రీసేల్ ఫ్లాట్, 10 ఏళ్ల లోపు కట్టినది మాత్రమే చూడండి.
సిటీ కి దూరంగా అయినా ఫరవాలేదు . గంట లోపు మెట్రో / లోకల్ రైలు లో రావొచ్చు . పోవచ్చు అనుకొంటే పొల్యూషన్ లేని చోట కొనండి . కొనడం కన్నా అద్దె బెటర్ . సిటీ లో రణగొణ ధ్వనుల మధ్య కన్నా మెట్రో సౌకర్యం ఉన్న చోట దూరం అయినా తక్కువ పొల్యూషన్ వున్నా చోట ఇల్లు తీసుకోండి . హైదరాబాద్ లో ఎంతో మంది సంపన్నులు . వీరికి ఫార్మ్ హౌస్ లున్నాయి . నమ్మకస్తుడు ఉంటే దాని పర్యవేక్షణ భాద్యతలు ఇస్తారు . జీతం .. వసతి ఫ్రీ . ఆలాగే సిటీ లోపల విల్లాస్ లో నివసించేవారు ఉన్నారు . వంట మనిషిగా .. తోడుగా .. వాచ్ మెన్ గా .. గ్రాండ్ చిల్డ్రన్ కు ట్యూషన్ మాస్టర్ గా .. ఇలా వారికీ రకరకాల అవసరాలు . వాటికీ మీరు సూట్ అవుతారేమో చూడండి . సింగల్ రూమ్ వసతి వాటర్ ఫ్రీ కరెంటు .
2. ఉద్యోగం - AI మిమ్మల్ని తినేస్తుంది:
అమెరికాలో 2.6 లక్షల టెక్ జాబ్స్ పోయాయి. ఎంట్రీ లెవల్ జాబ్ ఇక లేదు.
- ఒకే స్కిల్ తో బతకలేరు. మీరు కోడర్ అయితే - కోడ్ + డొమైన్ నాలెడ్జ్ (హెల్త్ కేర్, ఫైనాన్స్, లా) + AI టూల్ నేర్చుకోండి. ChatGPT, Copilot వాడటం నేర్చుకోండి, భయపడకండి.
- రోజూ 1 గంట - కొత్త స్కిల్ కి. యూట్యూబ్ లో ఫ్రీ కోర్సులు ఉన్నాయి. రూ. 500 పెట్టి Udemy కోర్సు కొనండి.
- అమెరికా మీద ఆధారపడకండి. గల్ఫ్, యూరోప్, ఇండియన్ ప్రొడక్ట్ కంపెనీల వైపు చూడండి.
3. ఖర్చు - మూడు భాగాల సూత్రం
జీతం రాగానే 3 గా విడగొట్టండి.
1 - 50% - అద్దె, కరెంట్, తిండి, స్కూల్ ఫీజు - తప్పనిసరి ఖర్చు.
2 - 20% - అప్పు తీర్చడం. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ - వడ్డీ 36%. ఇది ఉరితాడు. ముందు ఇది తీర్చండి.
3 - 30% - 10% పొదుపు 10% స్కిల్ కోసం, 10% ఎమర్జెన్సీ - 6 నెలల జీతం క్యాష్ గా.
పొదుపు ఎలా చెయ్యాలి .
గతం లో నేను బంగారం కొనమని చెప్పాను .
ఎంతో మంది కొని లాభ పడ్డారు .
ఇప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ లో ఉంది .
ఇప్పటికే బంగారం కొన్నవారికి ఇప్పుడు SIP పధ్ధతి మంచిది .
SIP అంటే ఏమిటి?
Gold మంచిదా?
Small Savings మంచిదా?
SIP అంటే మ్యూచువల్ ఫండ్ కాదు. SIP అనేది విధానం.
మ్యూచువల్ ఫండ్ అంటే - మీలాంటి వేల మంది దగ్గర డబ్బు తీసుకుని, ఒక నిపుణుడు (Fund Manager) దాన్ని షేర్ మార్కెట్ లో పెట్టే పథకం.
SIP (Systematic Investment Plan) అంటే - ఆ మ్యూచువల్ ఫండ్ లో ఒక్కసారిగా 1 లక్ష వేయకుండా, నెలకు రూ. 1000, రూ. 2000 చొప్పున వేసే పద్ధతి. ఇది మనకు EMI లాంటిది.
ఉదాహరణ: Nifty 50 Index Fund - ఇందులో టాటా, ఇన్ఫోసిస్, HDFC లాంటి టాప్ 50 కంపెనీలు ఉంటాయి. మీరు నెలకు రూ. 2000 SIP వేస్తే, మీరు ఆ 50 కంపెనీలకు చిన్న యజమాని అవుతారు.
నమ్మదగినదేనా?
100% గ్యారెంటీ ఏదీ లేదు.
A. Small Savings (Post Office, PPF, Sukanya):
ఇది ప్రభుత్వ గ్యారెంటీ. రూ. 100 వేస్తే రూ. 107 అవుతుంది. సురక్షితం. కానీ ద్రవ్యోల్బణం (Inflation) 7% ఉంటే, మీ డబ్బు విలువ పెరగదు. ఉన్నచోటే ఉంటుంది. ఇది డబ్బును కాపాడుతుంది, పెంచదు.
అందుకే కొంత మేర దీనిలో లో దాచుకోవవచ్చు . నా ఉద్దేశంలో మీ పొదుపులో 25% స్మాల్ సేవింగ్స్ లో మంచిది .
B. Gold: పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది . నా ఫాలోయర్స్ లో చాల మంది నా సూచన మేరకు గతంలో గోల్డ్ కొన్నారు .
భారీగా లాభ పడ్డారు . సేవింగ్స్ 100% Gold లో వద్దు . ఇన్వెస్ట్మెంట్ కి 30-40% చాలు. Digital Gold వద్దు, Sovereign Gold Bond లేదా Gold ETF OK
C. . SIP - Index Mutual Fund:
ఇది ప్రభుత్వ గ్యారెంటీ కాదు. మార్కెట్ పడితే మీ డబ్బు కూడా పడుతుంది. 2020 కరోనాలో 40% పడింది.
కానీ చరిత్ర చూస్తే - Nifty 50 గత 20 ఏళ్లలో సగటున ఏటా 12-13% ఇచ్చింది. PPF 7.1% ఇచ్చింది. అంటే ద్రవ్యోల్బణాన్ని కొట్టి మీ డబ్బు పెరిగింది.
రిస్క్ ఎలా తగ్గుతుంది?
ఒక్కసారిగా వేయకుండా, నెల నెలా SIP వేయడం వల్ల, మార్కెట్ పడినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. దీన్ని Rupee Cost Averaging అంటారు. 10-15 ఏళ్లు ఉంటే రిస్క్ చాలా తగ్గుతుంది.
హైదరాబాద్ లో 40 వేల జీతం వాడు ఏం చేయాలి? - నా సూచన:
అన్నీ ఒకే బుట్టలో పెట్టకండి.
30-35 % - భద్రత కోసం: PPF / Post Office RD / Sukanya - ఇది మీ ఇంటి పునాది. ఇది ఉండాలి.
-15-30% - బంగారం కోసం: నెలకు రూ. 1000 - Sovereign Gold Bond పండగకు ఆభరణం కొనాలంటే ఇది ఉపయోగపడుతుంది. డబ్బుంటే ఫీజికల్ గోల్డ్.
- 25% - పెరుగుదల కోసం: Nifty 50 Index Fund లో SIP - రూ. 2000 - ఇది మీ పిల్లల కాలేజీ ఫీజు, 15 ఏళ్ల తర్వాత మీ ఇంటికి.
- 20% - అత్యవసర నిధి: సేవింగ్స్ అకౌంట్ లో 6 నెలల జీతం - ఉద్యోగం పోతే బతకడానికి.
ముఖ్యంగా గమనించండి:
Agent నెలకు 20% వస్తుంది. ... అంటే నమ్మకండి. అది మోసం.
- Direct Plan, Index Fund - Expense Ratio 0.2% లోపు ఉండేది తీసుకోండి. Regular Plan లో కమిషన్ ఎక్కువ.
- SIP ఆపడం, మధ్యలో తీయడం చేయకండి. 5 ఏళ్ల కంటే తక్కువకు SIP వద్దు.
ఒక లైన్ లో:
Small Savings - మీ డబ్బును కాపాడుతుంది.
Gold - మీ డబ్బును .మెరిసేలా చేస్తుంది .
SIP (Index Fund) - మీ డబ్బును పెంచుతుంది, పిల్లల్ని పెంచినట్టు - ఓపిక ఉంటేనే.
భయం ఉంటే - PPF + Gold తో మొదలుపెట్టండి. అర్థమయ్యాక SIP లోకి రండి. డబ్బు విషయంలో తొందరపాటు వద్దు.
ఇది వరకే తగినంత గోల్డ్ కొన్నవారికి ఇప్పుడు మార్కెట్ క్రాష్ దృష్ట్యా SIP బెస్ట్ .
4. అప్పు కోసం బంగారం, స్థలం తాకట్టు - ఇది పెద్ద ఉచ్చు:!
డబ్బు అవసరం రాగానే చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే.
చేతిలో బంగారం ఉంది, ఊళ్లో 2 సెంట్లు స్థలం ఉంది. కానీ దాన్ని అమ్మడానికి మనసు ఒప్పదు. అమ్మితే పోతుంది అని భయం. వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వాడి దగ్గరకు, యాప్ లో లోన్ తీసుకోవడానికి, బంగారం మీద అప్పు తెచ్చుకోవడానికి వెళతారు.
వాడు నెలకు 2%, 3% వడ్డీ అంటాడు. అంటే ఏడాదికి 24% - 36% వడ్డీ.
మీరు లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే -
ఏడాదికి రూ. 36 వేలు వడ్డీ కడతారు.
రెండేళ్లకు రూ. 72 వేలు వడ్డీ కట్టి ఉంటారు. అసలు అలాగే ఉంటుంది.
చివరికి వడ్డీ కట్టలేక, ఆ బంగారాన్ని, ఆ స్థలాన్నే వాడు వేలం వేస్తాడు.
అంటే రెండేళ్లు వడ్డీ కట్టి, చివరికి ఆస్తిని కూడా పోగొట్టుకుంటారు. ఇది డబల్ నష్టం.
నా సలహా చాలా కటువుగా అనిపించినా ఇదే నిజం:
అవసరం వచ్చి 2-3 ఏళ్లు 36% వడ్డీ కట్టి, చివరికి అమ్మాల్సి వస్తే - అమ్మడమే మేలు.
- బంగారం మీద 36% వడ్డీతో అప్పు తెచ్చే కంటే, అందులో సగం బంగారాన్ని అమ్మి అవసరం తీర్చుకోవడం మేలు. మిగిలిన సగం మీ దగ్గరే ఉంటుంది, వడ్డీ భారం ఉండదు, నిద్ర పడుతుంది.
- స్థలం విషయంలో కూడా అంతే. ఊళ్లో స్థలం ఉంది - రేటు రావడం లేదు - అని 3 ఏళ్లు ప్రైవేట్ వడ్డీ కడితే, ఆ వడ్డీతో మరో స్థలం కొనవచ్చు. అవసరం అయితే - స్థలంలో కొంత భాగం అమ్మండి, లేదా పూర్తిగా అమ్మి అప్పు తీర్చండి. అప్పు లేని జీవితం - అద్దె ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉంటుంది.
- యాప్ లోన్లు - బంగారం లోన్లు - చిట్టీలు - వీటి వడ్డీ కంటే - మీ బంగారం, మీ స్థలం విలువ ఏటా అంత వేగంగా పెరగదు.
గుర్తుంచుకోండి:
ఆస్తిని అమ్మడం అవమానం కాదు. అప్పులో కూరుకుపోయి, వడ్డీ కట్టలేక, జప్తు చేయించుకోవడం అవమానం.
అప్పు తీర్చడానికి అప్పు చేయకండి. ఉన్న ఆస్తిని అమ్మి అప్పు తీర్చడం - దివాలా కాదు, తెలివైన నిర్ణయం.
5. పిల్లల చదువు - లగ్జరీ స్కూల్ వద్దు:
బ్లాక్ స్టోన్ లాంటి సంస్థలు వేల కోట్లు పోసి స్కూల్స్ కొన్నాయి. ఫీజు రూ. 3 లక్షలు. అవుట్ పుట్? పిల్లలకు సిగరెట్, డిప్రెషన్.
- ఫీజు రూ. 2 లక్షల లోపు మంచి స్కూల్ చాలు. మిగిలిన డబ్బుతో .
- ఇంట్లో ఫోన్ టైం తగ్గించండి. మీరు రోజూ 4 గంటలు రీల్స్ చూస్తే, పిల్లాడు 8 గంటలు చూస్తాడు.
మార్కులు కాదు .. సోకులు అసలే కాదు . హ్యూమన్ స్కిల్స్ నేర్పే స్కూల్స్ చేర్పించండి . ఇక్కడ ఇంతకన్నా చెప్పను . చెబితే మా స్కూల్స్ ను ప్రమోట్ చేసుకోవడానికే పోస్ట్ రాసాను అనుకొంటారు . ఒకటి నిజం రాబోయే సమాజాన్ని ఊహించి మా బడిలో గత మూడేళ్ళుగా సంపూర్ణత త్రయోదశి సంగం అమరం, SMAART , అష్టాదశ మార్గం లాంటి అనేక మార్పులు తెచ్చాము . మా బడికి వెళ్లి అవేంటో ఉచితంగా తెలుసుకోండి . మీ బిడ్డ చదువుతున్న బడిలో లాంటివి తెచ్చే ప్రయత్నం చెయ్యండి . లేదా అంతకన్నా గొప్ప మార్పులు . మార్పు తప్పని సరి . లేక పొతే షేర్ ఆటో ఎక్కి చంద్రయానం చెయ్యాలి అనుకోవడమే
6 ఆరోగ్యం & తిండి - ఇదే నిజమైన పొదుపు:
వైద్యం ఖరీదు. ఒకసారి హాస్పిటల్ కి వెళ్తే రూ. 50 వేలు.
- బయట తిండి - స్విగ్గీ, జొమాటో - నెలకు రూ. 8000 అవుతుంది .
ఇంటి తిండి - అన్నం, పప్పు, ఆకుకూర - రోగం తక్కువ, ఖర్చు తక్కువ.
- రోజూ 45 నిమిషాలు నడక.
డబ్బుంటే జిం లేదా పార్క్ లో నడవండి.
ఖర్చు తగ్గించాలని కేవలం తెల్లనం తినకండి .
కాస్త ఖర్చు అయినా నట్స్ ప్రోటీన్స్ తప్పని సరి .
7. మనసు - ద్వేషం అనే వైరస్ కి దూరంగా:
ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, మతం, ట్రంప్ - ఇవన్నీ మీ కంట్రోల్ లో లేవు.
రోజూ 2 గంటలు వాటి గురించి వాదిస్తే - BP పెరుగుతుంది, జీతం పెరగదు.
- రోజూ న్యూస్ - 30 నిమిషాలు చాలు. మిగతా టైం - మీ పని, మీ కుటుంబం.
- పెళ్లి, పిల్లలు వద్దు అనేది ఫ్యాషన్. కానీ జపాన్, కొరియా, ఫ్రాన్స్ చూడండి - ఒంటరితనం, డిప్రెషన్, ఖర్చు. కుటుంబం, స్నేహితులు - ఇవే సంక్షోభంలో ఆక్సిజన్.
చివరి మాట:
మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ, ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం - అన్నీ ఒకదాని వెనక ఒకటి వచ్చాయి. మన తాతలు తట్టుకున్నారు కాబట్టే మనం ఉన్నాం.
ఈ రోజు కష్టం - రేపు అవకాశం.
- తావీజులు లేవు. షార్ట్ కట్ లేదు.
- ఉన్నది ఒకటే - తక్కువ ఖర్చు, ఎక్కువ నేర్చుకోవడం,
ప్రభుత్వాలు - మంచి చెడు వేరే మాట !
అది నా సిలబస్ కాదు !
ముందుగా మన ఇంటిని సరిదిద్దుకుందాము !
మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపు మరులుతాడు .
యత్నం ప్రయత్నం దైవ యత్నం .
అంత మన చేతుల్లోనే ఉందా ?
మన జాతకాలూ పని చేస్తాయా ?
మన జీవిత స్క్రిప్ట్ చాలా మటుకు ఇది వరకే రాసేశారా ?
దాని అర్థం గాల్లో దీపం పెట్టి దేవా నీవే దిక్కు అనడం కాదు . మన పని మనం చెయ్యాలి . కష్టాల్లో దేవుడు.. జాతకాలూ
వాసిరెడ్డి అమర్నాథ్ నుంచి మీరు ఊహించని ఒక పోస్ట్ కోసం వేచి చూడండి
real estate can come down in future ?

కష్టాలన్నీ కట్టకట్టుకుని వస్తాయా ?

1. నాలుగేళ్లుగా ఎడతెరపి లేకుండా ఉక్రెయిన్ యుద్ధం .
వంట గాస్ ధర నాలుగు రెట్లయ్యింది . అనేక ప్రభుత్వాలు రెవిన్యూ ను ఆయుధాల తయారీకి .తగలేస్తూ .. విద్య వైద్యానికి కోతపెడుతున్నాయి .ఈ యుద్ధం వల్ల యూరోప్ లోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి
2. ఇరాన్ యుద్ధం . పెట్రోల్, డీజిల్ , విమాన రేట్లు విపరీతంగా పెరిగాయి . ఏ సరుకు రవాణా చెయ్యాలన్నా ఇంధనం అవసరం . దీంతో అన్ని వస్తువుల సేవల ధరలు భారీగా పెరిగిపోయాయి.
3. కృతిమ మేధ వల్ల ఉద్యోగాల కోతలు . అమెరికాలోనే ఇప్పటి దాక 2.6 లక్షల టెక్ ఉద్యోగాలు పోయాయి . 12,700 మంది టెక్ ఉద్యోగులు ఇండియాకు తిరిగి వచ్చేసారు . విదేశాల్లో స్థిరపడిన భారతీయుల ఆదాయం తగ్గడంతో మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి . ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి . దీనితో యువత లో నిర్వేదం .. ఆందోళన .
4. మత చాందసవాదం - టెర్రరిజం . కొరతలుంటే విద్వేషం మరింత పెరుగుతుంది . ఒక రకమయిన విద్వేషం మరో దానికి ఆలంబన అవుతుంది . ఇప్పుడు ప్రపంచం జపిస్తున్న మంత్రం .. ద్వేషం ద్వేషం ద్వేషం.
5. ట్రంప్ పొతే అమెరికా లో భారతీయులకు సమస్య పోతుంది అని కదా చాలా మంది అనుకొంది . భారతీయ అల్లుడు అమెరికాలో ఉన్న భారతీయుల్ని" బానిసలు" అన్నాడు . ఇప్పుడు సారీ చెప్పాడులే .
నేను గత కొన్ని నెలలుగా ఎన్నో సార్లు చెప్పాను ... . ట్రంప్ రోగం కాదు . రోగ సూచిక అని . కృతిమ మేధ - ఉద్యోగుల కొరత - వలస వచ్చిన వారి పై ద్వేషాన్ని పెంచడం .. ఇదీ అమెరికా లో జరుగుతున్నది . ట్రంపో .. కంపో .. సంపో .. ఇది ఆగదు . కాస్త హెచ్చుతగ్గులతో కొనసాగుతుంది .
6. కరోనా కాలంలో ప్రభుత్వాలు విపరీతంగా కరెన్సీ నోట్లను ముద్రించడం . ఉదాహరణకు అమెరికా 5 ట్రిలియన్ డాలర్స్ నోట్లను , ఇండియా 20 లక్షల కోట్లను ను అదనంగా ముద్రించింది . దీని వల్ల ద్రవ్యోల్భవణం . దీని వల్ల హైదరాబాద్ లో 2019 లో 35 లక్షలున్న డబల్ బెడ్ రరూమ్ ఫ్లాట్ .. 2026 కు 68 లక్షలయ్యింది . EMI పెరిగింది . వేతనాలు ఆ స్థాయిలో పెరగలేదు .
7. ప్రపంచ అప్పు . నేటి ప్రపంచం అప్పుల అప్పారావు . పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు . దీని వల్ల నవ తరం అనేక ఇక్కట్లను ఎదుర్కొంటోంది .
8. జనాభా క్షీణత .. పైన పేర్కొన్న పాయింట్స్ ఒక్కొకదాని పై నేను పోస్ట్ చేసినప్పుడల్లా కొంతమంది మహానుభావులు నా పై దాడి చేసారు . నాకు ఉద్దేశాలు ఆపాదించారు . అమెరికా లో జాబ్స్ తగ్గిపోతాయి .. అంటే దండయాత్ర .
కరోనా కాలంలో అన్ని రోజులు లాక్ డౌన్ అక్కరలేదు అంటే దండయాత్ర .
ఇక జనాభా క్షీణత పాయింట్ అయితే .. నా సామీ రంగా .. చెప్పనలవి కాదు .
ఫ్రాన్స్ లో జర్మనీ లో అలజడులకు ప్రధాన కారణం మత చాందసవాదం .. ఇదే కదా మీరు చదువు తోంది . ఈ పాయింట్ ను నేను కాదనడం లేదు .
కానీ ఇంత పెద్ద ఎత్తున ఫ్రాన్స్ నలభై ఏళ్ళ క్రితం అల్జీరియా మొరాక్కో లాంటి దేశాలనుండి... జర్మనీ సిరియా నుండి వలస లను ప్రోత్సహించడానికి ప్రధాన కారణం మానవతా వాదం కాదు గాడిద గుడ్డు కాదు .
వారికి వారి దేశంలో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం .
ఉదారవాదం మహా అయితే రెండో కారణం .
ఇక్కడ గ్రహించాల్సిన పాఠం ఏంటి ? "పెళ్ళొద్దు పెటాకులే ముద్దు ... పిల్లలొద్దు బతుకు డింకచకా కావాలి" అని ఎగిరి గంతులేస్తున్న నవతరానికి.. వారికి వంతపాడుతున్న అంకుల్స్ ఆంటీస్ కు జ్ఞానోదయం కావాలి . మీకు పెళ్ళొదు అనుకొంటే మంచిది .. మీ లైఫ్ మీ ఇష్టం . కానీ అదో ఫిలాసఫీ అయినట్టు డిజిటల్ కొండెక్కి ఆ చెత్త వాగుడు ఏందీ ? మిమ్మల్ని తగలెట్టా ! అజ్ఞానానికి అంతం లేదా ?
యువత పెడదారి పడితే బతుకు దక్షిణ కొరియా జపాన్ ఫ్రాన్స్ అవుతుంది .
9. ఎల్ నినో : వర్షాభావం .. నీటి కొరత , విద్యుత్ కొరత , ఆహార ధాన్యాల కొరత .
10. హోసింగ్ క్రైసిస్ . ఇది కూడా చెప్పా . అయ్యా జనాభా తగ్గిపోతోంది . రియల్ ఎస్టేట్ ఇక పై సిరులు కురిపించే కామధేనువు కాదు . ఎక్కడో ఒకటి రేండు చోట్ల మినహాయిపులు ఉంటాయి . మిగతా చోట్ల కేవలం నివాసానికి అయితేనే ఇల్లు కొనండి అని చెప్పా . హైదరాబాద్ లోనే అమ్ముడు పోని ఆవాసాలు లక్షల్లో అని ఇప్పుడు న్యూస్ . బ్లాక్ స్టోన్ అని ఒక పిచ్చి ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఉంది . ఇది ఎప్పుడో మునిగిపోవడం ఖాయం . డబ్బులు వున్నాయి కదా అని ఇండియా లో డొల్ల డొక్క స్కూల్స్ ను వేల కోట్లు పోసి కొనేస్తోంది . పెట్టిన పెట్టుబడి కి తగ్గ రాబడి లేదని ఇప్పుడు లబోదిబో అంటోంది . ఇప్పుడే ఏమయ్యింది ? జనాల ఆదాయాలు పడిపోతే .. "ఇలాంటి బడులు లగ్జరీ క్లబ్స్ .. పిల్లల్లో వ్యసనాలు పెరగడానికి ఇవే దోమల్లా వ్యవహరిస్తున్నాయి" అనే తత్త్వం పేరెంట్స్ కు బోధపడితే .. అప్పుడు తెలుస్తుంది .
ఇన్ ఫ్రంట్ మొసలి ఫెస్టివల్ .
ఈ నల్ల బండ సంస్థ అమెరికా లో 3, 00, 000 ఇల్లు కొని పడేసింది . పాపం అమెరికా నుండి వచ్చేయాలి అనుకొన్న భారతీయులు తమ ఇంటిని అమంలేక పోతున్న వైనం . నల్ల బండోడు మూడు లక్షల ఇళ్లను ఎవరికీ అమ్ముతాడు ?
10. డిజిటల్ పిచ్చి . మిగతా కారణాలు ఒక ఎత్తు . ఇది ఒకటే ఒక ఎత్తు .
యువకుల పిల్లల సంగతి పక్కన పెట్టండి .
నిన్న నేను పెట్టిన పోస్ట్ ల విషయానికి వద్దాము . ఫ్రాన్స్ లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లకు కారణం కేవలం మత చాందసవాదం . ఇదే కదా మీరు డిజిటల్ బడిలో నేర్చుకొన్న పాఠం ? అయ్యా .. ఇది ప్రధాన కారణం . కాదనడం లేదు . కానీ ఇంకా ఇదిగో ఇవన్నీ కారణాలు . వీటి నుంచి మనం పాఠాలు గ్రహించాలి అంటే నిన్న కామెంట్స్ రూపం లో నా పై అసహనం చూడండి .
ఇది పిచ్చి కాదా ?
సమస్యలనుండి దూరం గా పారిపోవడం కదా ?
ప్రభుతాల చేతిలోనే అన్నీ ఉన్నాయా ?
ఎంత సేపు రాజకీయ కోణం తప్ప ఇంకోటి పట్టదా ?
ఒంటి పైకి నలబై యాభై వచ్చినోళ్లే ఇలా ఉంటే ఇక యువత సంగతి ?
నాకు డాక్టరీ సీట్ రాలేదంటే .. సాఫ్ట్ వేర్ జాబ్ రాలేదంటే కారణం ప్రభుత్వం .. నాయకుడు అనుకోరా ?
ఇప్పుడే కాదు .. చరిత్ర చూస్తే కష్టాలు ఒకదాని వెంట వస్తాయి .
ఉదారణకు మొదటి ప్రపంచ యుద్ధం .. అదే సమయంలో స్పానిష్ ఫ్లూ .. ఆహారధాన్యాల కొరత .. కొంతకాలానికి ఆర్థిక మాంద్యం .. రెండో ప్రపంచ యుద్ధం . ఆ ఇక్కట్లు తట్టుకోలేక పోయినోళ్ళు వున్నారు .
మీరు నేను భూమి పై వున్నాము అంటే మన తాతముత్తాతలు వాటిని తట్టుకొని నిలపడ్డారు .
ప్రతి సంక్షోభం ఒక అవకాశం .
నేటి సంక్షోభం కూడా ఒక అవకాశం .
ఒక్క పోస్ట్ లో అయిపోదు .
తావీదులు లేవు .
అడ్డదారులు దొంగ దారులు లేవు .
చివరిగా ఒక మాట .. నాకు జెండాలు లేవు . అజెండాలు లేవు .
కోనేళ్ళ క్రితం ఒక యువకుడు" సార్ పీజీ పూర్తి అయ్యింది . ఇప్పుడు ఏమి చెయ్యమంటారు?" అని అడిగాడు .
సూచనలు ఇచ్చాను .
ఇప్పుడతను డాక్టర్ సుమన్ చిర్ర .విదేశం లో ఉన్నత ఉద్యోగం
నిన్న నా పోస్ట్ పై ఒక కామెంట్ చేసాడు .
దాన్ని చదవండి .
నేనేంటో అర్థమవుతుంది .
నేను ఆ పార్టీ కి లేదా ఇంకోదానికి అనుకూలం లేదా ప్రతి కూలం అనుకొనే వారు రాజకీయ ఉచ్చ గుంట లో దూకి చావండి
{ నా పోస్ట్ ల పై నిర్మాణాత్మక విమర్సలు చేసేవారికి ఇది వర్తించదు }

విజ్ఞానం నైపుణ్యాలు నేర్పాల్సిన వయస్సు లో చేతికి సెల్ ఫోన్ ! అందులో అరాచకాలు !

తగలెట్టేసెయ్యండి నిరంజన్ గారూ !

ప్రపంచాన్ని తగలెట్టేసెయ్యండి !

అన్నట్టు ఒకడు బాలమిత్ర అంటూ కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు ! మీకేమయినా కనిపించాడా ?

యూరప్ దగ్ధమవుతోంది – పారిస్ నుంచి మిలాన్, టిరానా వరకు

2005లో నేను మొదటిసారి పారిస్‌ను చూసినప్పుడు, అది ఒక కలల నగరంలా అనిపించింది. 2015లో రెండోసారి వెళ్లినప్పుడు, ఆ కలలో పగుళ్లు మొదలైనట్లు అనిపించింది. 2026 అక్టోబర్ నాటికి ఆ పగుళ్లు మిలాన్, టిరానా నగరాలకూ వ్యాపించాయి.

గత వారం రోజులుగా యూరప్‌లోని మూడు నగరాలు ఒకేసారి అట్టుడుకుతున్నాయి. వీడియోలు చూసినప్పుడు మూడు చోట్లా ఒకే రకమైన పరిస్థితి కనిపించినప్పటికీ, అక్కడి ఆందోళనలకు కారణాలు మాత్రం వేర్వేరు.

1. పారిస్ – ఫ్రాన్స్:

ఒక పాఠశాలలో మొదలైన సమస్యతో ఆందోళన ప్రారంభమైంది. “తరగతులు రద్దయ్యాయి, ఉపాధ్యాయులు రావడం లేదు” అంటూ హైస్కూల్ విద్యార్థులు నిరసనకు దిగారు. వారాల తరబడి కొనసాగిన ఈ నిరసన క్రమంగా జీవన వ్యయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనగా మారింది.

పారిస్‌లో నెలవారీ అద్దె €1,400 కాగా, కనీస వేతనం €1,766. అద్దె చెల్లించిన తర్వాత తినడానికి కూడా డబ్బులు మిగలవనే ఆగ్రహం ప్రజల్లో పెరిగింది. వారాంతానికి పరిస్థితి హింసాత్మకంగా మారింది. వందలాది మంది పోలీసులకు గాయాలయ్యాయి. దుకాణాలు ధ్వంసమయ్యాయి.

2. మిలాన్ – ఇటలీ:

అదే నిరసనల అల ఇటలీకి కూడా వ్యాపించింది. అక్టోబర్ 17–18 తేదీల్లో మిలాన్‌లో విద్యార్థి సంఘం OSA పిలుపుతో “Italia in Piazza”, “No Meloni Day” కార్యక్రమాలు నిర్వహించారు.

వారి నినాదం – “Caro Vita”, అంటే భరించలేనంతగా పెరిగిపోయిన జీవన వ్యయం.

వారి అంచనా ప్రకారం, ఇటలీ అంతటా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

నిరసన మొదట శాంతియుతంగా సాగినప్పటికీ, చివరకు ముసుగులు ధరించిన వందలాది మంది యువకులు డుయోమో స్క్వేర్, గల్లేరియా ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. దుకాణాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు. చెత్త కుండీలకు నిప్పు పెట్టారు. పోలీసులు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్‌ను ఉపయోగించారు.

ANSA వార్తా సంస్థ కథనం ప్రకారం, 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 80 శాతం మంది మైనర్లు. ఇటలీ పత్రికలు వీరిని “మరాంజా” అని పిలుస్తున్నాయి. ఈ పదం నగర శివారు ప్రాంతాలకు చెందిన వీధి యువతను సూచించడానికి ఉపయోగిస్తారు.

ప్రధానమంత్రి జార్జియా మెలోని అత్యవసర సమావేశానికి పిలుపునిస్తూ, “నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ నగరాలను తగలబెట్టే హక్కు లేదు” అనే సందేశాన్ని ఇచ్చారు.

పైన పేర్కొన్న రెండు దేశాల్లోని ఉద్యమాల్లో పాలస్తీనాకు మద్దతు తెలిపే తీవ్రవాదులు కూడా ఉన్నారనేది నిజమే! కానీ వారే మొత్తం ఉద్యమం కాదు! మొత్తం ఉద్యమాన్ని వారికే ఆపాదిస్తే, అది సమస్యను అతిసరళీకరించినట్లే అవుతుంది.

అల్బేనియా ముస్లింలు అధికంగా ఉన్న దేశం. అక్కడ కూడా అశాంతి నెలకొంది!

3. టిరానా – అల్బేనియా:

ఈ మూడు నగరాల్లో టిరానాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. అక్టోబర్ 13 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆందోళనలు కొనసాగాయి.

ఇక్కడ రెండు ప్రధాన అంశాలు కలిశాయి. మొదటిది – విద్యార్థుల ఆగ్రహం. అధిక ఫీజులు, నాణ్యత లేని విశ్వవిద్యాలయాలు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు దొరకకపోవడం వంటి సమస్యలు వారిని నిరసనకు దించాయి.

రెండోది – అవినీతిపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహం.

“ఫ్లెమింగో ఉద్యమం” అనే పర్యావరణ ఉద్యమం కొంతకాలంగా పోరాటం చేస్తోంది. అల్బేనియా దక్షిణ తీరంలో విలాసవంతమైన రిసార్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని విక్రయించిందని, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌కు సంబంధించిన ఒక ప్రాజెక్టు కూడా ఉందని ఆ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

వేలాది మంది విద్యార్థులు విద్యాశాఖ కార్యాలయం ముందు కూర్చుని “రామా రాజీనామా చేయాలి” అని నినాదాలు చేస్తున్నారు.

ఆ తర్వాత హింస చెలరేగింది. విద్యాశాఖ కార్యాలయం, హోం శాఖ కార్యాలయం, అధికార పార్టీ కార్యాలయం, ఒక పోలీస్ స్టేషన్, బ్యాంకులకు నిప్పు పెట్టారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనన్లను ఉపయోగించారు.

ఒక్క ఆదివారం రోజే 16 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వారం రోజుల వ్యవధిలో 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ, ప్రధానమంత్రి ఎడి రామా రాజీనామా చేయడానికి నిరాకరించారు.

ఈ మూడు ప్రాంతాల్లోనూ కనిపిస్తున్న ఉమ్మడి అంశం ఒక్కటే – భవిష్యత్తుపై యువతలో విశ్వాసం క్రమంగా తగ్గిపోతోంది.

2015లో యూరప్ ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు తన తలుపులు తెరిచినప్పుడు, చాలామంది దానిని కేవలం మానవత్వంతో తీసుకున్న నిర్ణయంగా భావించారు.

అందులో మానవత్వం ఉంది. కానీ దాని వెనుక ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయి. జర్మనీకి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది కార్మికులు అవసరం. లేకపోతే కర్మాగారాలు మూతపడే పరిస్థితి వస్తుంది.

వారిని తీసుకున్నారు. కానీ సమాజంలో కలిసిపోయేలా చేయలేదు. భాష నేర్పలేదు, నివసించడానికి ఇళ్లు కల్పించలేదు, వారి నైపుణ్యాలను గుర్తించలేదు. ఫలితంగా, ఒక తరం సమాజపు అంచుల్లోనే మిగిలిపోయింది.

అయితే, వలస వచ్చినవారు కూడా స్థానిక సమాజంతో కలవకుండా విడిగా ఉండిపోతున్న సందర్భాలు ఉన్నాయనేది కూడా నిజమే!

అల్లర్లు జరగడానికి ఒక్క కారణమే ఉండదు. ఆర్థిక అసమానతలు + ఇళ్ల కొరత + నిరుద్యోగం + ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం – ఇవన్నీ కలిసినప్పుడు, ఒక చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద మంటగా మారడానికి సరిపోతుంది.

సమస్యలు నిజమైనవే!

నిరుద్యోగం వాస్తవమే!

అసమానతలు కూడా నిజమైనవే!

టిక్‌టాక్ ప్రభావం కూడా వాస్తవమే!

యువతలో డిజిటల్ వ్యసనం, దాని వల్ల కలిగే సమస్యలు కూడా నిజమైనవే. నేర్చుకునే విధానంలో మార్పులు, చాలామందిలో సహనం మరియు ఏకాగ్రత తగ్గిపోవడం, కోపం, అసహనం, తిరుగుబాటు ధోరణి – ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలే!

విజ్ఞాన నైపుణ్యాలు నేర్పించాల్సిన వయసులో పిల్లల చేతుల్లో సెల్‌ఫోన్లు పెడుతున్నాం! ఆ తర్వాత క్రమశిక్షణ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి!

నిరంజన్ గారూ, కాల్చేయండి!

ఒక వ్యక్తి బాలమిత్ర పేరుతో ఊరంతా తిరుగుతున్నాడు. మీరు ఏమైనా గమనించారా?

తగలపడి పోతున్న భూతల స్వర్గం - గుణపాఠాలు !

దీపాల నగరం ! ప్రేమ నగరం ! శృంగార నగరం ! ఫాషన్ రాజధాని !

ఇవీ పారిస్ నగరానికి ఉన్న పేర్లు !

ఫ్రాన్స్ రాజధాని పారిస్ .

తొలి సారి ఈ నగరాన్ని నేను 2005 లో సందర్శించాను .

సినిమాల్లో/ కలల్లో మనం చూసే ఒక అందమయిన నగరం కళ్ళముందు నిలిచింది .

ఎన్నో ప్రత్యేకతలు .

ప్రతి వీధి ఒక ఫాషన్ స్టేట్మెంట్ లా ఉంటుంది .

ఈఫిల్ టవర్ వద్ద అయితే ప్రేమ జంటలు .. అప్పటిదాకా ఇంగ్లీష్ సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలు అక్కడ కనిపించాయి . యువ జంటల చేష్టలు చూసి నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందా? అనుకొన్నాను . బయట ప్రపంచం అప్పుడప్పుడే పరిచయం అవుతున్న వేళ అది ..

ఇంట్లో బెడ్ రూమ్ లో చేసుకొంటే ఏమి గొప్ప ? ఈఫిల్ టవర్ పైన చేసుకొంటే నే గొప్ప .. అదీ ఆ జంటల మానసిక స్థితి

ఈఫిల్ టవర్ కు దగ్గర్లో మూడు వీధులు .

అవెన్యూ మంటైగ్నే , చాంప్స్ ఎలీసీస్ .

ఖరీదయిన దుకాణాలు . ప్రపంచంలో కెల్లా ఖరీదయిన రిటైల్ షాప్స్ ఇక్కడే .

అక్కడ చదరపు అడుగుకు సంవత్సరానికి అద్దె ఇరవై లక్షలు .

హీర్మేస్ షాప్ .

అక్కడ అమ్మే కొన్ని వస్తువులు ..

బిర్కిన్ హ్యాండ్ బాగ్ - మొసలి చర్మం తో చేసింది . ఒక్కో బాగ్ ఖరీదు .. తక్కువంటే పది లక్షలు . గరిష్టంగా యాభై లక్షలు . బుక్ చేసుకున్నాక రెండేళ్లకు డెలివరీ చేస్తారు .

కెల్లీ బాగ్ - 25 లక్షలు .

కండువా { స్కార్ఫ్ } 70,000 { మహానుభావులు గోచీని వదిలేసారు }

బెల్ట్ - లక్ష రూపాయిలు

శాండల్ / చెప్పులు - 60,000 .

లూయిస్ బిట్టొన్ షాప్ .ఛానల్ షాప్, డియోర్ అండ్ గుసిసి షాప్ ..ఇక్కడ కూడా ధరలు హీర్మేస్ షాప్ లాగే చీప్ గా యమా చీప్ గా ఉంటాయి

మీకు అర్థం కావడానికి ..

హీర్మేస్ బిర్కిన్ బాగ్ ధర 20 లక్షలు అనుకొంటే .. అది ఒక ఫ్రెంచ్ వర్కర్ 18 నెలల జీతం . మన దేశంలో ప్రభుత్వ టీచర్ నాలుగేళ్ళ జీతం . చందానగర్ లో రెండు బెడ్ రూమ్స్ ఫ్లాట్ ఏడేళ్ల అద్దె .

ఇంతేసి ధరలు వున్నాయి అంటే వాటి నాణ్యత కూడా అంతే ఉంటుంది అనుకొంటున్నారా ?

చైనా లో అనేక చోట్ల ... ఈ స్విస్ వాచెస్ కు ఖరీదయిన బాగ్స్ కు డూప్లికేట్ తయారు చేస్తారు . అసలు బ్రాండ్ వస్తువును, దాని నకిలీ ని మీ ముందు ఉంచుతారు . ఏదో అసలుదో కనిపెడితే దాన్ని మీకు ఉచితంగా ఇచ్చేస్తారు .

నకిలీ దాని ధర వెయ్యి లేదా అయిదు వేలు . బ్రాండెడ్ దాని ధర లక్షల్లో .

అంత ఖరీదు ఎందుకు పెట్టి కొంటారు ?

అదో గుల .. అదో తుత్తి .

అడ్డ దారుల్లో ... కొంతమంది సరైన దారుల్లో అపార సంపద పోగేస్తారు .

వారు కొనేది బాగ్ నో వాచ్ నో కాదు . స్టేటస్ ను.

అవునండీ వారు లక్షలు పోసి కొనేది స్టేటస్ ను .

అదో అంతులేని... అంతుచిక్కని ఆరాటం .. స్టేటస్ పోరాటం

ఆయన ఒక నటుడు .. వీవీఐపీ లను పార్టీ కి పిలిచాడు . ఏదో మామూలు విస్కీ పోస్తే ఎలా ?

యాభై ఏళ్ళ గ్లేన్ఫిడ్డిచ్ విస్కీ .. ఖరీదు చీప్ .. డెడ్ చీప్ .. ఒక లీటర్ బాటిల్ జస్ట్ 25 లక్షలు మాత్రమే .

అయన కట్టుకొన్న రాయల్ ఓక్ వాచ్ ఖరీదు జస్ట్ 80 లక్షలు మాత్రమే .

మరి గెస్ట్ లను ఇంప్రెస్స్ చెయ్యాలి . కాంట్రాక్టు పట్టాలి .. లేదా లోన్ కొట్టాలి . లేదా రాజ్య సభ పదవి పట్టాలి . బ్లెండర్స్ ప్రైడ్ పోస్తాను... అంటే ఎలా ?

రిచర్డ్ మిల్లి అనే ఇంకో వాచ్ ధర కేవలం 12 కోట్లు మాత్రమే .

డబ్బుంటే చాలు .. నేరుగా ఈ షాప్స్ కు వెళ్లి కొనేసుకోవచ్చు అనుకొంటున్నారా ?

ఆశ... దోస... స్విస్ వాచ్... ఇటలీ హ్యాండ్ బాగ్... { ఇటలీ హ్యాండ్ బాగ్ అంటే ఇటలీ లో చేసింది అనుకునేరు . ఇది తయారయ్యింది చైనా లో. ధర వంద డాలర్స్ . ఇటలీ లో దీనికి ఒక టాగ్ ఆడ్ చేసి లక్ష డాలర్స్ కు అమ్ముతారు . కొనేవాళ్లకు అమ్మే వాళ్లకు ఇది తెలుసు .. చెప్పాగా అదో గుల . స్టేటస్ గుల .

ఆ షాప్స్ లోకి సాధారణ ప్రజలకు ఎంట్రీ లేదు .

మీరు గతంలో ఎలాంటి బ్రాండెడ్ వస్తువులు కొన్నారో మీ పర్చేస్ హిస్టరీ చూస్తారు . నేను 2005 లో వెళ్ళినప్పుడు ఆ షాప్స్ ముందు వందలాది మంది క్యూ లో వున్నారు . సాయంకాలం దాక నిలపెడుతారట . విండో షాపింగ్ చేసేవారు అంత సేపు నిలబడరు గా . అంటే షాప్ లో ఎంటర్ అయ్యే ముందే నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి అన్న మాట . వీరు చేసేది కృతిమ కొరత సృష్టించి హైప్ చేయడం . చాలా వస్తువులకు డబ్బు పే చేసాక వెయిటింగ్ పీరియడ్ 2-3 ఏళ్ళు .

నేను రెండో సారి 2015 లో పారిస్ సందర్శించాను .
అప్పటికే అక్కడ ఏదో అశాంతి అలజడి నాకు కనిపించింది .

2026 కు ఇది ముదిరి పాకాన పడింది .

ఫ్రాన్స్ దేశం గురించి మీకు తెలుసా ?

మధ్యతరగతి విప్లవం వచ్చింది అక్కడే .

అందరూ సమానమే అనే భావనను ప్రపంచానికి పరిచయయం చేసిన 1789 విప్లవం పుట్టింది అక్కడే .

అలాంటి నగరం లో స్టేటస్ కోసం లైన్ లో నిలుచుని యాభై లక్షలు పోసి బాగ్ కొనే సంపన్నులు .... జీవితాంతం కష్టపడినా యాభై లక్షలు సంపాదించలేని అభాగ్యులు .

రెండూ ఒక చోట పొందికగా ఉంటాయా ?

తీవ్ర ఆర్థిక అసమానతలు . రెండో మూడో తరం వలస దారుల్లో తీవ్ర అసంతృప్తి .

. మూడు తరాలు గడిచినా ఇక్కడే పుట్టి పెరిగిన తమను సమానం గా చూడలేదని అల్జీరియన్ మూలాలు కలిగిన ఫ్రెంచ్ పౌరుల్లో అశాంతి , మామూలు పౌరులు భరించలేని అద్దెలు .. అద్దె భరించలేక నగరం శివార్లకు వెళ్లిపోయిన లక్షలాది మంది .

గుణపాఠం : సమాజం ఒక నౌక లాంటిది . నీతోటి ప్రయాణికుడు తన సీట్ కింద బొక్క పెడితే మునిగేది నువ్వు కూడా .

తీవ్ర ఆర్థిక అసమానతలు .. డబ్బున్న మా రాజుల సంపద ప్రదర్శన స్టేటస్ చాటింపు వారికే కాదు .. సమాజానికి కూడా మంచిది కాదు .

నీ చుట్టూ పక్కల వేలాది మంది పూట గడవక అల్లాడుతుంటే... నువ్వు తొక్కలో మొసలి చర్మం హ్యాండ్ బాగ్ అరకోటి పోసి కొని .. దాన్ని సోషల్ మీడియా లో ప్రదర్శించుకొంటే ఎలా సామీ ?

230 ఏళ్ళ క్రితం ఫ్రాన్స్ లో జరిగిన విప్లవం ప్రపంచ మానవాళి చరితను సమూలంగా మార్చేసింది .

ఇప్పుడు జరిగిన దొమ్మీ దహనాలు .. నయా సంపన్నుల స్టేటస్ చాటింపు ఆర్భాటానికి కొంతయినా బ్రేక్స్ వేస్తుందా ? ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగిత తీవ్రతను ప్రభుత్వాలు గుర్తిస్తాయా ?

ఒకప్పటి సంగతి వేరు !

డిజిటల్ మీడియా చలవ వల్ల పదో తరగతి ఫెయిల్ అయిన వాడు కూడా తాను అనంత్ అంబానీ లైఫ్ స్టైల్ మైంటైన్ చెయ్యాలి ..నాకేమి తక్కువ ? అనుకొంటాడు !

నడుస్తున్న చరిత్ర .

ఈ పోస్ట్ చదివాకా మీకు ఒక అనుమానం రావొచ్చు . పారిస్ లో జరిగిన దొమ్మీని నేను సమర్థిస్తున్నానా ?

కాదు . ఇదో హెచ్చరిక .

డబ్బు .. స్టేటస్ వైపు పరుగులు తీస్తున్న ప్రపంచానికి ఒక హెచ్చరిక .

ఆగండి .. ఆలోచించండి ..

విద్య , ఉపాధి లాంటి విషయాల్లో ఎన్నో మార్పులు తేవాలి .

లేకపోతె బ్రహ్మాండం బద్దలయ్యే ప్రమాదం !

ఈ ఉద్యమం లో ఎన్నో కోణాలు ! పాలెస్తీనా కు అనుకూలంగా ఉద్యమంచేసేవారు కొందరు ! ఆ మత కోణం గురుంచి అనేక మెసేజ్ లు వచ్చాయి ! పెద్దగా చర్చలోకి రాని కోణం ఇది !

ా ఉంది!</p>

మీ పిల్లలకు ఈ విలువైన జీవిత పాఠాలను దూరం చేయాలనుకుంటున్నారా?

ప్రియమైన తల్లిదండ్రులకు,

జూన్ మొదటి వారంలో, వాసిరెడ్డి అమర్‌నాథ్ గారు SLATE & Cognibot ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ శాఖలకు చెందిన ఉపాధ్యాయులు భారతీయ విద్యా భవన్, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరుకాగా, విజయవాడ మరియు గన్నవరం శాఖల ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.

ఈ ఓరియంటేషన్‌లో విద్య, జీవితం మరియు మారుతున్న ప్రపంచానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఆ కార్యక్రమంలో చర్చించిన అనేక అంశాలలో ఒకటి, ఈ రోజు మనం మీతో పంచుకుంటున్న ఆడియోకు ఆధారం.

ఈ విషయాలు మన పిల్లలకు ఎంతో ఉపయోగకరమని గుర్తించిన అమర్‌నాథ్ గారు, ఈ అంశాలను పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా, వారి జీవితాలకు అన్వయించుకునేలా సరళమైన భాషలో అందించాలని మా డీన్ శ్రీమతి అర్చన గారిని కోరారు.

ప్రస్తుతం మన పిల్లలు తమిళనాడులోని గొప్ప వారసత్వాన్ని, సంస్కృతిని తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. ఈ రోజు వారు చిదంబరం మీదుగా తంజావూరు నుంచి పుదుచ్చేరికి ప్రయాణిస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణాల సమయంలో పిల్లలు సాధారణంగా సినిమా పాటలు, ఉత్సాహభరితమైన పాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ ప్రయాణ సమయాన్ని జీవితానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించిన ఉపయోగకరమైన, ముఖ్యమైన, ఆలోచింపజేసే విషయాలను పిల్లలకు పరిచయం చేయడానికి ఉపయోగించుకోవచ్చని అమర్‌నాథ్ గారు భావించారు.

ఈ ఆలోచనతో, సర్ ప్రతిరోజూ పిల్లలు ప్రయాణించే సమయంలో ఆడియో క్లిప్‌లను పంచుకుంటున్నారు. వాటిలో కొన్ని ఆయన స్వయంగా తన గొంతుతో రికార్డ్ చేసినవి కాగా, మరికొన్ని AI వాయిస్‌ఓవర్ అప్లికేషన్ ద్వారా రూపొందించినవి.

పిల్లల ప్రయాణం కేవలం ఆనందదాయకంగా మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని అందించేదిగా కూడా ఉండాలన్నది సర్ ఉద్దేశం. తద్వారా పిల్లలు ప్రయాణ జ్ఞాపకాలతో పాటు విలువైన జీవిత పాఠాలను కూడా నేర్చుకుని తిరిగి రావాలి.

ఈ రోజు పంచుకుంటున్న కంటెంట్‌లో ఒకే నిరంతర ఆడియోగా కలిపిన ఏడు పరస్పర సంబంధిత భాగాలు ఉన్నాయి. అవి:

  1. మారుతున్న ప్రపంచం – ఎదుర్కోవాల్సిన సవాళ్లు
  2. సాఫ్ట్‌వేర్ రంగపు స్వర్ణయుగం – మారుతున్న కుటుంబ సంబంధాలు
  3. ప్రవాస జీవనం, హోదా గురించిన ఆందోళన – విజయవంతంగా కనిపించడానికి చెల్లించే మూల్యం
  4. డిజిటల్ ఉచ్చు
  5. సాంస్కృతిక మార్పులు – మారుతున్న అంచనాలు
  6. మాల్ సంస్కృతి, ఆడంబరపు వినియోగం – అప్పుల భారం
  7. మనం సృష్టించే భవిష్యత్తు

1.దక్షిణ కొరియాలో బాగా లాభాలు పొందాలనుకొని కొంతమంది యువత భారీగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టారు . ఇప్పుడు స్టాక్ మార్కెట్ 9% శాతం పడిపోవడంతో వారిలో కొంతమంది ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు .

"మనం బతకాలి .. ఆత్మ హత్యలు వద్దు " అని ఆ దేశాధ్యక్షుడు పిలుపునిచ్చాడు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు .

"ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం స్టాక్ మార్కెట్ జోలికి పోవద్దు . మ్యూచువల్ ఫండ్స్ కూడా వద్దు . బంగారం కొనండి "అని నేను రెండుళ్లుగా చెబుతున్నా .. గమనించగలరు .

2 . అధిక ధరలకు .. పడిపోతున్న ఆదాయాలకు వ్యతిరేకంగా యువత ... విద్యా సంస్థల పరిస్థితులు మెరుగు పరచాలని విద్యార్థులు ఫ్రాన్స్ దేశంలో ఉద్యమం నిర్వహిస్తున్నారు .

ఇది హింసాత్మకంగా మారింది .

కొంతమంది క్రిమినల్స్ ... అలాగే కొంతమంది తీవ్రవాదులు నిన్న భారీ ఎత్తున దుకాణాలు మొదలయిన వాటిని లూటీ చేసారు . కార్లు .. కొన్ని చారిత్రక భవనాలు తగలపెట్టేసారు .

యూరోప్ లో నిన్నటి తరం సోకులకోసం డబ్బు భారీగా ఖర్చుపెట్టింది . అప్పులు కూడా చేసింది .

నేటి యువతరం ఈ భారాన్ని మోస్తోంది .

దీనితో వారిలో అసంతృప్తి .

దీనికి తోడు డిజిటల్ యుగ ప్రభావం . ఆశలు, కోరికలు ఎక్కువ . వాటిని సొంతం చేసుకొనే తెలివి తేటలు ఓపిక తక్కువ . దేనితో యువత లో ప్రపంచ వ్యాపితంగా తిరుగుబాటు ధోరణి .

దీని వెనుక విదేశీ శక్తులు స్వార్థ పర శక్తులు లేవా ?

ఉంటాయి.

ఎందుకు ఉండవు ?

కానీ యువతరాన్ని దారిలో పెట్టకపోతే నష్టపోయేది సమాజమే . ప్రభుత్వాలే ..

యువతరం డిమాండ్స్ లో న్యాయమయిన వాటిని పరిష్కారించాలి .

డిజిటల్ అతికి బలై పోతున్న యువతను రక్షించాలి . సరైన దారి చూపాలి . మారిన పరిస్థితులకు అనుగుణంగా వారిలో స్కిల్స్ పెంచాలి .. ఉపాధి మార్గాలు చూపాలి .

యువతరం అంటే చెట్టు కొమ్మ పై భాగం .

అది బాగుంటేనే కొమ్మలు ఆకులు పూలు .

ఈ అంశాలతో పై నేను గత రెండేళ్లుగా అనేక పోస్లు పెట్టాను . అప్పటికి మన దేశంలో జెన్ జి / బొద్దింక ల ఉద్యమం లేదు .

ఇప్పుడది రాజకీయ రంగు పులుముకొంది . ఏమి మాట్లాడినా వీరో వారో తప్పు పడుతారు . నమస్కారం .

మనకి రాజకీయమే ముఖ్యం . అదే ... తిండి... నీరు... గాలి .

3." ఎల్ నినో పై పోస్ట్ పెట్టలేదా? అని కొంతమంది అడుగుతున్నారు . జూలై అనుకొంటా .. దీనిపై పోస్ట్ పెట్టా . నీటికి కరువు వస్తుంది . ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి . కొద్ది మొత్తం లో ధాన్యం కొని పెట్టుకోండి అని చెప్పా .

సమస్య ఎక్కడుంది అంటే చాల మంది నా టైం లైన్ పైకి చుట్టపు చూపుగానే వస్తారు . పోస్ట్ వైరల్ అయితేనే చూస్తారు . వీరు నా పోస్ట్ లు అధికం మిస్ అవుతారు . పైగా మెసెంజర్ లో కి వచ్చి దీనిపై పోస్ట్ పెట్టండి అని అడుగుతారు . "ఈ రోజు పొద్దునే పెట్టాను చూడలేదా?" అని నేను వారికి మెసెంజర్ లో సమాధానం ఇస్తాను .

"నేనేదో గొప్ప .. అన్ని చెప్పేస్తాను .. నా పోస్ట్ లు క్రమం తప్పకుండా ఫాలో కండి "అని నేను టాంటాం వెయ్యడం లేదు .

నాకు తెలిసిన విషయాలు పంచుకొంటాను . నలుగురికీ ఉపయోగపడితే సంతోషపడుతాను .

అక్ష రూపాయిల విలువ చేసే సమాచారం { నేను మా టీచర్స్ కు జూన్ లో రెండు రోజులు పాఠాలుగా చెప్పింది .. క్లుప్తంగా AI సాయం తో తయారు చేసి .. అంటే సమాచారం నాది .. వాయిస్ AI ది } "మన భవిత మన చేతిలో "అని మొన్న పోస్టితే పట్టుమని పది మంది కూడా చూడలేదు . ఈ కంటెంట్ ను ఎవడైనా కౌన్సిలింగ్ పేరుతొ 40 సెషన్స్ అని లక్ష వసూలు చేస్తే అప్పుడు సమ్మగా ఉంటుందేమో .

ఒక్కో సారి నాకు అనిపిస్తుంటుంది .. "అడగకుండానే ఉచితంగా ఇస్తే కొంతమందికి విలువ తెలియదు" .

ఇప్పుడు చూడండి . ఆ లింక్ ఇక్కడ పోస్ట్ చెయ్యండి అని అడుగుతారు . TIMELINE లో వెళ్లి చెక్ చేసుకొనే ఓపిక కూడా ఉండదు కొంతమందికి .

"అబ్బా నలభై ఆరు నిమషాలా ? సారం ఒక నిముషంలో చెప్పండి అని ఒకరు అడుగుతారు .

పిల్లల్ని కూర్చోపెట్టుకొని శ్రద్ధగా విని.. ఒక సారి కాదు .. రెండు మూడు సార్లు విని .. చర్చించాల్సిన విషయం అది .

అది విని అర్థం చేసుకొంటే మీ బిడ్డ జీవితం మేలిమి మలుపు తీసుకొంటుంది .

సెల్ఫ్ డబ్బా అనుకొనేవారికి ఒక ఎనో ప్యాకెట్ ! మీకు దగ్గరగా ఉన్న మెడికల్ షాప్ లో కొనుక్కోండి !

ప్రియమైన తల్లిదండ్రులకు!

ఇటీవల వార్తల్లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాము. పిల్లలకు ఇంటర్నెట్‌ను వినియోగించుకునే హక్కు ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాము.

ఇది మొదటి నుంచీ SLATERS అనుసరిస్తున్న వైఖరే. పిల్లలు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవడాన్ని మేము ఎప్పుడూ నిరోధించలేదు. వాస్తవానికి, మా SMAART ప్రోగ్రామ్ ద్వారా రోబోటిక్స్, AI, కోడింగ్, భవిష్యత్ సాంకేతిక అంశాల అభ్యాసం కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ కార్యక్రమం పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది.

అదే సమయంలో, హానికరమైన వెబ్‌సైట్లను పిల్లలు చూడకుండా నిరోధించడానికి తల్లిదండ్రుల నియంత్రణ (Parental Control), పిల్లల భద్రతా లాక్‌లు (Child Safety Locks) అవసరమని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది.

ఈ నేపథ్యంలో, తల్లిదండ్రులుగా మీకు మేము చాలాకాలంగా సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలను మరోసారి మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

1. పిల్లలకు మొబైల్ ఫోన్ ఎందుకు సురక్షితం కాదు? చైల్డ్ సేఫ్టీ లాక్ ఉన్నప్పటికీ!

మా అనుభవంలో, చైల్డ్ లాక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినప్పటికీ, కొంతమంది పిల్లలు వాటిని దాటవేసి ఇతర వెబ్‌సైట్లను చూడగలుగుతున్నారు. మొబైల్ స్క్రీన్ కూడా చిన్నదిగా ఉంటుంది.

  • A. పిల్లలు మొబైల్‌ను బాత్‌రూమ్‌లోకి, టెర్రస్‌పైకి తీసుకెళ్లవచ్చు. పుస్తకాల మధ్య దాచిపెట్టి చదువుతున్నట్లు నటించవచ్చు.

  • B. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా మొబైల్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

  • C. చిన్న స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కంటి చూపు, కూర్చునే భంగిమ, నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు.

అందువల్ల, పిల్లలు ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి వ్యక్తిగత మొబైల్ ఫోన్ లేదా వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం మంచిది కాదని మా సూచన.

2. ఇంట్లో మీ పిల్లలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనుకుంటే మా సూచన:

దయచేసి డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయండి. మొబైల్ ఫోన్ లేదా వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ను కాదు.

దీనికి సంబంధించి ఈ రెండు షరతులను తప్పనిసరిగా పాటించండి.

a) డెస్క్‌టాప్ ఎక్కడ ఏర్పాటు చేయాలి?

డెస్క్‌టాప్‌ను ప్రత్యేక గదిలో, బెడ్‌రూమ్‌లో లేదా తలుపులు వేసుకుని చదువుకునే గదిలో ఏర్పాటు చేయకూడదు.

దానిని ఇంటి మధ్య భాగంలో, డ్రాయింగ్ రూమ్‌లో లేదా కుటుంబ సభ్యులందరూ తరచుగా తిరిగే సాధారణ గదిలో ఏర్పాటు చేయాలి.

దీనివల్ల పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు సహజంగానే గమనించగలుగుతారు. పిల్లలను రహస్యంగా గమనిస్తున్నారనే భావన వారికి కలగకుండా పర్యవేక్షణ చేయవచ్చు.

b) భద్రతా లాక్ తప్పనిసరి.

డెస్క్‌టాప్‌ను సాధారణ గదిలో ఏర్పాటు చేసినప్పటికీ, దానిలో చైల్డ్ సేఫ్టీ లాక్ / పేరెంటల్ కంట్రోల్ ఫిల్టర్ తప్పనిసరిగా అమర్చాలి.

ఉదాహరణకు:

  • Google Family Link

  • Microsoft Family Safety

  • SafeSearch — ON చేయాలి

  • DNS Filter — 1.1.1.3

తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి.

మా ఆలోచన చాలా సులభం:

పాఠశాల = ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇంటర్నెట్ వినియోగం.

ఇల్లు = సాధారణ గదిలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇంటర్నెట్ వినియోగం.

మా అభిప్రాయం ప్రకారం, ఈ విధానమే సమర్థవంతంగా పనిచేస్తుంది.

కేవలం సాఫ్ట్‌వేర్ లాక్‌పై ఆధారపడటం సరిపోదు. పిల్లలు కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ నియంత్రణలను కూడా దాటవేయగలరు. అలాగే, భద్రతా లాక్ లేకుండా కేవలం పర్యవేక్షణపైనే ఆధారపడటం కూడా సరిపోదు.

కాబట్టి, ఈ మూడు అంశాలు తప్పనిసరిగా ఉండాలి:

డెస్క్‌టాప్‌ను సాధారణ గదిలో ఏర్పాటు చేయడం + భద్రతా లాక్ + తల్లిదండ్రుల పర్యవేక్షణ.

3. మా నిబద్ధత:

సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా, ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు డిజిటల్ భద్రతపై అవగాహన (Digital Safety Education) కల్పించడం కొనసాగిస్తాము.

ఇందులో భాగంగా పిల్లలకు ఈ అంశాలను బోధిస్తాము:

  • సురక్షిత స్పర్శ (Safe Touch) గురించి అవగాహన.

  • ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి?

  • హానికరమైన కంటెంట్‌ను ఎలా గుర్తించాలి?

  • ఏదైనా ప్రమాదకరమైన విషయం ఎదురైతే ఎవరికి తెలియజేయాలి?

మీ ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు భద్రతా ఫిల్టర్లను ఏర్పాటు చేయడంలో సహాయం అవసరమైతే, మా కంప్యూటర్ ఫ్యాకల్టీ మీకు సహాయం చేస్తారు.

మా వైఖరిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

మేము సాంకేతికతకు వ్యతిరేకం కాదు. మా ఉద్దేశం ఒక్కటే:

సరైన సాంకేతికతను, సరైన ప్రదేశంలో, సరైన పర్యవేక్షణతో ఉపయోగించడం.

ధన్యవాదాలు!

మీ SLATE కుటుంబం

వామ్మో ! ఇన్ని నష్టాలా ?


@ గ్రాండ్ సరీనా పాండిచ్చేరి.

@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
@ Grand Sareena Pondicherry.
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir
You are really great and real hero sir

మీ బిడ్డకు ఈ విలువైన జీవిత పాఠాలు అందకుండా చేయాలనుకుంటున్నారా?

ప్రియమైన తల్లిదండ్రులకు,

జూన్ మొదటి వారంలో వాసిరెడ్డి అమర్నాథ్ సర్ ఉపాధ్యాయులందరికీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని విభాగాల ఉపాధ్యాయులు హైదరాబాద్ భారతీయ విద్యాభవన్‌లో జరిగిన సమావేశాలకు హాజరుకాగా, విజయవాడ మరియు గన్నవరం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.

ఈ ఓరియంటేషన్‌లో విద్య, జీవితం, మారుతున్న ప్రపంచానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఆ కార్యక్రమంలో చర్చించిన అనేక అంశాలలో ఒక ముఖ్యమైన అంశం ఆధారంగా ఈ రోజు మీతో పంచుకుంటున్న ఆడియో రూపొందించబడింది.

ఈ విషయాలు మన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించిన అమర్నాథ్ సర్, పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా, తమ జీవితాలకు అన్వయించుకునేలా ఈ విషయాలను సరళీకరించి అందించాలని మా డీన్ శ్రీమతి అర్చన గారిని కోరారు.

ప్రస్తుతం మన పిల్లలు తమిళనాడులో పర్యటిస్తూ అక్కడి గొప్ప వారసత్వాన్ని, సంస్కృతిని తెలుసుకుంటున్నారు. ఈ రోజు వారు చిదంబరం మీదుగా తంజావూరు నుంచి పుదుచ్చేరికి ప్రయాణిస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణాల్లో పిల్లలు సాధారణంగా సినిమా పాటలు, ఉత్సాహభరితమైన పాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ ప్రయాణ సమయాన్ని జీవితానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించిన ఉపయోగకరమైన, ముఖ్యమైన, ఆలోచింపజేసే పాఠాలను అందించడానికి మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని అమర్నాథ్ సర్ భావించారు.

ఈ ఆలోచనతో, సర్ ప్రతిరోజూ ప్రయాణ సమయంలో పిల్లలకు ఆడియో క్లిప్‌లను వినిపిస్తున్నారు. వాటిలో కొన్ని ఆయన స్వయంగా తన గొంతుతో రికార్డ్ చేసినవి కాగా, మరికొన్ని AI వాయిస్ ఓవర్ అప్లికేషన్ ద్వారా రూపొందించినవి.

పిల్లల ప్రయాణం కేవలం ఆనందదాయకంగా మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని అందించేదిగా కూడా ఉండాలన్నది సర్ ఉద్దేశం. తద్వారా పిల్లలు ప్రయాణ జ్ఞాపకాలతో పాటు జీవితానికి ఉపయోగపడే విలువైన అవగాహనను కూడా పొందగలుగుతారు.

ఈ రోజు పంచుకుంటున్న ఆడియోలో ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఏడు అంశాలను కలిపి, ఒక నిరంతర ఆడియోగా రూపొందించారు. అవి:

  1. మారుతున్న ప్రపంచం – ముందున్న సవాళ్లు

  2. సాఫ్ట్‌వేర్ రంగ స్వర్ణయుగం – మారుతున్న కుటుంబ సంబంధాలు

  3. విదేశాల్లో స్థిరపడటం, హోదాపై ఆందోళన – విజయవంతంగా కనిపించడానికి చెల్లించే మూల్యం

  4. డిజిటల్ ఉచ్చు

  5. సాంస్కృతిక మార్పులు – మారుతున్న అంచనాలు

  6. మాల్ సంస్కృతి, ఆడంబర ప్రదర్శన, అప్పుల ఊబి

  7. మనమే సృష్టించుకునే భవిష్యత్తు

ఈ పర్యటనలో ఉన్న పిల్లలకు ఈ ముఖ్యమైన పాఠాలు ఉపయోగపడగలిగితే, ఇతర పిల్లలు, కుటుంబాలు కూడా ఈ జ్ఞానాన్ని పొందకుండా ఎందుకు ఉండాలి? అని అమర్నాథ్ సర్ భావించారు.

అందుకే, అర్థవంతమైన విద్య తరగతి గదులకే పరిమితం కాకుండా అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ పూర్తి ఆడియోను మీతో కూడా పంచుకుంటున్నాము.

పండుగలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించడానికి, తిరిగి కలుసుకోవడానికి, మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ప్రత్యేక సందర్భాలని మాకు తెలుసు.

అదే సమయంలో, అవి కలిసి నేర్చుకోవడానికి, ఆలోచించడానికి, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి కూడా మంచి అవకాశాలని మేము విశ్వసిస్తున్నాము.

ఈ పండుగల సమయంలో కొంత సమయాన్ని కేటాయించి, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని, ఆడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

వినడంతోనే ఆగిపోకుండా, అందులోని విషయాల గురించి మీ పిల్లలతో చర్చించండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. ఆ పాఠాలను నిజ జీవిత పరిస్థితులకు ఎలా అన్వయించుకోవచ్చో వారికి వివరించండి.

ఈ పండుగల వేళ మన ఇళ్లలో ఆనందంతో పాటు, మన జీవితాల్లో జ్ఞానాన్ని కూడా నింపుకుందాం.

ఎందుకంటే విద్య అంటే కేవలం పిల్లలను పరీక్షలకు లేదా ఉద్యోగాలకు సిద్ధం చేయడం మాత్రమే కాదు. వారిని జీవితానికి సిద్ధం చేయడం కూడా.

మొత్తం స్లేట్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

సముద్ర తీరం !

కొండపై గుహ !
దేవాలయం !
బస్సు !
ఎక్కడికి పోయినా క్లాస్సే క్లాస్ !
అన్నట్టు టూర్ లో ఉన్న మా విద్యార్థుల కోసం AI సాయం తో తయారు చేసిన ఆడియో ( వారికి ధనుష్కోడి లో క్లాస్ తీసుకొన్నాను ! ఈ రోజు తంజావూరు నుంచి చిదంబరం పయనం లో అదే కంటెంట్ ను AI వాయిస్ తో వినిపిస్తాము !) కాసేపట్లో పోస్ట్ చేస్తాను ! ఇంటిల్లిపాదీ వినండి !
అమూల్యమయిన సమాచారం !
ఉచితంగా !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !
The beach of the sea !

అయినను పోయి రావాలె !

ఉదయం 8 కి బ్రేక్ఫాస్ట్
8.30 కి లగేజ్ బస్సు డిక్కీ లో పెట్టాలి
9 కి బస్సులు రామేశ్వరం నుంచి చెట్టినాడు గుండా తంజావూరు పయనం !
ఇదీ టూర్ షెడ్యూల్ !
అందరిలా నేనూ !
నా లగేజ్ ని కూడా నేనే మోస్తాను !
ఉదయం 4 కు లేచి అయిదు ఆడియో మెసేజి లు రికార్డు చేశా ! ( చోళుల చరిత్ర బృహదీశ్వర ఆలయం నిర్మాణం , చెట్టినాడు ఆహారం , చెట్టియార్ల చరిత్ర ఇలా మొత్తం గంట ! దీన్ని పిల్లలకు బస్సుల్లో వినిపిస్తాము !
ఉదయం 5.30
జిమ్ కు పోవాలి !
బయట బోరున వర్షం ! ఆ సమయం లో గొడుగు ఎలాగో దొరికింది
కానీ రోడ్ల పై వర్షం నీరు !
షూస్ మునిగితే ప్యాకింగ్ సమస్య !
గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని జిం వైపు జాగ్రత్తగా నడిచా ( 800 meters). జిమ్ ఓపెన్ కాలేదు
వెయిట్ చేశా !
లోనికి వెళితే మెషిన్ లు సరిగా లేవు !
అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు లొట్టి పీస గాడు ఎవడైనా చేస్తాడు !
ప్రతికూలతలు ఉన్నప్పుడు ముందుకు సాగేవాడే మొనగాడు !
అది జిమ్ అయినా ! ఇంకో పని అయినా !
వెన్ ది గోయింగ్ గెట్స్ టఫ్ , ది టఫ్ గెట్ గోయింగ్ !
జిం లో జిమ్ వ్యక్తి ఫోటో తీసాడు ! వర్కౌట్ అయ్యాక తిరిగీ హోటల్ కు వస్తుంటే వర్షం తగ్గింది ! రోడ్డు పై చెట్టుకింద వున్న ఎవరో వ్యక్తిని అడిగితే ఫోటో తీసాడు !
Even then you have to go and come back!
Even then you have to go and come back!
Even then you have to go and come back!

ధనుష్కోడి.

Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
Amarnath Vasireddy with children in Dhanushkodi.
The children are doing great and having a wonderful time, enjoying the sightseeing, delicious food, and, most importantly, the lovely moments spent with their friends

ప్రియమైన

తల్లిదండ్రులారా, శుభోదయం!

�� మేము అల్పాహారం పూర్తి చేసుకున్నాము. ఈరోజు రామేశ్వరం మరియు ధనుష్కోడిలోని అందమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నాము.

పిల్లలందరూ చాలా బాగున్నారు, ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. వారు పర్యాటక ప్రదేశాలను చూస్తూ, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ, ముఖ్యంగా తమ స్నేహితులతో కలిసి మధుర క్షణాలను గడుపుతున్నారు!

�� అందరూ సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు మరియు ఈ పర్యటనను బాగా ఆస్వాదిస్తున్నారు!

We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.
We have finished our breakfast and are all set to explore the beautiful and historic places of Rameshwaram and Dhanushkodi today.

క్లబ్ 19 ది జిమ్, మధురై

Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

తమిళనాట మదురై మీనాక్షి అమ్మన్ సన్నిధిలో తెలుగు నవ దంపతులు !

Kodaikanal - Dasara Yatra by Slate students!
ఎలక్ట్రిక్ వెహికల్స్ - అగ్ని ప్రమాదం
ఈ అంశం పై
నేను పెట్టిన పోస్ట్ గుర్తుందా ?
నా పోస్ట్ తరువాత
ఒక డాక్టర్ గారు
ఇప్పుడు విజయవాడ లో
నలుగురు సజీవ దహనం !
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

కొడైకెనాల్.

Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

బైసన్ ఫిట్‌నెస్ జిమ్కొడైకెనాల్.

Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

కొడైకెనాల్.

Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

కొడైకెనాల్.

Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!
Kodaikanal - Dasara Yatra by Slate students!

బట్టతల పై వెంట్రుకలు మొలుస్తాయా ?

స్లేట్ విద్యార్థుల దసరా యాత్ర !

తొలి రోజు

రంగనాథ స్వామి ఆలయం , శ్రీరంగం , తిరుచురాపల్లి , తమిళనాడు !

Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Dasara Yatra by Slate students! The first day, Ranganatha Swamy Temple, Srirangam, Tiruchurapalli, Tamil Nadu!
Amarnath Vasireddy
ఒక యువకుడు ... తండ్రి స్కూల్ టీచర్ .
కష్టపడి చదివి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించారు .
పెళ్లి ..
... అమెరికా లో పుట్టిన కొడుకు
తనకి భార్య పిల్లలు అంటే అమిత ప్రేమ .
కొడుకు ఇండియా లో పెరిగితే బాగా వృద్ధిలోకి వస్తాడని ఆరో తరగతిలోనే భార్యతో హైదరాబాద్ కు పంపారు .
ఫీజు ఎక్కువయినా ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించారు .
ఈ లోగా కరోనా వచ్చింది . వేలాది మంది లాగే ఈ అబ్బాయి కూడా సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయి చదువు పై నిర్లక్ష్యం చూపాడు . తల్లి పదే పదే చెప్పింది . లాభం లేదు
ఎనిమిదో తరగతిలోనే తక్కువ మార్కులు వస్తే మార్కులను దిద్ది ఎక్కువ మార్కులు వచ్చినట్లు తల్లితండ్రులను నమ్మించే ప్రయత్నం చేసాడు .
ఇంటర్ { ప్లస్ 2} ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు . తిరిగీ రాసినా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు .
కావాలనే ఫెయిల్ అయ్యాడు అని పేరెంట్స్ నమ్ముతున్నారు .
పాస్ అయితే ఇక్కడే డిగ్రీ చేయిస్తారు . ఫెయిల్ అయితే అమెరికా కు వెళ్లి పోవచ్చు అని ఆ యువకుడి ప్లాన్
నేషనల్ ఓపెన్ స్కూల్ కు ఇప్పుడు ఎన్రోల్ చేసుకొన్నాడు .ఏ మాత్రం భాద్యత లేకుండా ఉన్నాడు . అమెరికా కు వెళ్ళిపోతాను అంటున్నాడు .. అని తండ్రి నిన్న నా దగ్గరకు తీసుకొనివచ్చారు .
గంట పది నిముషాలు నేను మాట్లాడను . కౌన్సిలింగ్ ఇచ్చాను .
ఇండియా అంటే నాకు అసహ్యం అంటాడు . "అయ్యా మీ తాత బడిపంతులు .. మీ నాయిన కూడా నీ లాగే చదివి పది లేదా ఇంటర్ తప్పి ఉంటే ఎక్కడో చిన్న ప్రైవేట్ జాబ్ లో ఉండుంటే .. నీ అమెరికా నీకు సొంతమయ్యి ఉండేది కాదు . అమెరికా పౌరుడు అయ్యవంటే అది మీ నాన్న చలువ . అమెరికా కూడా ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు . పౌరుడు కాబట్టి ఏదో జాబ్ సాధించవచ్చు .. నిజమే .. కానీ అది అంత ఈజీ కాదు అని చెప్పా .
"నాకు మా అమ్మ అంటే నచ్చదు . ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనే మాటను పదేపదే చెబుతుంది .. విని విని నాకు విసుగొచ్చింది . ఆమె సణుగుడు వల్లే నాకు చదువంటే అసహ్యం ఏర్పడింది" అన్నాడు .
" తల్లి ప్రేమ స్వామి . భారతీయ తల్లితండ్రుల బలహీనత లేదా గొప్పతనం ఏమిటంటే వారు తమకంటే తమ పిల్లలను ఎక్కువ ప్రేమిస్తారు . తమ కంటే తమ పిల్లల భవిత గురించి ఎక్కువ ఆలోచిస్తారు . ఇప్పుడు చూడు మీ నాన్న .. నా అప్పాయింట్మెంట్ తీసుకొని ఇంత దూరం తీసుకొని వచ్చారు అంటే కారణం నీ పై ప్రేమ . నిన్ను సరైన దారిలో పెట్టాలని ఆలోచన " అంటే వినడు .
మనం మాట్లాడుతుంటే నిమషానికి రెండు సార్లు ఉఫ్ ఉఫ్ అంటాడు . అంటే ఈ సోది నాకెందుకు అని చెప్పడం . బాడీ లాంగ్వేజ్ తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తుంది .
"తల్లి తండ్రి చేసేది ప్రతి ఒక్కటీ తప్పని నేను చెప్పను . కానీ వారి ఉద్దేశాన్ని తప్పుపట్టొద్దు . వారి బెంగ నీ కోసమే .. నువ్వు చదివి మంచి దారిలో నడిస్తే వారికి టెన్షన్ ఉండదు కదా అంటే .. "బుల్ షిట్" అంటాడు . నన్ను అమెరికా నుంచి తీసుకొని రావడం మొదటి తప్పు అంటాడు .
"అంతేలే .. అమెరికా అయితే ఒక్క ఫోన్ కొడితే పోలీస్ వచ్చి అమ్మ నాన్న ను అర్రేస్ చేసివుంటారు" అన్నా .
జరిగింది ఏదో జరిగి పోయింది . ఇప్పుడు చెప్పు అమెరికా కు వెళ్లి ఎలా బతుకుతావు" అంటే "కాలేజీ లో చేరుతా" అంటాడు . "నువ్వు చదువుతావు అని నమ్మకం కలిగితే కళ్ళకు అద్దుకొని నిన్ను అమెరికా కు పంపుతారు కదా ?" .. అంటే లేదు "మా అమ్మ డిగ్రీ ఇక్కడే చదవమంటుంది "అంటాడు .
"నేను చెబుతా . నీకు అమెరికా టికెట్ కొనిస్తారు . నీ ఆలోచనలు అమెరికా . ఇండియన్ పేరెంట్స్ ఆటిట్యూడ్ అంటే నీకు అసహ్యం కదా . అమెరికా లో వెళ్లి నీ బతుకు నువ్వు బతుకు" అంటే కాదు .. కాలేజీ లో చేర్పించి ఫీజు కట్టాలి అంటాడు .
అంటే తాను హక్కుల విషయం లో అమెరికా . తన ధోరణి లో సాగాలి . పేరెంట్స్ ఎమీ చెప్పకూడదు . కానీ వారి డబ్బు మాత్రం కావాలి .
నేను అప్పుడు తండ్రికి చెప్పినా మాటలు . "సార్ నేను ఎంతో మందిని మార్చా . మీ అబ్బాయి విషయం లో నూటికి నూరు శాతం ఫెయిల్ . గంట తరువాత కూడా అతని ఆలోచనలో ఇసుమంతైనా మార్పు రాలేదు . అతనికి మీ కష్టం వల్ల అమెరికా పౌరసత్వం వచ్చింది . సుఖాలు వచ్చాయి . అతనికి మీ డబ్బు , సంపద కావాలి . ఇప్పుడు అమెరికా కు వెళ్లి ఏదో డొల్ల డొక్కా కాలేజీ లో సీట్ సంపాదించి మీ డబ్బు తో మరో నాలుగేళ్లు జల్సా చేస్తాడు . సెల్ ఫోన్ వల్ల ఇప్పటికే ఎన్నో వ్యసనాలు వచ్చివుంటాయి . అమెరికా కు వెళ్లి అక్కడ గాంజా కూడా మరిగాడంటే ఇక జీవితం క్రైమ్ బాటే . మీ కష్టం, మీ ప్రతిభ , మీ ప్రేమ ... ఇప్పుడు మీకు కష్టాలు తెచ్చాయి సార్ . తమ సంపాదనే తమకు కష్టాలకు మూలం కావడం ఇప్పుడు అమెరికా లో ఇండియా సాధారణం అయిపొయింది . సుఖాల్లో పెరిగి జల్సాలు మరిగిన యువత కనీసం పేరేంట్స్ ప్రేమ ను అర్థం చేసుకోలేని స్థితి . నేనేమీ చేయలేను . క్షమించండి . మీ సమస్యకు పరిష్కారం కనుచూపు మేర లో కనబడడం లేదు . మీరు సగటు అమెరికన్ తండ్రిలా ఆలోచించండి . అతనికి 18 . మైనారిటీ తీరింది . తనని తన దారికి వదిలేయండి . మనసు కుదుట పరుచుకోండి . మీ లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించండి ."అని చెప్పా .
ఎన్నో ఏళ్లుగా అమెరికా లో ఉన్నా ఇంకా సగటు ఇండియన్ తండ్రి బలహీనత . కొడుకు చెడు దారిలో ఉన్నా ప్రేమ ను చంపుకోలేడు . "
ముఖ్య గమనిక .
ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో .. మన ప్రేమ మన సంపద మనకే ఎలా సమస్యల్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఇక్కడ నేను పోస్ట్ పెట్టాను . పేరు వివరాలు ఇవ్వలేదు .. ఇవ్వను . వ్యక్తిగత గోప్యత ముఖ్యం .
తండ్రి గారు మీ లాగే నా పోస్ట్స్ ఫాలో అవుతారు .
ఈ పోస్ట్ దానితో పాటు మీరు పెట్టె కామెంట్స్ కూడా చదువుతారు . మనసు గాయపడేలా కామెంట్స్ చెయ్యొద్దు . వీలుంటే మంచి సలహా ఇవ్వండి .
అయన సమస్య ను పరిష్కారించలేక పోయాను . ఇప్పుడు మనస్సు గాయపడకూడదు . మనసుకు ఊరట .. స్వాంతన కలిగేలా మీ కామెంట్స్ ఉండాలి .
ఈ ప్రపంచంలో అయన ఒక్కడే కాదు . ఇది నేడు వేలాది తల్లితండ్రుల వ్యధ .
మొన్న ఒక ఘటన . ఖర్మన్ఘాట్ ప్రాంతంలో కొత్తగా వెలిసిన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి అమ్మాయి . "ఇంటర్ ఫస్ట్ ఇయర్ కుర్రాడిని ప్రేమిస్తున్నాను . ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ" ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది .
పెళ్లి చేస్తే పేరెంట్స్ మైనారిటీ తీరని పిలల్లకు పెళ్లి చేసిన నేరస్తులు .
చేయకపోతే కూతురు బతకదు .
ముందు నుయ్యి .
వెనుక గొయ్యి .
మధ్యలో గబ్బు బుద్ధులున్నా పట్టించుకోని ఇంటర్నేషనల్ స్కూల్స్ .
నిర్వేదం . అశక్తత . ఆవేదన .

హలో పేరెంట్స్ మరియు టీచర్స్!

ఇది SLATE, THE SCHOOL గురించి నా నిజమైన ఫీడ్‌బ్యాక్ మరియు అభినందన.
కోవిడ్ రోజుల్లో నాకు ఉద్యోగం లేదు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నిరంతరం స్క్రోల్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే నాకు మొదటిసారిగా అమర్నాథ్ సర్ గురించి తెలిసింది. ఆరోగ్య సమాచారానికి సంబంధించిన మొట్టమొదటి పోస్ట్ చదివాను, అది నన్ను చాలా ఆకట్టుకుంది. తర్వాత పేజీ ఓపెన్ చేసి కొన్ని పోస్టులు చూశాను, అప్పుడే అమర్నాథ్ సర్ యొక్క ఆలోచనా విధానం గురించి తెలుసుకున్నాను.
మెసేజ్‌లు, పోస్టులు చాలా ఇంప్రెసివ్‌గా, నాలెడ్జ్‌తో నిండి ఉండేవి. ఫేస్‌బుక్ పోస్టుల్లో ఇచ్చిన చాలా పోస్టులు, టిప్స్‌ను నేను అక్షరాలా ఫాలో అయ్యాను. తర్వాత నెమ్మదిగా ప్రతిరోజూ న్యూస్ పేపర్ లాగా సర్ పోస్టులు చదవడం నాకు అలవాటుగా మారిపోయింది.
చివరికి నాకు SLATE స్కూల్ గురించి తెలిసింది. ఇక్కడ ఉపయోగించే ఫిలాసఫీ, మెథడాలజీ అద్భుతంగా, అసాధారణంగా ఉన్నాయి.
అమర్నాథ్ సర్ రాసిన ఒక పోస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది, "మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన", అంటే మనుషులు ఎక్కువైతే ఎఫెక్టివ్‌నెస్, ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుందని. ఇది నన్ను నిజంగా ఆకట్టుకుంది, మరియు వారు కేవలం విద్యను మాత్రమే కాకుండా, అందించే విద్యలో నాణ్యతను కూడా నిర్ధారిస్తామని సర్ స్పష్టంగా చెప్పారు. అప్పుడే నా పిల్లలను SLATE లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. మా పిల్లలను SLATE లో చేర్పించడం కోసమే మేము దిల్‌సుఖ్‌నగర్ నుండి కర్మన్‌ఘాట్ కు షిఫ్ట్ అయ్యాము.
నా పిల్లలను THE SLATE లో చేర్పించినప్పుడు నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నా పిల్లల ఎదుగుదలను పెంపొందించే నాణ్యమైన, నమ్మకమైన విద్యా సంస్థ దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ��
THE SLATE కేవలం ఒక స్కూల్ మాత్రమే కాదు, మన 90s తల్లిదండ్రులమైన మనం పొందిన బాల్యాన్ని, అదే విధంగా సరైన విలువలు, క్రమశిక్షణ, జ్ఞానం, ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కొనే ఎక్స్‌పోజర్‌ను మీ పిల్లలు అనుభవించే ప్రదేశం కూడా.
ధన్యవాదాలతో,
G. రుషికేష్
తండ్రి
G. శివాంశిక - 2A
AI ద్వారా తెలుగు అనువాదం
తల్లిదండ్రుల ద్వారా ఆంగ్ల అనువాదం ����
_హలో అందరికీ, ����‍♂️_
_నమస్కారం!_
నేను మొదటిసారిగా _అమర్నాథ్ సర్_ గురించి 2020లో కోవిడ్ సమయంలో ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్నాను. అప్పటి నుండి సర్ ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టులను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నాను. విద్య మరియు జీవితంపై సర్ యొక్క ఆలోచనలు, దృక్పథాల నుండి మేము నిజంగా ప్రేరణ పొందాము.
తర్వాత మాకు _స్లేట్ - ది స్కూల్_ గురించి తెలిసింది. మా పిల్లలను స్లేట్ లో చేర్పించాలని మేము సీరియస్ గా ఆలోచించాము, కానీ దురదృష్టవశాత్తు అప్పట్లో మా ఏరియాలో బ్రాంచ్ లేదు. అందుకే మేము సర్ యాక్టివిటీస్ ను ఫాలో అవుతూ, _బాలమిత్ర సెషన్స్_ కు క్రమం తప్పకుండా హాజరయ్యేవాళ్ళం.
అదృష్టవశాత్తు, గత సంవత్సరం నాకు శంషాబాద్ ఏరియాకు మారే అవకాశం వచ్చింది. మా పిల్లల కోసం మంచి స్కూల్ వెతుకుతున్నప్పుడు, నేను కర్మన్‌ఘాట్ ఏరియాను ఎంచుకున్నాను, తద్వారా మా పిల్లలను _స్లేట్ - ది స్కూల్, కర్మన్‌ఘాట్ బ్రాంచ్_ లో చేర్పించగలిగాను.
ఈ రోజుల్లో చాలా స్కూళ్లు ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు చాలా వరకు డబ్బు, ఫ్యాషన్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆకర్షణీయమైన భవనాలు, పెద్ద ప్లేగ్రౌండ్‌లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు కూడా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్టైలిష్ భవనాలు, పెద్ద గ్రౌండ్స్ చూసి ఆకర్షితులవుతున్నారు.
అయితే, అత్యంత ముఖ్యమైనది _నాణ్యమైన విద్య మరియు పిల్లల సమగ్ర అభివృద్ధి_. చాలా స్కూళ్లలో విద్య అంటే కేవలం పాఠ్యపుస్తక పాఠాలను వివరించడం, డిజిటల్ బోర్డులపై కంటెంట్ చూపించడం, పరీక్షల ముందు ప్రశ్నలు-జవాబులు ఇచ్చి మార్కులు తెప్పించడం వరకే పరిమితం అవుతోంది.
కానీ _స్లేట్ కరిక్యులం పూర్తిగా భిన్నమైనది_. స్కూల్‌కు సొంత లెర్నింగ్ మెటీరియల్స్ ఉన్నాయి మరియు _త్రయోధ C, సంపూర్ణత, సంగం_ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది.
నాకు ప్రత్యేకంగా నచ్చిన కొన్ని విషయాలు:
1. _క్లాస్‌కు ముందు ప్రీ-రీడింగ్:_ పాఠం క్లాస్‌లో చెప్పే ముందే పిల్లలను చాప్టర్ చదవమని ప్రోత్సహిస్తారు. ఇది నేర్చుకోవడంపై ఆసక్తి, ఉత్సాహం, క్యూరియాసిటీని పెంచుతుంది.
2. _ఇంట్లో చదవడం, రివిజన్, ప్రాక్టీస్:_ క్లాస్ తర్వాత పిల్లలను ఇంట్లో చదవడం, రివిజన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం అలవాటు చేస్తారు. దీనివల్ల వారు కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.
3. _రెడీమేడ్ Q&A లేదు:_ పిల్లలు రెడీమేడ్ సమాధానాలు బట్టీ పట్టకుండా, తమ సొంత మాటల్లో పరీక్షలు రాయమని ప్రోత్సహిస్తారు. ఇది వారి ఆలోచనా శక్తిని, వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుతుంది.
4. _చదవడంపై దృష్టి:_ స్కూల్ చదవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది, దీనివల్ల మా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, తమను తాము వ్యక్తపరచుకునే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడ్డాయి.
5. _ఆరోగ్యకరమైన స్నాక్స్:_ రోజుల వారీగా హెల్దీ స్నాక్స్ ప్లాన్ చేయడం అద్భుతమైన ఆలోచన. ఇది పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంచుతుంది, వారి ఆరోగ్యానికి తోడ్పడుతుంది, క్లాస్‌లలో చురుగ్గా, శ్రద్ధగా ఉండేలా చేస్తుంది.
6. _అసెంబ్లీ మరియు ఆటలు:_ ప్రతిరోజూ అసెంబ్లీలు, ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలు చురుగ్గా, క్రమశిక్షణతో, శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చేస్తాయి.
7. _ప్రత్యేకమైన యాన్యువల్ డే ప్రోగ్రామ్స్:_ స్లేట్ లో యాన్యువల్ డే వేడుకలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. చాలా స్కూళ్లలో యాన్యువల్ డే అంటే సినిమా పాటలు, డ్యాన్సులు, స్పీచ్‌లే. కానీ స్లేట్ లో అధిక మొబైల్ ఫోన్ వాడకం, జంక్ ఫుడ్, బుల్లీయింగ్ వంటి నేటి పిల్లలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన థీమ్‌లను ప్రదర్శిస్తారు.
ఈ ప్రోగ్రామ్స్ కేవలం వినోదం కాదు - విలువైన జీవిత పాఠాలను అందిస్తాయి. నాకు స్లేట్ యాన్యువల్ డే అనేది ఒక సాధారణ స్కూల్ ఫంక్షన్ లా కాకుండా, _జీవితాన్ని మార్చే, ప్రేరణ కలిగించే అనుభవం_ లా అనిపిస్తుంది.
ఈ కరిక్యులం పట్ల మేము నిజంగా చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా నేటి _AI ప్రపంచంలో_ ఇది ఎంతో అవసరం, ఉపయోగకరం.
మా పిల్లలు తమ పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి చదవడం, నేర్చుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తిలో గుర్తించదగిన మెరుగుదలను మేము చూశాము.
స్కూల్ నిర్వహణ తీరు కూడా నాకు చాలా నచ్చింది. ప్రతి క్లాస్‌కు క్లాస్ టీచర్, మెంటార్, సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ప్రైమరీ, హైస్కూల్ సెక్షన్లకు వేర్వేరు ప్రిన్సిపాల్స్ తో పాటు అదనపు లీడర్‌షిప్ సపోర్ట్ కూడా ఉంది.
ప్రతి స్థాయిలో పిల్లలకు అవసరమైన గైడెన్స్, ప్రోత్సాహం, ప్రేరణ అందుతుంది, తద్వారా వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు.
_మా పిల్లల ప్రయాణాన్ని స్లేట్ - ది స్కూల్‌తో కొనసాగించడం మాకు చాలా సంతోషంగా ఉంది_.
వారి నిరంతర సపోర్ట్, అంకితభావానికి _టీచర్లు, మెంటార్లు, PET లు, సపోర్ట్ స్టాఫ్, ప్రిన్సిపాల్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు_. ��
మరియు ఇంత అద్భుతమైన, ప్రత్యేకమైన విద్యను అందించి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, విలువలు పెంపొందించే వాతావరణాన్ని సృష్టించినందుకు _అమర్నాథ్ సర్ కు ప్రత్యేక ధన్యవాదాలు_. ����
_కృతజ్ఞతలతో,_
_వెంకట్ రెడ్డి ఆకెపల్లి_
తల్లిదండ్రులు
_విశ్వక్సేనా రెడ్డి - 6D_
_అన్వికా రెడ్డి - 3C_
( తెలుగు వెర్షన్ AI ద్వారా అనువదించబడింది )
తల్లిదండ్రుల ద్వారా ఆంగ్ల అనువాదం����
అందరికీ నమస్కారం,����‍♂️*
*అభివాదాలు!*
*చిన్న థాంక్యూ - పెద్ద మనసుతో ��*
_అద్భుతమైన స్లేట్ - ది స్కూల్ ఫ్యామిలీకి_
ప్రియమైన స్లేట్ ఫ్యామిలీ,
మా బంధం స్లేట్ తో నిన్న మొన్న ఏర్పడింది కాదు. కోవిడ్ కంటే చాలా ముందు నుండే, మా మేనల్లుడు ఇదే తరగతి గదుల్లో 10వ తరగతి వరకు పెరగడం మేము చూశాము. స్లేట్ అతన్ని ఎలా ఆత్మవిశ్వాసం, బలమైన విలువలు, ఆలోచనాపరుడైన యువకుడిగా తీర్చిదిద్దిందో మేము చూశాము. అదే సమయంలో, అమర్నాథ్ సర్ చేసే సామాజిక స్పృహ కార్యక్రమాలను, సమాజం పట్ల ఆయనకున్న నిజమైన శ్రద్ధను ఎప్పుడూ అభినందిస్తూ వచ్చాము. అందుకే మా అబ్బాయి *ఆద్విక్* కోసం స్కూల్ ఎంచుకునే సమయం వచ్చినప్పుడు, మా మనసుకు సమాధానం ముందే తెలుసు. ��
స్లేట్ ఎప్పుడూ ఒక స్కూల్ లా మాత్రమే అనిపించలేదు. ఇది పిల్లలను రోల్ నంబర్లుగా లేదా రిపోర్ట్ కార్డులుగా కాకుండా, ఆసక్తికరమైన మనస్సులు, దయగల హృదయాలు, ఎగరడానికి సిద్ధంగా ఉన్న కలలు ఉన్న చిన్న అన్వేషకులుగా చూసే ప్రదేశం. ✨
ఇక్కడ నేర్చుకోవడం అంటే పేజీలు బట్టీ పట్టడం కాదు. వాటిని _అర్థం చేసుకోవడం_. ప్రీ-రీడింగ్, రివిజన్, స్వతంత్రంగా ఆలోచించడం, తన సొంత మాటల్లో సమాధానాలు రాయడం వంటివి నెమ్మదిగా ఆద్విక్ ను "ఏమిటి" అని తెలుసుకునే ముందు "ఎందుకు" "ఎలా" అని ప్రశ్నించే చిన్న ఆలోచనాపరుడిగా మార్చాయి. చదవడం వల్ల కలిగే ఆనందం, హెల్దీ స్నాక్స్, సంతోషకరమైన అసెంబ్లీలు, ఉత్సాహభరితమైన ఆటలు, అర్థంతో నిండిన యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ వల్ల స్కూల్ అంటే ప్రతి ఉదయం ఎదురుచూసే ప్రదేశంగా మారింది. ��
ఆ మార్పును చూడటం చాలా అందంగా ఉంది. డిన్నర్ టేబుల్ దగ్గర, అతని కథల పుస్తకాల్లో, అతని ప్రశ్నల్లో, అతని కళ్ళలోని ఆత్మవిశ్వాసపు చిన్న మెరుపులో మేము దాన్ని చూస్తున్నాము. చదవడం అతని స్నేహితుడిగా, ఆత్మవిశ్వాసం అతని తోడుగా, క్యూరియాసిటీ అతని సూపర్ పవర్ గా మారింది. ����
ఇదంతా మాయాజాలంతో జరగదు. ప్రతి చిరునవ్వు వెనుక ఎంతో శ్రద్ధగా పనిచేసే ఒక టీమ్ ఉంది. మీ ఓపిక, ప్రేమ, నిరంతర గైడెన్స్ కోసం టీచర్లు, మెంటార్లు, PET లు, సపోర్ట్ స్టాఫ్, స్కూల్ లీడర్‌షిప్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మా పిల్లలకు కేవలం చదువు చెప్పడం లేదు; మీరు వారిని నమ్ముతున్నారు. ��
అమర్నాథ్ సర్ కి, పిల్లలను పరీక్షల కోసం మాత్రమే కాకుండా, జీవితం కోసం సిద్ధం చేసే స్కూల్ ను కలలు కన్నందుకు ధన్యవాదాలు. మీ దార్శనికత ఇప్పుడు మా కుటుంబంలో రెండు తరాలను తాకింది, దానికి మేము ఎంతో కృతజ్ఞులం.
ఈ ప్రయాణాన్ని స్లేట్ తో ఒక అందమైన అధ్యాయం తర్వాత మరో అధ్యాయంగా కొనసాగించడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది. ��
ప్రేమ మరియు కృతజ్ఞతలతో,
*మహేష్ కొట్టే*
*ఆద్విక్ యువరాజ్ కొట్టే – 4B* యొక్క గర్వించదగిన తండ్రి

AI ద్వారా తెలుగు అనువాదం

తల్లిదండ్రుల అసలు సందేశం��������
గొప్ప హృదయంతో ఒక చిన్న కృతజ్ఞత��**

*అద్భుతమైన స్లేట్ – పాఠశాల కుటుంబానికి*

ప్రియమైన స్లేట్ కుటుంబమా,

స్లేట్‌తో మా బంధం నిన్న మొదలవ్వలేదు. కోవిడ్‌కు చాలా కాలం ముందు, మా మేనల్లుడు తన 10వ తరగతి వరకు ఈ తరగతి గదులలోనే పెరగడాన్ని మేము చూశాము. స్లేట్ అతన్ని ఆత్మవిశ్వాసం, నిలకడ, మరియు ఆలోచనాపరుడైన యువకుడిగా ఎలా తీర్చిదిందిందో మేము చూశాము. దానితో పాటు, అమర్‌నాథ్ సార్ యొక్క సామాజిక అవగాహన కార్యక్రమాలను మరియు సమాజం పట్ల ఆయనకున్న నిజమైన శ్రద్ధను మేము ఎల్లప్పుడూ ఆరాధించాము. కాబట్టి మా కుమారుడు, **ఆద్విక్** కోసం పాఠశాలను ఎంచుకోవలసిన సమయం వచ్చినప్పుడు, మా హృదయాలకు సమాధానం ముందే తెలుసు. ��

స్లేట్ ఎల్లప్పుడూ ఒక పాఠశాల కంటే ఎక్కువగానే అనిపించింది. ఇది పిల్లలను కేవలం రోల్ నంబర్లుగానో లేదా రిపోర్ట్ కార్డులుగానో కాకుండా, ఉత్సుకతతో కూడిన మనసులు, దయగల హృదయాలు, మరియు ఎగరడానికి సిద్ధంగా ఉన్న కలలతో కూడిన చిన్న అన్వేషకులుగా చూసే ప్రదేశం. ✨

ఇక్కడ, నేర్చుకోవడం అంటే పేజీలను కంఠస్థం చేయడం కాదు. అది వాటిని *అర్థం చేసుకోవడం*. ముందుగా చదవడం, పునశ్చరణ, స్వతంత్రంగా ఆలోచించడం, మరియు తన సొంత మాటల్లో సమాధానాలు రాయడం వంటివి నెమ్మదిగా ఆద్విక్‌ను ఒక చిన్న ఆలోచనాపరుడిగా మార్చాయి. అతను 'ఏమిటి' అనేదాన్ని అంగీకరించే ముందు 'ఎందుకు' మరియు 'ఎలా' అని అడుగుతాడు. చదవడంలో ఆనందం, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు, ఉల్లాసభరితమైన సమావేశాలు, చురుకైన ఆటలు, మరియు అర్థవంతమైన వార్షికోత్సవ కార్యక్రమాలు పాఠశాలను అతను ప్రతి ఉదయం ఎదురుచూసే ప్రదేశంగా మార్చాయి.��

మరియు ఈ మార్పును చూడటం చాలా అందంగా ఉంటుంది. మేము దానిని భోజన బల్ల వద్ద, అతని కథల పుస్తకాలలో, అతని ప్రశ్నలలో, మరియు అతని కళ్లలోని ఆత్మవిశ్వాసంతో కూడిన చిన్న మెరుపులో చూస్తాము. చదవడం అతని స్నేహితుడయ్యాడు, ఆత్మవిశ్వాసం అతని సహచరుడు అయ్యాడు, మరియు ఉత్సుకత అతని అద్భుత శక్తి అయ్యింది. ����
ఇదేదీ మాయగా జరగదు. ప్రతి చిరునవ్వు వెనుక ఎంతో శ్రద్ధ వహించే ఒక బృందం ఉంటుంది. మీ సహనం, ఆప్యాయత, మరియు నిరంతర మార్గదర్శకత్వానికి ఉపాధ్యాయులకు, మార్గదర్శకులకు, PETలకు, సహాయక సిబ్బందికి, మరియు పాఠశాల నాయకత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మా పిల్లలకు కేవలం బోధించడమే కాదు; మీరు వారిని నమ్ముతారు. ��

అమర్‌నాథ్ సార్, పిల్లలను కేవలం పరీక్షలకే కాకుండా, జీవితానికి కూడా సిద్ధం చేసే పాఠశాల గురించి కలలు కన్నందుకు మీకు ధన్యవాదాలు. మీ దార్శనికత మా కుటుంబంలోని రెండు తరాల వారిపై ప్రభావం చూపింది; దీనికి మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము.
'స్లేట్' (Slate)తో కలిసి, ఒక్కో అందమైన అధ్యాయాన్ని దాటుతూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం, గర్వం మరియు కృతజ్ఞతాభావం ఉన్నాయి. ��
ప్రేమ మరియు కృతజ్ఞతలతో,
**మహేష్ కొట్టె**
**ఆద్విక్ యువరాజ్ కొట్టె (4B)** యొక్క గర్వించదగ్గ తల్లిదండ్రులు��

" ఎన్నికలొస్తున్నాయి .. అవతలి పార్టీ అభ్యర్థి .. గట్టోడు . అక్రమ మార్గాల్లో కూడేసిన సంపదలో ఎన్నికల కోసం 40 కోట్లు బయటకు తీసాడు . వాడిని ఓడించాలి అంటే... నువ్వు కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టగలగాలి . చేయగలవా ?"
" అలాగే అన్నా . ఇదిగో పార్టీ ఫండ్ కోసం ఇంత . మిగతా డబ్బు ఎన్నికలకోసం ఖర్చు పెడుతా ".
సీట్ ఇచ్చారు .
సోషల్ మీడియా .. మీడియా .. సమస్త సైన్యాన్ని మోహరించి జనాలకు బ్రెయిన్ వాష్ చేసి{ మధ్య తరగతి కోసం } డబ్బులు పంచి { బీదల కోసం } గెలిపించారు .
50 కోట్లు ఖర్చు పెట్టినోడు ... పదవీ కాలంలో సంపాదించాలి కదా ?
ఖర్చు పెట్టిన యాభై కోట్లు ... మళ్ళీ ఎన్నికలకోసం 60-70 కోట్లు .. సంపాదించాలి కదా ?
ప్రతి దానికీ రేట్ నిర్ణయిస్తాడు .
ఉదాహరణకు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అంటే నాకు ఎకరాకు ఇరవై లక్షలు ఇవ్వాలి . ఇవ్వక పొతే నీ వెంచర్ ముందుకు సాగదు . అధికారులు ప్రతి అడుగులో సమస్యలు సృష్టిస్తారు " అంటాడు .
ఇదొక ఎకో సిస్టం .
వ్యాపారాలు చేసేవారికి దేనికి ఎంత ఇచ్చు కోవాలో తెలుసు .
ప్రభుత్వ ఉద్యోగులకు ... సబ్ ఇన్స్పెక్టర్ మొదలు MRO పోస్ట్ దాక దేనికి ఎంత సమర్పించుకోవాలో తెలుసు .
ఇచ్చు కున్నోడు .. దాన్ని తిరిగీ సంపాదించుకొంటాడు . కాదు కాదు ... ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు .. మూడు రెట్లు ... లాగేసాడు .
ఒక చిన్న స్థాయి అధికారిని... ఎసీబీ ట్రాప్ చేసినా వంద కోట్లు రాలుతుంది .
చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు కానీ .. రాజకీయనాయకులను ట్రాప్ చేస్తే హిమాలయ పర్వతాల అంత సంపద బయట పడుతుంది .
బ్రిటీష్ వాడి దోపిడీ , సంపద తరలింపు గురించి దాదాభాయ్ నవరోజీ " పావర్టీ అండ్ ఆన్- బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా " అనే బుక్ రాసాడు . 150 సంవత్సరాల కాలం లో బ్రిటష్ వాడు దోచుకొని తమ దేశానికి తరలించుకొని పోయిన సంపదతో పోలిస్తే... కనీసం అయిదు రెట్లు భారతావని లో రాజకీయులు దోచేసి... ఇంగ్లాండ్ , దుబాయ్, సింగపూర్, మారిషస్ కు తరలించేసారు .
బ్రిటిష్ వాడిని తరిమేశారు .
మరి రాజకీయుడి ని ?
బ్రిటీషోడు పెద్ద ఫూల్ .
రాజకీయడు మహా కన్నింగ్ ... స్ట్రాటజిస్ట్ .
రాజకీయనాయకుడి స్కీం లో... ప్రజలు మూడు కేటగిరీ లు .
అట్టడుగున పేదలు .
పేదరికం రాజకీయాలకు ఒక పండగ . యాభై ఏళ్ళ క్రితమే “ గరీబీ హటావో “ అనే నినాదం .
పేదరికం పొతే తానకు మనుగడ లేదని రాజకేయుడికి తెలుసు . తనకు జెండాలు మోసేది, ర్యాలీ లు తీసేది వారే కదా .
వ్యవస్థ భాదితులు పేదలు . పేదరికం ICU లో ఉచితాలు అనే స్టెరాయిడ్ లు ఇచ్చే డాక్టర్ రాజకీయుడు .
"అబ్బో .. గొప్ప ట్రీట్మెంట్ అనుకొంటాడు" పేదరికం రోగి . స్టెరాయిడ్ తక్షణ శక్తిని ఇస్తుంది . కానీ ఒంటిని తినేస్తుంది .
ఇది అర్థం కావడానికి మూడు జన్మలు చాలవు చాలా మందికి .
ICU స్టెరాయిడ్ గేమ్ రాజకీయుడి మొదటి పాచిక .
రెండో పాచిక సెంటి మెంటు అనే ఆయింట్మెంట్ . ఇది మధ్యతరగతోడికి .
మధ్య తరగతి . . నలిగి పోతారు .
సాండ్విచ్చ్ మసాజ్ .. జీవితాంతం .
కష్టపడి ..సంపాదించిన దానితో పన్నులు కట్టి కట్టి బతుకుతాడు .
బతుకు మిధ్య .
తన budget అనే కుండకు రాజకీయుడు చిల్లు పెట్టేసాడు .. అని గ్రహించలేడు .
గ్రహించినా .. చేసేది ఏమీ లేదు .
కింద కారి పోతూ ఉంటే చేది చేది నీరు పోస్తూ ఉంటాడు ..
చివరకు మిగిలేవి.. అప్పులు అవమానాలు ఆయాసం.
చాలీ చాలని జీవితం .
మధ్య తరగతోడికి సెంటిమెంట్స్ ఎక్కువ .
కులం .. మతం , ప్రాంతం , అవినీతి పై పై పోరాటం .. ఇలా రకరకాల పద్ధతుల్లో వీడిని ఎమోషనల్ హైజాక్ చేసేస్తాడు రాజకీయుడు .
పిచ్చోడు .. మధ్య తరగతోడు .. టీవీ లు చూసి .. పేపర్ చదివి .. సోషల్ మీడియా పోస్ట్ లు చూసి .. రోజూ .. ప్రతి రోజూ .. ఆవేశం స్టార్ అయిపోతుండాడు . బీపీ పెంచుకొంటాడు .
కుటుంబం భార్య పిల్లల కంటే తన అభిమాన నాయకుడు ... పార్టీ కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అంకమ్మ శివాలు ఎత్తి పోతుంటాడు .
పేదోడే స్మార్ట్ . "ఉత్తుత్తి కబుర్లు వద్దు .. నాకేంటి ? మీటింగ్ కొస్తే ఎంత ? ర్యాలీ చేస్తే ఎంత . ఓట్ కు ఎంత ? గెలిచాక ఏమి చేస్తావు?" అని వడ్డీ వ్యాపారిలా లెక్క కట్టి తీసుకొంటాడు .
పిచ్చి మధ్యతరగతోడు పైసా లాభం లేకపోయినా గానుగెద్దు లాగా సమస్త భారం మోస్తున్నా ఎమోషనల్ హైజాక్ నుంచి బయట పడడు . పడలేడు . బాగుపడే లక్షణాలు ఇసుమంతయినా లేనోడు .
ఇక మూడో వర్గం .. పై వోడు .
“ మనం మనం బరంపురం “ టైపు .
పార్టీ లు భావాజాలాలు కులం మతం ప్రాంతం అన్నే అన్నీ మాయ అని ఎప్పుడో కనిపెట్టినోడు . డబ్బు ఒకటే... నిజం... శాశ్వతం అని నమ్మినోడు .
ఇక్కడిదాకా చదివి .. నేను మాట్లాడుతున్నది తెలంగాణ గురించా? లేక ఆంధ్ర ప్రదేశ్ గురించా? అని ఆలోచిస్తున్నారా ?
మీ ఆవేశం సల్లగుండా .. కాస్త తగ్గించుకోండి స్వామీ !
1 . నేను ఫలానా పార్టీ.. ఫలానా నాయకుడు అని చెప్పడం లేదు .అన్ని పార్టీ లు ఒక్కటే అని కూడా చెప్పడం లేదు . మీ రాజకీయ అభిమానం ఉండనీ . కానీ అదే పనిగా పొద్దున్న పేపర్ చదివి... రాత్రి ప్రైమ్ టైం లో టీవీ చర్చ చూసి .. మధ్యలో సోషల్ మీడియా పోస్ట్ లు వీడియో లు చూసి .. తెగ ఆవేశ పడొద్దు . ఒంటికి మంచిది కాదు . రాగ భావ ద్వేషాన్ని తగ్గించుకోండి . రాజకీయుడు కోట్లు ఖర్చు పెట్టి మీడియా ద్వారా విసిరే ఎమోషనల్ హైజాక్ ట్రాప్ నుంచి బయట పడండి . ఎన్నికలు వచ్చినప్పుడు మీ అభిమాన నాయకుడికే ఓట్ వేద్దురు ... కానీ ప్రతి రోజూ మద్దెల దరువు వద్దు .
2. మీ బతుకు గురించి... కుటుంబం భార్యా పిలల్ల గురించి ఆలోచించండి . ఉందిలే కష్టకాలం ముందు ముందునా .. జాగ్రత్త పడండి .
3. గత 25 సంవత్సరాలు సంపద వెల్లువ . పెట్టుబడి దారీ విధానం లో ఇదొక పొంగు కాలం . పెరుగుట .. అదీ కృతిమ పెరుగుట విరుగుట కొరకే కదా . ఇప్పుడు విరుగుడు కాలం మొదలయ్యింది .
4. అప్పు చేసి తప్పు కూడు తిన్నారు . నేటి ప్రపంచ అప్పు 365 ట్రిలియన్ డాలర్స్ . 2026 సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఇది పది ట్రిలియన్ డాలర్స్ పెరిగింది . అమెరికా , చైనా, జపాన్ , ఇంగ్లాండ్, ఫ్రాన్స్ , జర్మనీ, ఇండియా కెనడా , బ్రెజిల్ .. ఇవీ అప్పుల్లో అగ్ర స్థానం లో ఉన్న దేశాలు .
అప్పు చేసారు సరే .. కట్టాలి కదా ?
ఎలా ?
మునిగే దాక అప్పు చేస్తారా ?
ఒక ముక్క లో చెప్పాలి అంటే గత ముప్పై సంవత్సరాలుగా పెద్దలు చేసిన అప్పులు మరో పది ఇరవై సంవత్సరాలు వారి పిల్లలు కట్టాలి .
యువతరం బతుకులు చితికి పోతున్నాయి .
మీకు అర్థం కావడానికి ఒక్క ముక్కలో చెబుతాను . 20 ఏళ్ళ క్రితం అమెరికా తండ్రి బ్రెజిల్ కు పోయి లండన్ తండ్రి పట్ఠాయ కు పోయి .. మస్తు ఎంజాయ్ చేస్తే .. ఇప్పుడు వారి కొడుకులు .. ఉద్యోగాలు లేక .. ఉంటే ఆదాయం సరిపోక బతుకు బండి నడవక డింకీ కొడుతున్నారు .
ప్రపంచ వ్యాపితంగా ఇదే సీన్ .
స్పెయిన్ లో గత పదేళ్లలో ఇంటి అద్దెలు రెట్టింపు అయ్యాయి . దీన్ని భరించలేక 50 నగరాల్లో లక్షలాది మంది రోడ్ ల పైకి వచ్చి ప్రదర్సన చేస్తున్నారు .
రెండు ఉద్యోగాలు చేసినా ఆదాయం సరిపోక ఇంగ్లాండ్ లో అల్లాడి పోతున్నారు .
ధరలు పెరగడం వల్ల బతకలేక అమెరికా ప్రజలు రిపబ్లికన్ పార్టీ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారట .
5. చెత్త వీడియో లో చూడడం ఆపండి .
"తగినంత ప్రోటీన్ తినకపోతే ఇదిగో ఈ సమస్యలు అని చెబితే .. డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? . నీకు ఎంత సంపాదన?" ..అని అడిగే పిచ్చి స్థాయికి మీ మెదడును పాడు చేసుకోవద్దు .
"పోస్ట్ లో ఏమీ లేదు . అనవసర సోది .. ఇంత లెంగ్త్ "అంటాడు ఇంకోడు . నిజమే అనుకొందాము . సోది పోస్ట్ ఎందుకు చదివినట్టు ? టైం ఎందుకు వృధా చేసుకున్నట్టు ? నేనేమయినా చెట్టుకు కట్టేసి పోస్ట్ బలవంతంగా వినిపించానా ?. మీ టైం లైన్ పై మీరు రాసుకొన్నటు .. నా టైం లైన్ పై నేను రాసుకొంటున్నా . దాన్ని ఫేస్బుక్ వాడు ప్రమోట్ చేస్తే అది వాడి బిజినెస్ . నాకేంటి ?
నా పోస్ట్ ను కేవలం అయిదుగురే చదివినా నాకు వచ్చే నష్టం లేదు . లక్ష మంది చదివినా ఫేస్బుక్ వాడు ఇచ్చేది ఏమీ లేదు .
నిన్న ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేసినట్టు "కంచి గరుడ సేవ "
మీ కుటుంబానికి మీరే దిక్కు . ఆరోగ్యం కాపాడుకోండి . స్మార్ట్ థింకింగ్ అలవాటు చేసుకోండి .
ఆదాయం పెంచుకొనే మార్గాలు ఆలోచించండి .
వృధా ఖర్చులు మానండి .
పొదుపు చేయండి .
నేను గతంలో బంగారం కొనండి అని చెప్పినప్పుడల్లా కొంత మంది స్టాక్ మార్కెట్ .. మ్యూచువల్ ఫండ్స్ మంచివి అన్నారు . ఇప్పుడు ... తత్త్వం బోధపడిందా ?
నాకు తెల్సిన విషయాలను .. విజ్ఞానాన్ని మీకు ఉచితంగా అందిస్తున్నా .
తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం .
" మైదా వద్దు .. సింపుల్ కార్బ్స్ వద్దు" అని నేను చెబితే .. మీరు కసిగా .. నా పై ద్వేషం తో .. రోజూ మైదా పాస్తా నూడుల్స్ తింటే నేను మీ ఇంటికొచ్చి ఆపుతానా ? మీ పై కేసు పెడుతానా ?
మీ లైఫ్ మీ ఇష్టం .. ఉంచుకొంటారో .. చించుకొంటారో ..
ఒక కుటుంబ బ సభ్యుడి లాగా ఏవో కొన్ని చెబుతున్నా . అంతే . అంతకన్నా ఏమీ లేదు
{ అన్నట్టు మొన్న రాత్రి ఒక కాల్ . ఒక ప్రముఖ నాయకుడి నుంచి .. MLC గా పోటీ చెయ్యమని . 2007 లో దండమెట్టేసాను . ఇప్పుడు ఊబిలో దిగుతానా .?
ఎవడికీ తలవంచను .. ఎవడినీ యాచించను ..{ ఓట్లు } }
ఈ పోస్ట్ లో చివరిగా రెండు మాటలు .
1 . నేను ఒక టీచర్ . "సార్" అని పిలిస్తేనే నాకు ఇష్టం . ఏమండీ అనొచ్చు .
అన్నా / తమ్మడు / బావ / మామయ్య / అంకుల్ / పెంకుల్ / తాత / ముత్తాత / జేజి తాత .. లాంటి పిలుపులు వద్దు .
2. నాయనలారా .. రాజకీయనాయకుడి కోసం ఏడవకండి .. మీ కోసం .. మీ పిల్లల కోసం ఏడవండి .

ఈ రోజు, _APPUSMA (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్)_ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరు హాజరయ్యారు:
1. పులివర్తి నాని - ఎమ్మెల్యే, చంద్రగిరి
2. డాక్టర్ కె. మురళీ మోహన్ - ఎమ్మెల్యే, పుత్తలపట్టు
4. సి. దివాకర్ రెడ్డి - చైర్మన్, TUDA
5. జి. భాను ప్రకాష్ రెడ్డి - బోర్డు సభ్యులు, TTD
6. ఎం. సుగుణమ్మ - చైర్‌పర్సన్, AP గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్
7. కె.వి.ఎన్. కుమార్ - DEO, తిరుపతి
8. ఎన్. విశ్వనాథ రెడ్డి - జోనల్ ప్రెసిడెంట్, APPUSMA
9. వాసిరెడ్డి అమర్‌నాథ్ - వ్యవస్థాపకులు & చైర్మన్, SLATE & COGNIBOT గ్రూప్ ఆఫ్ స్కూల్స్
ఈ సందర్భంగా, అవార్డు గ్రహీతలలో ఒకరైన _SLATE - The School (తిరుపతి)_ హైస్కూల్ ప్రిన్సిపాల్ _శ్రీ వంశీ కృష్ణ_ గారు 'ఉత్తమ ఉపాధ్యాయుడు' (BEST TEACHER)గా సత్కరించబడ్డారు.
*_AI (కృత్రిమ మేధస్సు) నేపథ్యంలో విద్యా విధానంలో మార్పుల ఆవశ్యకత_* గురించి _శ్రీ వాసిరెడ్డి అమర్‌నాథ్_ గారు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన ప్రసంగం వేదికపై ఉన్న ప్రముఖులందరి ప్రశంసలను అందుకుంది.

Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools
Today, APPUSMA (Andhra Pradesh Private Unaided Schools Management Association) organised a ceremony to felicitate the Best Teachers of private schools

@ స్లేట్ తిరుపతి.

@ Slate Tirupati.
@ Slate Tirupati.
@ Slate Tirupati.

సవాలుకు సిద్ధమా మానసిక దరిద్రుడా !

చాలా కాలంగా చాలా మంది పదేపదే అడిగితే పెట్టా ! నా డైట్ చూసి దాన్ని పాటించలేని కొంత మంది మానసిక దౌర్బలులు వెనువెంటనే విప్లవకారుల సంఘ సంస్కర్తల అవతరమెత్తి " ఇలాంటి ఫుడ్ బీదలు ఎలా తినాలి అని అడిగారు ! వారందరూ ఒక్కసారి ముందుకు రావాలి !
కింది డేటా చూడండి !
( ఈ మానసిక వికలాంగులపై ఒక ఆడియో రికార్డు చేసాను ! కాసేపట్లోఆది పోస్ట్ అవుతుంది ! )
మితిమీరిన సంక్షోభం!
ఒక సగటు భారతీయుడు అతని/ఆమె స్వయాన్ని ఎలా దెబ్బతీస్తున్నాడు?
1 అదనపు కార్బోహైడ్రేట్ - దాదాపు ప్రతి భారతీయుడు:
రోజువారీ కేలరీలలో 62.3% కార్బోహైడ్రేట్ల నుండి వస్తాయి - ఇది ప్రపంచంలోనే అత్యధికం. సిఫార్సు 45-55%.
- అందులో, తెల్ల బియ్యం, మైదా, పాలిష్ చేసిన గోధుమలు వంటి శుద్ధి చేసిన తృణధాన్యాల నుండి 28.5% కేలరీలు మరియు మిల్లింగ్ చేసిన తృణధాన్యాల నుండి 16.2% - మొత్తం 44% కంటే తక్కువ కేలరీలు తక్కువ నాణ్యత గల పిండి పదార్ధాల నుండి మాత్రమే!
ICMR హెచ్చరిక: భారతీయులు 65-70% పిండి పదార్థాలు మరియు 10-12% ప్రోటీన్లు మాత్రమే తింటారు! కాబట్టి 80-90% భారతీయులు అధిక పిండి పదార్థాలు తింటారు!
ప్రమాదం: అతి తక్కువ ఆహారంతో పోలిస్తే అత్యధిక కార్బ్ తీసుకోవడం ఉన్న వ్యక్తికి 30% ఎక్కువ మధుమేహం, 22% ఊబకాయం, 15% బొడ్డు ఊబకాయం ఉన్నాయి.
2. సింపుల్ కార్బోహైడ్రేట్ / షుగర్ - 60% రాష్ట్రాల్లో ఎక్కువ
36 రాష్ట్రాలు/యుటిలలో 21 చక్కెర జోడించిన సురక్షిత పరిమితిని మించిపోయాయి. పరిమితి చక్కెర నుండి <5% కేలరీలు, కానీ చాలామంది ఎక్కువ తింటారు.
-36 రాష్ట్రాలలో 32 రాష్ట్రాల్లో సంతృప్త కొవ్వు సురక్షిత పరిమితిని మించిపోయింది.
జంక్ ఫుడ్ / అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్:
ICMR-NIN నివేదిక జూలై 2026 ప్రకారం గత 14 ఏళ్లలో జంక్ ఫుడ్ డిమాండ్ 150% పెరిగింది.
గృహ వ్యయం: గ్రామీణ కుటుంబాలు 9.84% నెలవారీ బడ్జెట్‌ను ప్రాసెస్ చేసిన ఆహారం/పానీయాలు, పట్టణ ప్రాంతాలపై ఖర్చు చేస్తాయి 11.09%/ 20 ఏళ్లలో తొలిసారిగా ఇది 10% దాటింది.

యాప్స్‌లో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్‌లలో జాబితా చేయబడిన ప్రతి రెండు ప్యాకేజ్డ్ ఐటమ్స్‌లో ఒకటి జంక్ / HFSS.

పిల్లలు - అత్యంత ఎక్కువగా ప్రభావితమవుతున్నారు: 13,274 మంది పిల్లలపై పాన్-ఇండియా CSE సర్వే:

93% మంది వారానికి ఒకసారి కంటే ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటారు

68% మంది వారానికి ఒకసారి కంటే ఎక్కువగా ప్యాక్ చేసిన తీపి పానీయాలను తాగుతారు

53% మంది రోజుకు కనీసం ఒక్కసారైనా ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ తింటారు

- అధ్యయనాలలో జంక్ ఫుడ్ వినియోగం యొక్క సాధారణ ప్రాబల్యం: 65%

10 మంది భారతీయుల కోసం సాధారణ సంఖ్యలలో:

- 10 మందిలో 9 మంది అవసరమైన దానికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు తింటారు

- 10 మందిలో 6 మంది ఎక్కువగా శుద్ధి చేసిన బియ్యం/మైదా/వైట్ బ్రెడ్ తింటారు

- 10 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలు ఎక్కువగా చక్కెరను వినియోగిస్తాయి

- 10 మంది పిల్లలలో 6-7 మంది రోజూ/వారానికి జంక్ ఫుడ్ తింటారు

- మీ ఆన్‌లైన్ కిరాణాలోని 10 వస్తువులలో 4 అతిగా ప్రాసెస్ చేయబడినవి

తెలంగాణ/ఏపీ వంటి దక్షిణ భారతదేశంలో ప్రమాదం ఎక్కువగా ఉంది, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో తెల్ల బియ్యం 51% కేలరీలను కలిగి ఉంది, దానికి తోడు బిస్కెట్లు, బేకరీ, చక్కెర టీ కూడా ఉన్నాయి.

నా ఆహారం :

ముందుగా బ్రేక్ఫాస్ట్ వివరాలు :
1. ముందు రోజు రాత్రి 10 దాక పిస్తా పప్పులు... ఎనిమిది దాక ఆల్మండ్స్ { బాదాం పప్పులు } అయిదు దాక వాల్ నట్స్ { ఆక్రోట్ } ... రెండు మూడు అంజీర్ { మేడిపండు }... నీటిలో నానబెట్టి ... పొద్దున్న ఆ నీటి ని పారబోసి , బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొంటాను . సోమవారం నుంచి శనివారం దాక వారం లో అయిదు రోజులు ఇవి నా బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరి .
ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి . ఒమేగా - 3 ను శరీరానికి అందిస్తాయి . వాల్ నాట్ లో DHA ఉంటుంది . బాదంలో విటమిన్ - ఈ ఉంటుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి . మొన్న మా అమ్మ గురించి షార్ట్ఫిల్మ్ కోసం స్క్రిప్ట్ రాసినప్పుడు నా బాల్యానికి సంబందించిన ప్రతి విషయం నిన్ననే జరిగినట్టు గుర్తొచ్చింది .
గత వారం పెరుమాళ్ళ ఖండిగ లో నిర్మితమవుతున్నదేవాలయం నిర్మాణ పనులు సమీక్షించడానికి వెళ్ళినపుడు నలభై ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు చెబుతుంటే ఆ ఊరి వారు నోరు వెళ్ళ పెట్టారు . "ఇంత మెమరీ నా ?? "అని .
మీ బిడ్డ కు రోజుకు నాలుగు వాల్నట్స్ ఎనిమిది బాదాం లు ఇవ్వండి . మూడ్ స్వింగ్స్ పోతాయి . వ్యాకులత దరికి రాదు . ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
2. బ్రేక్ ఫాస్ట్ లో నేను తీసుకొనే మరో ఐటెం .. గొంద్ . ఇది రెండు రకాలుగా దొరుకుతుంది . ఒకటి తెల్లగా ఉంటుంది . రెండోది బంగారం రంగులో . నేను వాడేది రెండోది . అయిదు - ఆరు పలుకులు రాత్రి నీటిలో నానబెడితే పొద్దుకల్లా కరిగిపోతుంది . దాన్ని తాగేస్తాను . ఇది కీళ్ల లో సైనోవియల్ ద్రవాన్ని స్రవింప చేస్తుంది . కీళ్ల నొప్పులు దరి చేరదు . ఆదివారం రోజు చియా విత్తనాలు { సబ్జా గింజెలు } తాగుతాను . ఇది కూడా రాత్రి నీటిలో నానబెట్టి బ్రేక ఫాస్ట్ గా నానిన విత్తనాలు తాగేస్తాను .
3. బ్రేక్ ఫాస్ట్ లో మూడో ఐటెం . కోడి గుడ్లు . ఆదివారం తప్పించి ప్రతి రోజు 4-5 గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొంటాను . ఉడకబెట్టిన గుడ్లు మంచివి . రోజూ అవే తింటే బోర్ కదా . అందుకే ఒక రోజు ఉడకబెట్టిన గుడ్లు . ఒక రోజు దానిపై కొద్ది పాటి మిర్యాల పొడి చల్లి .. ఒక రోజు ఆమ్లెట్ .. ఇలా . ఆమ్లెట్ కు ఒక రోజు కొబ్బరి చట్నీ .. ఒక రోజు సాంబార్ . ఒక రోజు కారం చట్నీ . ఒక రోజు చికెన్ కర్రీ .. అప్పుడప్పుడు మటన్ కర్రీ . నాలుక మా తల్లి మా గొప్పది . అది తిరుబాటు చేస్తే కష్టం . అందుకే దాన్ని సంతృప్తి పరుస్తూ నా ఆహారం . వారం లో మూడు నాలుగు రోజులు కేవలం గుడ్డు లో తెల్ల సొన . మిగతా రోజులు మొత్తం గుడ్డు . సూపర్ మార్కెట్ లో బ్రౌన్ ఎగ్స్ అని దొరుకుతాయి . ధర ఎక్కువ . అవి వారానికి ఒక సారి . అప్పుడప్పుడూ నాటు కోడి గుడ్లు . ఈ రెండు తిన్నపుడు మాత్రం మొత్తం గుడ్డు . వాటి పచ్చ సొన ముఖ్యం కాబట్టి .
4. బ్రేక్ ఫాస్ట్ లో నాలుగో ఐటెం పండు . సీజన్ బట్టి .. జామ .. కివి .. బ్లూ బెర్రీ , పనస, మామిడి ఏదో ఒకటి . తక్కువ ధరకు దొరికే పళ్లలో జామ బెస్ట్ . ఇదే కింగ్ అఫ్ ఫ్రూప్ట్స్ . మామిడి కి కేవలం ఆ పేరు .
ధర ఎక్కువ అయినా అప్పుడప్పుడూ బ్లూ బెర్రీ తినాలి ..
వారానికి ఒక సారి అరటి పండు . ఇది పొటాషియం ను అందిస్తుంది
సోమవారం నుంచి శనివారం దాక ఈ నాలుగే నా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ .
ఇంకేమీ ఉండవు .
ఆదివారం నాలుక మా తల్లి మహా ఉత్సవాలు . అందరిలాగే .. పొంగల్ .. దోస .. అప్పుడప్పుడు మైదా తో చేసిన రొట్టె .. మాగ్గీ .. అబ్బో అరాచకం . ఆదివారం చెత్త ఫుడ్ అన్న మాట .
ఇప్పుడు నా లంచ్ .. డిన్నర్ వివరాలు :
1. సోమ, మంగళ బుధ వారాల్లో ..అన్నం తినను .
కేవలం చికెన్ , ఎగ్స్ , ఖీర లాంటివి . ఇంకా ఉడకబెట్టిన వేరుశనిగ . ఉడకపెట్టిన బ్రౌన్ చనా { శనిగలు } .
స్కూల్ కాంటీన్ లో నేను లంచ్ చేసేటట్టుఅయితే చికెన్ ఉండదు . ఇంట్లో అయితే చికెన్ .
రోజూ ఒకేలా చేస్తే బోర్ కదా .
చికెన్ ను రకరకాలుగా రుచి కరంగా చేస్తారు .
బయట నుంచి ఆర్డర్ ఉండదు .
హోటల్ సొయా సాస్ కలుపుతారు . సొయా విషం .
కాబట్టి ఇంట్లో చేసినవే .
చికెన్ 65 , చికెన్ ఫ్రై , చికెన్ మెజెస్టిక్ , చికెన్ రోస్ట్ ఇలా .
చికెన్ కు బదులుగా అప్పుడప్పుడు పన్నీర్
మీకు ఒక డౌట్ రావొచ్చు .
అసలు అన్నమే తినకపోతే ఒంటికి కార్బ్స్ ఎలా అని ?
లంచ్ కి డిన్నర్ కు బాగా ఎక్కువ మొత్తం లో కాయగూరలు .. కొంత ఆకుకూరలు తింటాను
బెండకాయ .. బీరకాయ .. సొరకాయ , గుమ్మడి , బీన్స్ ఇలా .. రకరకాల పద్ధతుల్లో తయారు చేసి .
నేను వీటిని అన్నం తో కలుపుకొని తినను కదా .
ఒట్టిగా తినేయాలి .
కాబట్టి వాటిలో కారం మసాలా ఉప్పు తక్కువగా ఉంటాయి .
ఒక ... కప్పుడు బీన్స్ ఫ్రై ఒట్టిగా తినడం ఊహించండి .
కాయగూరల్లో తక్కువ మొత్తం లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి .
పొద్దున్న తిన్న నట్స్ లో కూడా ఉంటాయి .
దీనికి తోడు బ్రౌన్ చనా, వేరుశనిగె .. వీటిలో కూడా కాంప్లెక్స్ కార్బ్ ఉంటాయి .
ఇవి చాలు .
నట్స్ లో ఆరోగ్యకరమయిన ఫ్యాట్స్ కూడా ఉంటాయి .
కార్బ్స్ ఎక్కువ తినాలి అనుకోవడం ఒక రోగం .
నిజమండీ ..
కార్బ్ క్రేవింగ్ అంటారు .
దీని గురించి చెబితే ఒక సెపరేట్ పెద్ద పోస్ట్ అవుతుంది .
2. గుర శుక్ర శనివారాలు .. లంచ్ కి... పైన చెప్పినవే .
3. ఈ మూడు రోజుల డిన్నర్ వివరాలు .
గురువారం డిన్నర్ . ఒక కప్పు బ్రౌన్ రైస్ . చికెన్ కర్రీ . నెలకు ఒక సారి గ్రీన్ మటన్ { పుదీనా తో చేసింది . వామ్మో వివరాలు అడగొద్దు .. పోస్ట్ నిడివిపెరిగి పోతుంది }.
శుక్రవారం .. చికెన్ బిర్యానీ .
బాస్మతి బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ . అంటే డయాబెటిస్ ఫ్రెండ్లీ . అలాగని దాన్ని అదే పనిగా తినొద్దు .
తెల్ల బియ్యం కంటే మంచిది .
శనివారం డిన్నర్ . ఒక కప్పు బౌన్ రైస్ . నాలుగు అలసంద వడలు . బెండకాయ కర్రీ
అదేంటి .. గుర శుక్ర శనివారాల్లో లంచ్ లైట్ గా చేసి డిన్నర్ కాస్త ఎక్కువగా ?
అవును .
అది రాజీ .
నా షెడ్యూల్స్ బట్టి లంచ్ కి ఎక్కువ టైం ఉండదు .
డిన్నర్ కాస్త ఎంజాయ్ చేస్తా .
ఫైనల్ గా ఆదివారం గురించి
ఆదివారం .. వారమంతా చికెన్, ఎగ్స్ తిని తిని... బోర్ కొట్టి న నేను ఆదివారం శాఖాహారానికి మళ్ళిపోతాను .
పప్పు అన్నం , పులిహోర , దద్దోజనం , పచ్చి పులుసు, మేదు వడ , వెజిటల్ ఫ్రెండ్ రైస్ , అంబికా అప్పడాలు .. మురుకులు చేగోడీలు ..పికెల్స్ .. అన్నీ అని కాదు . వీటిలో ఏవో కొన్ని . ఒక్కో సారి రాగి సంకటి .దానికి పల్లీ చట్నీ .. కుదిరితే జొన్న రొట్టి ..
చెప్పాగా ఆదివారం అరాచకం . ,,, నాలుక మా తల్లి మహా ఉత్సవాలు . వారమంతా నాకు కోపెరేట్ చేసినందుకు.
నా ఆహారం లో కీలక అంశాలు :
1. ఎప్పుడో ఒక ఆదివారం పప్పు అన్నం కోసం వైట్ రైస్ వాడుతాను . నెలకు ఒక సారి మైదా .. మాగ్గీ . నేను తినే సింపుల్ కార్బ్స్ ఇంతే .
2. నేను తినేవి కాంప్లెక్స్ కార్బ్స్ . అవీ తక్కువ మొత్తం లో
3. అధిక మొత్తం లో ప్రోటీన్స్ తీసుకొంటాను . నేను జిం చేస్తాను . కాబట్టి ఎక్కువ ప్రోటీన్స్ అవసరం .
4. ఆరోగ్యకరమయిన ఫ్యాట్స్ నాకు నట్స్ ద్వారా అందుతుంది .
5. కాయగూరలు ఆకుకూరలు పళ్ళు .. వీటి ద్వారా నాకు తగినంత ... విటమిన్స్, మినరల్స్ , పీచు ... అన్నిటికి మించి కాన్సర్ నుంచి రక్షణ ఇచ్చే అంటి ఆక్సిడెంట్స్ అందుతాయి .
డైయాబెటిస్ నేను జయించిన విషయం .
నా బిపి 112- 114 / 69-72 .
గుండె కొట్టుకోవడం 60 ..
అంటే రెండూ బెస్ట్ అన్న మాట .
ఊబకాయం పోయింది .
ఒంట్లో కొవ్వు కేవలం 12 శాతం.
కండరాలు పటిష్టం .
సర్కోపెనీయా కు నేనంటే భయం .. దరి చేరదు .
బోన్ డెన్సిటీ రెండు దాక .
నా పాంట్స్ వైస్ట్ సైజు 28-30 { బ్రాండ్ బట్టి }
ఎక్కువ చెబితే సొంత డబ్బా అన్పిస్తుంది .
మోటివేట్ చెయ్యాలి అంటే చెప్పాలి .
ఇదే డైలమా !
ఈ పోస్ట్ చూసాక మా శ్రీమతి " ఇన్ని వివరాలు పబ్లిక్ గా చెప్పడం అవసరమా ? అందరి కళ్ళు ఒకేలా ఉండవు . దిష్టి తగులుతుంది "అనడం ఖాయం .
ఇరుగు దిష్టి .. పేస్ బుక్ దిష్టి .. ఫార్మాసురుడి దిష్టి .. తూ .. తూ .
ఆహారం .. ఆరోగ్యానికి రహదారి .
నా ఆదివారం ఆహారంలా వారమంతా తింటే అనారోగ్యం సమస్యలు ఖాయం .
ముఖ్య గమనిక . శాఖాహార మిత్రులు ...
అన్ని సార్లు నాన్ వెజ్ గురించి చెప్పి మీకు వాక్ తెప్పించినందుకు క్షమాపణలు .
శాకాహారం తో తో కూడా అన్ని ప్రయోజనాలు సాధించవచ్చు .
మీ ఫుడ్ గొప్పది . నేను అది చెయ్యలేను .
శాఖాహారులు
ప్రోటీన్స్ కోసం ..పన్నీర్ .. పుట్టగొడుగులు .. పప్పు దినుసులు వాడాలి .

చదువు రాదా ? చదవడం రాదా ? పోస్ట్ చేసింది చదువు ! ఇంకా వివరం కావాలంటే మర్యాదగా అడుగు!

Don't you know how to study? Don't you know how to read? Read what posted ! Ask politely if you want more details!
Don't you know how to study? Don't you know how to read? Read what posted ! Ask politely if you want more details!
స హింస నాయనా !
డయాబెటిస్ టైపు -2 కు .. అల్లోపతి మందులు తీసుకొంటే నయం అయిపోతుంది .. లేదా మానేజ్ చేసుకోవచ్చు అని చాలా మంది అనుకొంటారు .
ఇందులో నిజమెంత ?
డయాబెటిస్ వచ్చిన తొలి రోజుల్లో డాక్టర్స్ మెట్ఫార్మిన్ ఇస్తారు .
సాధారణంగా తొలిదశలో 500 mg టాబ్లెట్ రోజుకు ఒకటి లేదా రెండు తీసుకోవాలి అంటారు .
కాలం గడిచే కొద్దీ ఈ డొసేజ్ పెంచుతూ పోతారు ..
1000 mg .. 2000 mg .. ఇలా
మెట్ఫార్మిన్ వల్ల సాధారణంగా బి 12 విటమిన్ లోపం ఏర్పడుతుంది . బి 12 లోపం నాడులను , మెదడును మూడ్ ను రక్తాన్ని నెగటివ్ గా ప్రభావితం చేస్తుంది .
మెట్ఫార్మిన్ వాడడం వల్ల ఆకలి తగ్గిపోతుంది .దీనితో బరువు తగ్గుతారు . కొవ్వు తగ్గిపోతుంది . అంతదాకా ఓకే . కానీ కండరాలు బలహీన పడిపోతే .. ఎముకలు పెళుసుబారి పొతే అనేక అనారోగ్య సమస్యలు .
ఒక దశలో మెట్ఫార్మిన్ సరిపోదు . 2000 mg దశ తరువాత ఇన్సులిన్ కు షిఫ్ట్ కావాల్సి వస్తుంది .
ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి .
సైన్స్ ఏమి చెబుతుంది అంటే తప్పు మెట్ఫార్మిన్ ది కాదు .. ఇన్సులిన్ ది కాదు . వ్యక్తి కేవలం మందులపై ఆధారపడి జీవన శైలి లో ఎలాంటి మార్పులు తీసుకోక పోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి అని .
నాకు 16 ఏళ్ళ క్రితం డయాబెటిస్ వచ్చింది . సుమారుగా ఆరునెలల పాటు నేను కూడా మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ తీసుకొన్నాను . పొట్ట తగ్గింది . కండరాలు కూడా కరిగి పోయాయి . ఏనుగులా ఉన్నోడు పీనుగులా తయారు అయ్యాను . ఆ దశలో నేను డయాబెటిస్ గురించి లోతుగా అధ్యయనం చేశాను . అనేక విషయాలు అర్థం చేసుకొన్నాను . నా పై నేనే ప్రయోగాలు చేసుకొన్నాను . మందులు తినడం ఆరునెలల కే ఆపేసాను .
16 ఏళ్లుగా డయాబెటిస్ కోసం ఎలాంటి మందులు తీసుకోలేదు . ఇదిగో ఇప్పుడు యిలా ఉన్నాను . నిన్న ఆప్లోడ్ చేసిన నా ప్రొఫైల్ పిక్ చూడండి .
2013 అనుకొంటాను .. తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగి కారులో వెళుతుంటే మా బంధువు శివకుమార్ " మీరు పాటిస్తున్నదానిలో ఫలానా ఆయన చెబుతున్నారు . కాకపోతే అది కీటో డైట్ "
.. కీటో డైట్ అంటే కేవలం కొవ్వు ను ఆహారం గా తీసుకోవడం .
జీవితం లో ఒక్క రోజు కూడా నేను కీటో డైట్ తీసుకోలేదు . దాని మంచి చెడు గురించి నాకు తెలియదు .
నాకు తెలిసిన విజ్ఞానాన్ని ఫేస్బుక్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాను . చివరకు విద్య విషయక కౌన్సిలింగ్ లో కూడా గంట కౌన్సెలింగ్ ఫ్రీ గా ఇస్తున్నాను .
మాయా లేదు . మర్మం లేదు బాబు .. ఇది ప్యూర్ సైన్స్ .
నేను చేబుతున్నది చిట్కా వైద్యం కాదు .
డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ .
అధిక మొత్తం లో కార్బ్స్ . అదీ సింపుల్ కార్బ్స్ తినడం వల్ల .. ఎలాంటి వ్యాయామం చేయక పోవడం వస్తుంది .
కాబట్టి నేను చేస్తున్నది ..
తక్కువ మొత్తంలో కార్బ్స్ తీసుకోవడం . అదీ కాంప్లెక్స్ కార్బ్స్ అయ్యేలా చూసుకోవడం .ఎక్కువ మూతం లో ప్రోటీన్స్ పీచు తీసుకోవడం . ఆరోగ్య కరమయిన కొవ్వు పదార్థాలు తీసుకోవడం . ఇదీ డైట్ లో నేను తెచ్చిన మార్పు .
ఇక ...
తొలి దశలో నడక .. గత ఆరేళ్లుగా జిం లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ .
నాలుగు లీటర్ల నీరు .. ఎనిమిది గంటల నిద్ర
ఇలా చేస్తే దియాబెటిస్ అదుపులోకి వస్తుందా ?
ఒక పని చెయ్యండి . ఓపిగ్గా 2010 , 2015, 2020 నాటి నా ఫోటోలు చూడండి { ఫేస్బుక్ లో వెదకాలి } .
నేటి నా ఫోటో చూడండి . నా ఏజ్ పెరుగుతుందా ?తగ్గుతుందా? మీరే చెక్ చేసుకోండి .
బండరాయిలా కలకాలం ఇక్కడే ఉండిపోము . నిజమే . కానీ బతికినన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలి కదా ??
"అయ్యా నీ సొంత కపిత్వం ఎందుకు .. సైన్స్ చెప్పు" అని మీలో ఎవరైనా అడగొచ్చు .
the lancet .2018. 391{10120 }: 541-551 . ఆన్లైన్ published 2017
look ఎహెడ్ ట్రయల్ - INTENSIVE లైఫ్ STYLE .
RESET ఫర్ REMMISSION TRAIL -2026
రాస్తూ పొతే లిస్ట్ చెందాడు అంత . వందల కొద్దీ సైంటిఫిక్ ఋజువులు .
సైన్స్ చెప్పేది ఇదే .. డాక్టర్స్ చెప్పేది ఇదే{ కొంతమంది అశ్వద్ధామ అథః కుంజరః టైపులో చెబుతారు }
.. నేను పాటిస్తున్నది ఇదే .
పాయింట్ చాల సింపుల్ .
డయాబెటిస్ లైఫ్ స్టైల్ గతి తప్పడం వల్ల వచ్చింది .
దానిలో మార్పు తీసుకొని రాకుండా ఇది పోదు .
మెట్ఫార్మిన్ వాడినా... లైఫ్ స్టైల్ లో మార్పులేకపోతే 500 .. 1000 ఆపై 2000 .. అటుపై ఇన్సులిన్ .. చివరకు గాంగ్రీన్ .. గుండెపోటు .. లేదా పక్షవాతం .. బతుకు బస్టాండ్ .. చివరకు మహా ప్రస్థానం .
వాసిరెడ్డి అమర్నాథ్ లా పట్టుదల ఉంటే డయాబెటిస్ మీ పాలిట వరం అయిపోతుంది .
జీవన శైలి లో పెద్ద స్థాయిలో మార్పులు .. మరింత ఫిట్ .. ఎనేర్జిటిక్ .. యంగ్ ..
అంత ఓపిక లేదు అనుకొంటే తీసుకోండి .. ఇంగ్లీష్ మందులు తీసుకోండి . మందులు తీసుకొన్నామా .. ఇక హ్యాపీ అని తెగ తింటే చివరకు అధోగతి .
మందులు తీసుకొన్నా జీవ శైలి లో మార్పులు తప్పవు అనేది సైన్స్ .
నేను చెప్పేది కరెక్ట్ అవునో కాదో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను అడగండి . నా గురించి కృతిమ మేధకు తెలియక పోవచ్చు . కానీ జీవన శైలి లో మార్పులు తీసుకొని వచ్చి డయాబెటిస్ ను జయించవచ్చా ?{ అత్యధిక శాతం వ్యక్తుల్లో } లేదా? అని అడగండి . అదే విధంగా మెట్ఫార్మిన్ వాడినా లైఫ్ స్టైల్ మార్పులు ఎందుకు అవసరమో అడగండి . మేథోర్మిన్ ది తప్పు కాదు .. ఇన్సులిన్ ది తప్పు కాదు . జీవన శైలి లో మార్పు తేని వ్యక్తులదే తప్పు అని అది కవరింగ్ ఇస్తుంది .. . నా ప్రశ్న ఏంటంటే ఇదే ఉంటే అదెందుకు ?
నూటికి ఎనభై మంది మనుషుల్లో కేవలం జీవన శైలి మార్పులతో దాన్ని జయించవచ్చు . ఇక మందులెందుకు మాకులెందుకు ? ఒక దానికి టాబ్లెట్ వేసి ఇంకో సమస్య తెచ్చుకోవడం ఎందుకు ?
స హింస నాయనా !
In most cases, high school students are unable to read their own textbook and the finished lesson!
చాలా బడుల్లో తమ సొంత పాఠ్య పుస్తకాన్ని , అదీ పూర్తయిన పాఠాన్ని చదవలేని స్థితిలో ఉన్నత తరగతుల విద్యార్థులు !
మాకు మేము తీసుకొన్న సవాలు !
నర్సరీ , LKG - కొత్త పదాలు
యూకేజీ - కొత్త వాక్యాలు !
ఒకటి , రెండు తరగతులు - అదే తరగతి పాఠ్య పుస్తకం .. కానీ ఇంకా భోదించని పాఠం
3-10 - తమకంటే రెండు మూడు పై తరగతుల పుస్తకం
మా విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ - తల్లి తండ్రుల ముందు ప్రదర్శించి వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేలా చూసే కార్యక్రమం !
మేధ మనన మహోత్సవ్ - MMM
దీని ప్లానింగ్ కోసం మా బడి డీన్స్ ప్రిన్సిపాల్స్ మీటింగ్ కోసం బయలుదేరుతూ !
In most cases, high school students are unable to read their own textbook and the finished lesson!
The story is good. The ending is not good.
The story is good. The ending is not good.
మంచికి చెడుకు ... మోసానికి నిజాయతీకి .. అనాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది .
యుద్ధం లో మంచి గెలిచింది కాబట్టే... మానవాళి అంతరించిపోకుండా మనుగడ సాగిస్తోంది .
అలాగని ప్రతి సారి మంచి గెలిచిందని .. గెలిచిందల్లా న్యాయమని కాదు .
ఆహారం , విద్య, వైద్యం , రాజకీయం , కులం , మతం .. ఇలా రకరకాల పద్ధతుల్లో మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .
తెలివి తక్కువ మోసగాడు తక్కువ సమయంలో పట్టుబడి పోతాడు .
బాగా తెలివున్న మోసగాడు జీవితాంతం మోసం చేస్తూనే ఉంటాడు .
మోసపోవడానికి మనం సిద్ధంగా ఉన్నంత కాలం మోసగాళ్ల ఆటలు సాగుతుంటాయి . కొత్త మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు .
1. తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు మోసగాడు ముదిరి రాజకీయుడు అవుతాడు .
రాజకీయనాయకుల ఆలోచనలు .. అనుసరించే పద్ధతులు మామూలుగా ఉండవు .
అది నెక్స్ట్ లెవెల్ .
రాజకీయనాయకుడి కి దగ్గరైతే లబ్ది పొందవచ్చు అని చాలా మంది అనుకొంటూ వుంటారు .
నీకు వెయ్యి ఇచ్చి .. నీ దగ్గర లక్ష కొట్టే వాడే రాజకీయనాయకుడు .
నువ్వు రాజకీయ నాయకుడికి దగ్గరైనా.. రాజకీయనాయకుడు నీకు దగ్గరైనా చిరిగేది నీకే .
సామాన్యుడి ఊహకు కూడా అందకుండా దోచేయడమే రాజకీయుడి చాణక్యం .
2. చిన్న చిన్న మోసాలు చేసి పోలీస్ లకు దొరికితే వొళ్ళు హూనం అయిపోతుంది .
రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు .
మంచి తెలివి , కొంత మేర ఇంద్రజాల, మహేంద్ర జాల, గజకర్ణ గోకర్ణ నేపాలీ టక్కుటమార విద్యలు తెలిస్తే .. గాడ్ మాన్ అవతారం ఎత్తితే .. అపార సంపద, జనాదరణ లభిస్తుంది .
పచ్చి క్రిమినల్ అయినా కలెక్టర్ ఎస్పీ వచ్చి సెల్యూట్ చేసిపోతారు .
భారత దేశంలోని అన్ని ప్రధాన మతాల్లో దేవుడు పేరు చెప్పి ఘోరమయిన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి .
మతమేదయినా సులభంగా లబ్ది పొందాలి అనే ఆకాంక్షే భారతీయులను మోసానికి గురి చేస్తోంది .
మన అప్రమత్తతే మనకు రక్ష .
కుశాగ్ర బుద్ధి .. ఇదే మన ఆయుధం
జీవితంలో దేనికి అడ్డదారులు లేవు .
ఉన్నది ఒకటే దారి .. రహదారి .
ఆ దారిలో ముందుకు సాగాలి అంటే ఓపిక, శ్రమ , పట్టుదల ఉండాలి .
తక్కువ ప్రయత్నం తో ఎక్కువ లబ్ది పొందాలి అనే అత్యాశే మనల్ని మోసగాళ్లకు బకరాగా మారుస్తుంది .
ఇంతబతుకు బతికినా నేను ఏనాడు .. ఈ రాజకీయనాయకుడు దగ్గరకు పోలేదు . ఏదైనా వేదిక పై తారసపడితే మర్యాద కోసం నమస్కారం చెప్పి వచ్చేయడమే .
ఎప్పుడో రెండేళ్ల కు ఒకసారి మా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవడమే కానీ .. ఈ రోజూ ఏ గాడ్ మాన్ దగ్గరకు పోలేదు .
శ్రమను పనిని నమ్ముకొన్నవాడిని . అడ్డదార్లు నాకెందుకు ?
గుడ్ ఈజ్ గాడ్ .
వర్క్ ఈజ్ వర్షిప్ ..
ఇదే నేను నమ్మిన సూత్రం
మా అమ్మ మరణం తరువాత ఆమెపై షార్ట్ ఫిలిం తయారు చేశాను .
అందుకోసం మూడు రోజులు స్క్రిప్ట్ రాసాను .
ఆ సందర్భంగా నేను బాల్య స్మృతుల్లోకి బలంగా వెళ్ళిపోయాను .
నా జీవితం లో నాకు ఒక దశ వరకు వరుసబెట్టి కష్టాలు వచ్చాయి .. స్క్రిప్ట్ రాస్తూ నా గత కష్టాలను తలుచుకొంటూ నా పై నేను సెల్ఫ్ పీటీ డెవలప్ చేసుకొన్నాను . మన పై మనం జాలి పడడం ఒక మానసిక రోగం .
వారణాసికి పోయే దాక అదే ఆలోచనలు .
అక్కడ వదిలేసి వచ్చాను సెల్ఫ్ పీటీ ని .
నాకొచ్చిన కష్టాలు అన్నీ అటుపై అనుకూలతలుగా మారాయి .
నేను ఒకప్పుడు అనుకొన్నది జరిగి ఉంటే జీవితం ఇంత వైవిధ్య భరితంగా ఉండేది కాదు .
నా ప్రతి అపజయాన్ని ద్విగుణీకృత పట్టుదలతో విజయ సోపానంగా మార్చుకున్నాను అంటే అది ఇగో తో కూడిన సొంత డబ్బా అవుతుంది
ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే కొంతమందికి అశాస్త్రీయంగా .. సెంటిమెంట్ గా అనిపించవచ్చు .
కానీ .. ఇది చూడండి
2020 నవంబర్ మొదటి వారం .. డాక్టర్ గోపాల్- సన్షైన్ ఆసుపత్రి .. నా డిశ్చార్జ్ సందర్భంగా చెప్పిన మాటలు ." మీకు వచ్చిన చోటే బ్లడ్ క్లోట్స్ .. గతం లో ఇద్దరికీ వచ్చాయి . నేనే చికిత్స చేశాను ఒకాయన ఇరవై ఏళ్లుగా ఇంకా బెడ్ పైనే . ఇంకో ఆయన కష్టపడి బెడ్ పైనుంచి లేచి బాత్ రూమ్ దాక వెళ్లగలుగుతున్నారు . మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు . చివరకు నేను కూడా నమ్మను . ఇదో మెడికల్ మిరకిల్ ."
మా అమ్మ మరణం తరువాత ఆమె ఆభరణాలు .. ఊళ్ళో ఇల్లు పొలం .. మా అమ్మ నాన్న సంపాదించిన సంపాదించిన ఆస్తి మా చెల్లికి ఇచ్చేసాను .
నేను వృత్తి విషయంలో గత అయిదు రోజులు విదేశాల్లో ఉన్నాను . ఆ సమయంలో ఉష పుట్టింటికి వెళ్లి ఆమె అమ్మగారు ఇచ్చిన ఆస్తిని వారికి ఇచ్చేసి వచ్చింది .
పనిని నమ్ముకోండి ..
మంచి మార్గాన్ని ఎంచుకోండి .
దేవుడున్నాడు ..
కానీ ఇలా పిలిస్తే ఆలా పలకడు .
మనకంత సీన్ లేదు .
లక్షలమంది మతం పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి మోసం చేస్తూ ఉండవచ్చు గాక .
దీని అర్థం దేవుడు లేడనో .. లేదా మూగపోయాడు అనో కాదు .
యత్నం .. ప్రయత్నం .. దైవ యత్నం
మతం .. దేవుడు ..
ఈ టాపిక్ అర్థం కావాలంటే చాల మానసిక పరిణతి కావాలి .
శుభోదయం . గుడ్ మార్నింగ్

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026